Snakes: అధిక ఉష్ణోగ్రతలతో బయటకు వస్తున్న పాములు.. వందలాది పాముల పట్టివేత

Snakes: తెలంగాణ రాష్ట్రంలో భారీగా ఉష్ణోగ్రత‌లు న‌మోదు అవుతున్నాయి. హైద‌రాబాద్ న‌గ‌రంలోనూ 40 డిగ్రీల‌కు పైనే ఉష్ణోగ్రత‌లు న‌మోదు కావ‌డంతో ఉక్కపోత మరింతగా పెరిగింది...

Snakes: అధిక ఉష్ణోగ్రతలతో బయటకు వస్తున్న పాములు.. వందలాది పాముల పట్టివేత
Follow us
Subhash Goud

|

Updated on: May 10, 2022 | 1:14 PM

Snakes: తెలంగాణ రాష్ట్రంలో భారీగా ఉష్ణోగ్రత‌లు న‌మోదు అవుతున్నాయి. హైద‌రాబాద్ న‌గ‌రంలోనూ 40 డిగ్రీల‌కు పైనే ఉష్ణోగ్రత‌లు న‌మోదు కావ‌డంతో ఉక్కపోత మరింతగా పెరిగింది. అయితే ఈ ఉష్ణోగ్రత‌లు భారీగా పెరుగుతున్నందున భూ రంధ్రాల‌తో పాటు చెట్ల పొద‌లు, మ‌ట్టి గోడ‌ల్లో దాగి ఉన్న పాములు బ‌య‌ట‌కు వ‌స్తున్నాయి. పాములు అంటే అందరికి భయమే. ఇలా భూమిలో వేడి కారణంగా పాములన్ని బయటకు రావడంతో జనాలు జంకుతున్నారు. పరిసర ప్రాంతాల్లోకి రావడంతో భయాందోళనలకు గురవుతున్నారు. దీంతో పాములు కనిపించగానే వెంటనే అధికారులకు సమాచారం అందిస్తున్నారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో 600 పాములను పట్టుకున్నట్లు ఎన్జీవో సంస్థ ఫ్రెండ్స్ స్నేక్స్ సొసైటీ తెలిపింది.

ఈ సంఖ్య మార్చి నాటికి 800ల‌కు చేరవచ్చని పేర్కొంది. ఇక ఏప్రిల్ మాసంలోనే ఏకంగా 800ల‌కు పైగా పాముల‌ను ర‌క్షించిన‌ట్లు స్నేక్స్ సొసైటీ ప్రతినిధులు వెల్లడించారు. అయితే ఏప్రిల్, మే నెల‌ల్లో అత్యధిక ఉష్ణోగ్రతల కారణంగా పాములు వేడిని తట్టుకోలేక ఇలా బయటకు వస్తున్నాయని చెబుతున్నారు. ఏప్రిల్, మే నెల‌లు నాగుపాము, ర్యాట్ స్నేక్‌కు సంతానోత్తికి అనుకూలంగా ఉంటాయ‌ని పేర్కొన్నారు. నగరంతో పాటు అధిక సాంద్రత ఉన్న ప్రాంతాల్లో పాములను ఎక్కువగా పట్టుకున్నట్లు స్నేక్స్ సొసైటీ ప్రతినిధులు తెలిపారు. మే రెండో వారం నుంచి ఈ సంఖ్య త‌గ్గే అవ‌కాశం ఉంద‌న్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఇవి కూడా చదవండి
రేపు అయ్యప్ప మండల పూజ.. భక్త జన సంద్రంగా శబరిమల..
రేపు అయ్యప్ప మండల పూజ.. భక్త జన సంద్రంగా శబరిమల..
బలపడిన అల్పపీడనం.. వచ్చే 3రోజులు వానలే వానలు! పిడుగులు పడే ఛాన్స్
బలపడిన అల్పపీడనం.. వచ్చే 3రోజులు వానలే వానలు! పిడుగులు పడే ఛాన్స్
Horoscope Today: ఆ రాశి ఉద్యోగులకు పని భారం పెరిగే ఛాన్స్..
Horoscope Today: ఆ రాశి ఉద్యోగులకు పని భారం పెరిగే ఛాన్స్..
గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం