- Telugu News Photo Gallery Cricket photos IND vs WI Ravindra Jadeja may breaks Courtney Walsh and Kapil Dev's ODI record against West Indies odi series
IND vs WI: కోర్ట్నీ వాల్ష్- కపిల్ దేవ్ రికార్డులకు బ్రేకులు.. సిద్ధమైన టీమిండియా ఆల్ రౌండర్.. లిస్టులో ఎరున్నారంటే?
Ravindra Jadeja: వెస్టిండీస్‌తో టెస్ట్ సిరీస్‌తో టీమిండియా తన కొత్త ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ సైకిల్‌ను కూడా ప్రారంభించనుంది. రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ తర్వాత మూడు వన్డేల సిరీస్ ప్రారంభం కానుంది.
Updated on: Jul 03, 2023 | 12:37 PM

ప్రపంచకప్‌కు దూరమైన వెస్టిండీస్ జులైలో భారత్‌తో 2 టెస్టులు, 3 వన్డేలు, 5 టీ20 మ్యాచ్‌లు ఆడేందుకు సన్నాహాలు ప్రారంభించింది. టీమిండియా ఆటగాళ్లు ఒక్కొక్కరుగా వెస్టిండీస్‌కు చేరుకుంటున్నారు.

వెస్టిండీస్‌తో టెస్ట్ సిరీస్‌తో టీమిండియా తన కొత్త ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ సైకిల్‌ను కూడా ప్రారంభించనుంది. 2 టెస్టుల తర్వాత 3 వన్డేలు జరగనున్నాయి.

అయితే, ఈ వన్డే సిరీస్‌లో టీమిండియా ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా ఇద్దరు దిగ్గజాల రికార్డును బద్దలు కొట్టే దిశగా దూసుకుపోతున్నాడు. నిజానికి భారత్, వెస్టిండీస్ మధ్య వన్డేల్లో అత్యధిక వికెట్లు పడగొట్టే దిశగా జడేజా కదులుతున్నాడు.

ఇప్పటి వరకు భారత్, వెస్టిండీస్ వన్డే సిరీస్‌లలో కరీబియన్ దిగ్గజం కోర్ట్నీ వాల్ష్ అత్యధిక వికెట్లు పడగొట్టాడు. కపిల్ దేవ్ టీమిండియా తరపున అత్యధిక వికెట్లు తీసిన ప్లేయర్. ఈ ఇద్దరు క్రికెటర్లు ప్రస్తుతం క్రికెట్ ఆడటం లేదు. తద్వారా అత్యధిక వికెట్లు తీసిన ఆటగాడిగా జడేజా రికార్డు సృష్టించే అవకాశం లభించింది.

ప్రస్తుతం భారత్, వెస్టిండీస్ వన్డే సిరీస్‌లలో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో జడేజా మూడో స్థానంలో ఉన్నాడు. వెస్టిండీస్‌తో ఇప్పటివరకు 29 వన్డేలు ఆడిన రవీంద్ర జడేజా 41 వికెట్లు పడగొట్టాడు.

కరీబియన్ దిగ్గజం కోర్ట్నీ వాల్ష్ భారత్‌తో 38 వన్డేల్లో 44 వికెట్లతో అగ్రస్థానంలో ఉన్నాడు.

మరోవైపు, కరేబియన్‌తో జరిగిన 42 వన్డేల్లో 43 వికెట్లతో ఇరు జట్ల మధ్య జరిగిన ఎన్‌కౌంటర్‌లో అత్యధిక వికెట్లు తీసిన 2వ బౌలర్‌గా భారత దిగ్గజం కపిల్ దేవ్ నిలిచాడు.

వెస్టిండీస్‌తో ఆడేందుకు ఇప్పటికే బార్బడోస్ చేరుకున్న జడేజా.. ఈసారి వెస్టిండీస్‌తో జరగనున్న మూడు వన్డేల్లో మరో 4 వికెట్లు పడగొట్టి, రికార్డు నెలకొల్పేందుకు రెడీ అయ్యాడు.




