‘రాహుల్ తప్పు మాట్లాడితే ఏ శిక్షకైనా సిద్ధం’.. బీఆర్ఎస్ మంత్రులకు రేవంత్ రెడ్డి సవాల్..
Revanth Reddy: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆదివారం జరిగిన ఖమ్మం ‘జనగర్జన సభ’లో ఏమైనా తప్పులు మాట్లాడినట్టు ఉంటే ఎలాంటి శిక్షకైనా తాను సిద్దమని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. తన నివాసంలో సోమవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో..
Revanth Reddy: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆదివారం జరిగిన ఖమ్మం ‘జనగర్జన సభ’లో ఏమైనా తప్పులు మాట్లాడినట్టు ఉంటే ఎలాంటి శిక్షకైనా తాను సిద్దమని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. తన నివాసంలో సోమవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘‘రాహుల్‌ని విమర్శిస్తే తమను తాము విమర్శించుకున్నట్లే. ‘మేం ఉండే వేదికపైకి బీఆర్ఎస్ నేతలను రానివ్వమ’ని రాహుల్ చెప్పారు. 75 రూపాయిలున్న పెన్షన్ 200 చేసింది మేమే.. 4000 పెన్షన్‌పై అనుమానాలుంటే చర్చ పెట్టండి. మేం అవగాహన కల్పిస్తాం. రాష్ట్రాల పరిస్థితులను బట్టి పాలసీలు ఉంటాయి. ఒక్కో రాష్ట్రంలో ఒక్కో ప్రాధాన్యత ఉంటుంద’ని రేవంత్ పేర్కొన్నారు.
ఇంకా కేంద్రంలో పదేళ్లపాటు కాంగ్రెస్ అధికారంలో ఉన్నా రాహుల్ గాంధీ పదవి తీసుకోలేదని రేవంత్ రెడ్డి అన్నారు. గాంధీ కుటుంబం గురించి మాట్లాడే అర్హత బీఆర్‌ఎస్ నేతలకు లేదన్నారు. పదేళ్లలో బీఆర్‌ఎస్ ప్రభుత్వం ఏం చేసిందో చెప్పాలని ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు రాహుల్ గాంధీ సహకరించారని.. రాష్ట్రం వచ్చిన తర్వాత ఈ పదేళ్లలో బీఆర్‌ఎస్ ఏం చేసిందో చెప్పాలని చర్చకు సిద్దామా అంటూ తెలంగాణ మంత్రులు హరీష్‌రావు, కేటీఆర్‌కు రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి.