Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: పండుగ పూట మానుకోని పాడు పని.. కేసులైన మారని యాజమాన్యం తీరు..!

సింగరేణి ఖిల్లా మంచిర్యాల‌ జిల్లా మళ్లీ పాడు పనులకు అడ్డాగా మారుతోంది. పోలీసులు ఫోకస్ పెట్టినా.. వరుస కేసులు నమోదు చేస్తున్నా మంచిర్యాల జిల్లా కేంద్రంలో మాత్రం కొందరిలో అస్సలు‌ మార్పు రావడం లేదు. ఆ సుఖం కోసం జైలు ఊచలు లెక్కపెట్టినా నో ప్రాబ్లం అన్నట్టుగా తీరు కనిపిస్తోంది.

Telangana: పండుగ పూట మానుకోని పాడు పని.. కేసులైన మారని యాజమాన్యం తీరు..!
Lodge Room
Follow us
Naresh Gollana

| Edited By: Balaraju Goud

Updated on: Sep 08, 2024 | 12:25 PM

సింగరేణి ఖిల్లా మంచిర్యాల‌ జిల్లా మళ్లీ పాడు పనులకు అడ్డాగా మారుతోంది. పోలీసులు ఫోకస్ పెట్టినా.. వరుస కేసులు నమోదు చేస్తున్నా మంచిర్యాల జిల్లా కేంద్రంలో మాత్రం కొందరిలో అస్సలు‌ మార్పు రావడం లేదు. ఆ సుఖం కోసం జైలు ఊచలు లెక్కపెట్టినా నో ప్రాబ్లం అన్నట్టుగా తీరు కనిపిస్తోంది. నెల రోజులుగా ఇందుగలడు అందు లేడు అన్నట్టుగానే క్రైం కేసులు నమోదవుతా ఉంటే.. విచ్చలవిడితనంతో చేస్తున్న వ్యభిచార కేసుల సంఖ్యే ఎక్కువగా ఉన్నట్టు పోలీసుల కేసుల లెక్కలు చెపుతున్నాయి. జిల్లా కేంద్రంలోని ఓ లాడ్జ్ అయితే ఆ వ్యవహారాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారినట్టు గుర్తించిన పోలీసులు వరుసగా విటులను అరెస్ట్ చేస్తూ కేసులు నమోదు చేసిన సీన్ లో మాత్రం ఏ మార్పు రావడం లేదంట.

మంచిర్యాల జిల్లా కేంద్రం బెల్లంపల్లి చౌరస్తా లోని ఓ లాడ్జిలో విచ్చలవిడిగా వ్యభిచార రంకు సాగుతోందన్న ఆరోపణలు ఉన్నాయి. ఒక్కొక్కరుగా వస్తే నో ఎంట్రీ.. జంటగా వస్తేనే ఎంట్రీ అంటూ బంపర్ ఆఫర్ ఇస్తోంది సదరు లాడ్జి యాజమాన్యం. గంటకు ఇంతా అంటూ ఏకంగా రేట్లు కూడా పిక్స్ చేసిన లాడ్జి ఓనర్ ఆఫర్ తో డే అండ్ నైట్ ఆ లాడ్జి కిటకిటలాడుతోంది. ఈ సమాచారం అందుకున్న పోలీసులు గత రెండు నెలల క్రితం లాడ్జిపై దాడి చేసి విటులను అరెస్ట్ చేశారు. అయినా లాడ్జిలో సీన్ మారలేదు. మళ్లీ అదే స్టైల్ లో వ్యవహారం సాగడంతో సీరియస్ గా తీసుకున్న పోలీసులు మరోసారి రైడ్ చేసి ఆరు జంటలను అదుపులోకి తీసుకున్నారు. ఆరుగురు విటులతో పాటు లాడ్జి మేనేజర్‌ను అరెస్టు చేసి, ఓనర్ మీద కేసు సైతం పెట్టారు. అమ్మాయిలను సఖి సెంటర్‌కు తరలించారు.

మంచిర్యాల పట్టణానికి చెందిన సిరిపురం శ్రీనివాస్ బెల్లంపల్లి చౌరస్తా సమీపంలో సాయినాథ్ రెసిడెన్సీ అనే లాడ్జిను నిర్వహిస్తున్నాడు. ఇందులో వ్యభిచారం జరుగుతుందన్న సమాచారంతో మూడు రోజుల క్రితం లాడ్జి మీద దాడి చేయగా ఆరు జంటలు పట్టుబడ్డాయి. విటులు సుంకరి శివయ్య (ఆకెనపల్లి, బెల్లంపల్లి), మందాల శివ ఆశిష్ (గోదావరిఖని), గోస్కుల ప్రశాంత్ (వెల్గటూర్), ఆకుల ప్రశాంత్ (గోదావరిఖని), రౌతు కార్తీక్ (గోదావరిఖని), తిరుపతి (లక్సెట్టిపేట) అనే వ్యక్తుల ను అరెస్టు చేశామన్నారు మంచిర్యాల‌ సీఐ బన్సీలాల్‌. లాడ్జిలోని రూముల్లో మహిళలతో రెండు గంటలు గడపడానికి లాడ్జి మేనేజ్‌మెంట్ రూ.1,100 వసూలు చేస్తోందని.. డబ్బులు తీసుకొని వ్యభిచారాన్ని ప్రోత్సహిస్తున్నట్టు విచారణలో తేలిందన్నారు సీఐ. మేనేజర్ మోటం జనార్దన్‌ను సైతం అరెస్టు చేశామని తెలిపారు.

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..