AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyderabad: నిందితుడి బ్యాంక్ అకౌంట్ నుంచే డబ్బు కొట్టేసిన పోలీస్ బాస్.. రూ. 5 లక్షలు స్వాహా..

Hyderabad: దొంగతనం చేసిన వారిని పోలీసులు అరెస్ట్ చేస్తుంటారు. అలాంటిది పోలీసే దొంగ అయితే ఎలా ఉంటది. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నప్పటికీ ఇలాంటి ఘటన చోటుచేసుకుంది. అసలు మ్యాటర్ ఏమిటంటే..

Hyderabad: నిందితుడి బ్యాంక్ అకౌంట్ నుంచే డబ్బు కొట్టేసిన పోలీస్ బాస్.. రూ. 5 లక్షలు స్వాహా..
Crime News
Ayyappa Mamidi
|

Updated on: May 10, 2022 | 2:01 PM

Share

Hyderabad: దొంగతనం చేసిన వారిని పోలీసులు అరెస్ట్ చేస్తుంటారు. అలాంటిది పోలీసే దొంగ అయితే ఎలా ఉంటది. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నప్పటికీ ఇలాంటి ఘటన చోటుచేసుకుంది. అసలు మ్యాటర్ ఏమిటంటే.. రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలో జైలులో ఉన్న ఓ నిందితుడి బ్యాంక్ అకౌంట్ నుంచి స్వయంగా పోలీస్ బాసే రూ. 5 లక్షలు స్వాహా చేశాడు. ఈ విషయం ఇప్పుడు సంచలనంగా మారింది.

టైర్లు దొంగిలించిన నిందితుడి వద్ద నుంచి రూ. 5 లక్షలు స్వాహా చేసిన కేసులో రాచకొండకు చెందిన ఇన్‌స్పెక్టర్‌పై విచారణ ప్రారంభమైంది. నిందితుడు జైలులో ఉన్నప్పుడు ఇన్‌స్పెక్టర్.. అతని బ్యాంక్ అకౌంట్ నుంచి డబ్బులు విత్ డ్రా చేసినట్టు వెల్లడైంది. ఫిబ్రవరి నెలలో ఓ చోరీ కేసులో నిందితుడు అగర్వాల్‌ని సెంట్రల్ క్రైమ్ స్టేషన్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ సమయంలో పోలీసులు.. నిందితుడు అగర్వాల్ డెబిట్ కార్డును స్వాధీనం చేసుకున్నారు. తీరా బెయిల్ పొంది బయటకు వచ్చిన తరువాత తన బ్యాంక్ ఖాతా నుంచి కార్డు వినియోగించి భారీగా డబ్బు విత్‌డ్రాలు జరిగినట్లు తెలుసుకుని ఆశ్చర్యపోయాడు. అసలు ఎంత సొమ్ము పోయిందో తెలుసుకునేందుకు బ్యాంకును సంప్రదించాడు. ఈ విషయాన్ని వెంటనే రాచకొండ పీఎస్‌కు చెందిన ఉన్నతాధికారులకు తెలిపాడు. బాధితుడు పోలీసులను ఆశ్రయించటంతో రాచకొండ కమిషనర్ మహేశ్ భగవత్ అంతర్గత విచారణకు ఆదేశించారు. విచారణలో ఓ ఇన్స్పెక్టర్ ఈ అక్రమానికి పాల్పడినట్లు తేలింది. దీనిపై ఇంకా పూర్తి స్థాయిలో దర్యాప్తు కొనసాగుతోంది.

మరిన్ని తెలంగాణ వార్తలు వివరాలు క్షిక్ చేయండి

ఇవి కూడా చదవండి

ఇవీ చదవండి..

Cement Deal: దిగ్గజ సిమెంట్ కంపెనీలను చేజిక్కించుకోనున్న అదానీ గ్రూప్, JSW గ్రూప్‌.. చివరి దశకు చర్చలు..

Mahbubnagar Attack: దారుణం.. వంట పాత్రలు కడగమన్నందుకు తల్లిపై కూతురు కర్కశత్వం.. గొంతు కోసి..