Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: భర్తతో విడిపోయిన భార్యలే ఆ బాబా లక్ష్యం.. చివరికి

ఈ మధ్య కొంతమంది బాబాలు అమాయకులను మోసం చేస్తూ తమ జేబులు నింపుకుంటున్నారు. తాజాగా వరంగల్‌లో ఓ బాబా బాగోతం బయటపడింది. అమాయక ప్రజలను బురిడీ కొట్టిస్తూ.. మహిళలను లైంగికంగా లోబర్చుకుంటున్న ఆ దొంగబాబాను ఎట్టకేలకు వరంగల్‌ టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు మంగళవారం అరెస్ట్‌ చేశారు.

Telangana: భర్తతో విడిపోయిన భార్యలే ఆ బాబా లక్ష్యం.. చివరికి
Baba
Follow us
Aravind B

|

Updated on: Jun 14, 2023 | 5:54 PM

ఈ మధ్య కొంతమంది బాబాలు అమాయకులను మోసం చేస్తూ తమ జేబులు నింపుకుంటున్నారు. తాజాగా వరంగల్‌లో ఓ బాబా బాగోతం బయటపడింది. అమాయక ప్రజలను బురిడీ కొట్టిస్తూ.. మహిళలను లైంగికంగా లోబర్చుకుంటున్న ఆ దొంగబాబాను ఎట్టకేలకు వరంగల్‌ టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు మంగళవారం అరెస్ట్‌ చేశారు. వివరాల్లోకి వెళ్తే నగరంలోని ఏనుమామూల ప్రాంతానికి చెందిన షైక్నాలా లబ్బే (58) అనే వ్యక్తి బాబాగా అవతారమెత్తాడు. తనకున్న మంత్రశక్తులతో కుటుంబ సమస్యలు, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆరోగ్య సమస్యలు ఉంటే నయం చేస్తానని నమ్మించి పలువురు మహిళలు, యువతులను లోబర్చుకున్నాడు.

ఈ క్రమంలోనే ఓ వివాహితపై ఆ బాబా కన్నేశాడు. ఆమెకు తన భర్తతో ఉన్న విభేదాలను దృష్టిలో పెట్టుకొని పూజలు చేస్తున్నట్టు నటించి లైంగికదాడికి పాల్పడ్డాడు. బాబా చేసిన పనికి భయపడిన ఆమె విషయం ఇంట్లో చెప్పింది. బాధితురాలితో కలిసి కుటుంబ సభ్యులు టాస్క్‌ఫోర్స్‌ పోలీసులను ఆశ్రయించారు. రంగంలోకి దిగిన వారు బాబాను అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో ప్రశ్నించారు. చివరికి ఆ బాబా నేరం అంగీకరించినట్లు ఏసీపీ తెలిపారు. తమిళనాడుకు చెందిన షైక్నాలా లబ్బే దాదాపు 40ఏళ్ల క్రితం ఏనుమాముల ప్రాంతంలో స్థిరపడ్డాడని, తాయత్తులతో ప్రజలకు నమ్మకం కలిగించి బాబా గా మారి నీచపు పనులు చేస్తున్నట్లు పేర్కొన్నారు. అతని ఇంటి నుంచి తాయత్తులు, నిమ్మకాయలు, దిష్టి గురుగులు, వనమూలికలు, నూనె డబ్బాలతోపాటు రూ.25వేలు స్వాధీనం చేసుకున్నారు. విచారణ నిమిత్తం నిందితుడ్ని పోలీసులకు అప్పగించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి.