AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mahbubnagar Attack: దారుణం.. వంట పాత్రలు కడగమన్నందుకు తల్లిపై కూతురు కర్కశత్వం.. గొంతు కోసి..

Mahbubnagar Attack: : చాలా మంది క్షణికావేశంలో దాడులకు(Attack) పాల్పడుతున్న ఘటనలు ఈ మధ్య కాలంలో రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. తాజాగా.. మహబూబ్​నగర్​ జిల్లా కేంద్రంలో తల్లిపై కుమార్తె దాడి చేసిన ఘటన అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది.

Mahbubnagar Attack: దారుణం.. వంట పాత్రలు కడగమన్నందుకు తల్లిపై కూతురు కర్కశత్వం.. గొంతు కోసి..
Crime
Ayyappa Mamidi
|

Updated on: May 10, 2022 | 12:31 PM

Share

Mahbubnagar Attack: : చాలా మంది క్షణికావేశంలో దాడులకు(Attack) పాల్పడుతున్న ఘటనలు ఈ మధ్య కాలంలో రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. తాజాగా.. తెలంగాణలోని మహబూబ్​నగర్​ జిల్లా కేంద్రంలో ఇలాంటిదే చోటుచేసుకుంది. మహబూబ్‌నగర్‌ పురపాలిక పరిధి తిమ్మసానిపల్లిలోని అద్దె ఇంట్లో నజ్మా బేగం అనే మహిళ తన భర్త, చిన్న కుమార్తెతో కలిసి నివసిస్తోంది. భర్త బీడీలు చుడుతూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఈ తరుణంలో సోమవారం తల్లి వంటపాత్రలు కడగమని కూతురికి చెప్పింది. కుమార్తె ఒప్పుకోకపోవటంతో తల్లి దండించింది. ఆ సమయంలో తల్లిపై సదరు కుమార్తె దాడికి దిగింది. తల్లిపై కారం చల్లింది. ఈ దాడిలో బాధితురాలి తలకు తీవ్ర గాయాలుకాగా.. గొంతు కోసుకుపోయింది.

ఈ ఘటనపై స్పందించిన స్థానికులు వెంటనే 108కి సమాచారం ఇచ్చారు. వెంటనే సదరు తల్లిని స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి గొంతు, తలపై అయిన గాయాలకు కుట్లు వేసి ప్రథమ చికిత్స చేశారు. ప్రస్తుతం నజ్మా బేగం పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఆమెకు మెరుగైన వైద్యం అందిస్తున్నట్లు సుపత్రి పర్యవేక్షకులు డా. రమేశ్‌, ఉప పర్యవేక్షకులు డా.జీవన్‌ వెల్లడించారు. దీనిపై రంగంలోకి దిగిన పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. సదరు బాలిక మానసిక స్థితి సరిగాలేదని వారు గుర్తించారు. గతంలో పాఠశాలకు వెళుతూ తలకు గాయం కావటంతో చిన్న కుమార్తె మానసిక పరిస్థితి దెబ్బతిన్నట్లు తెలుస్తోంది. ఆమెకు మాటలు కూడా సరిగా రావని తండ్రి అబ్బుల్‌ హమీద్‌ పోలీసులకు వెల్లడించారు.

ఇవీ చదవండి..

ఇవి కూడా చదవండి

Multibagger Returns: ఇన్వెస్టర్లకు సిరులు కురిపించిన మెడికల్ డివైజెస్ కంపెనీ.. రెండేళ్లలో ఊహించని రాబడులు..

Interest Rates: వడ్డీ రేట్లలో మార్పులు చేసిన బ్యాంకులు ఇవే.. కస్టమర్లకు పెంపు ఎప్పటి నుంచి అమలవుతుందంటే..