Gurram Baba: యాడ నుంచి వచ్చార్రా మీరంతా.. గుర్రం బాబా అంట.. ఊరికి కీడు సోకిందని ఏం చేశాడంటే..
దోపిడీ, మోసాల్లో నకిలీ బాబాల స్టైలే వేరు. ఒకరు తాయత్తుల పేరుతో దోచేస్తే.. ఇంకోడు పూజల పేరుతో ముంచేస్తాడు. ఎలా చేస్తేనేం దొంగబాబాల అంతిమ లక్ష్యం దోచుకోవడం.. దాచుకోవడం.. పారిపోవడం.. ఇదంతా అందరికీ తెలిసినా.. చాలా మంది మోసమపోతూనే ఉన్నారు.. ఈ క్రమంలోనే.. మరోసారి అచ్చం అలాంటి కేసు వెలుగులోకి ఇచ్చింది.

దోపిడీ, మోసాల్లో నకిలీ బాబాల స్టైలే వేరు. ఒకరు తాయత్తుల పేరుతో దోచేస్తే.. ఇంకోడు పూజల పేరుతో ముంచేస్తాడు. ఎలా చేస్తేనేం దొంగబాబాల అంతిమ లక్ష్యం దోచుకోవడం.. దాచుకోవడం.. పారిపోవడం.. ఇదంతా అందరికీ తెలిసినా.. చాలా మంది మోసమపోతూనే ఉన్నారు.. ఈ క్రమంలోనే.. మరోసారి అచ్చం అలాంటి కేసు వెలుగులోకి ఇచ్చింది. జనగామ జిల్లా పాలకుర్తి మండలం, విస్నూర్ గ్రామ ప్రజల అమాయకత్వాన్ని, వారి మూఢనమ్మకాలను అసరాగా చేసుకుని అందినకాడికి దోచుకున్న నకిలీ దేశ గురువు మాయాజాలం వెలుగులోకి వచ్చింది. ఊరికి కీడు సోకిందని పూజలు చేస్తే మంచి జరుగుతుందని.. లేకపోతే అరిష్టమని గట్టిగా నమ్మించాడు.
తాము చేసే పూజల వల్ల ఇంట్లో లక్ష్మి తాండవం చేస్తుందని అమాయకుల నుంచి డబ్బులు వసూలు చేశాడు. నకిలీ బాబా మాయమాటలు నమ్మి నగదు, మేకలు కూడా ఇచ్చారు. అయితే బాబా చేష్టలతో మోసాన్ని గ్రహించిన గ్రాయ యువకులు నకిలీ దేశ గురువును పట్టుకుని నిలదీశారు. అయితే వారి నుంచి తప్పించుకుని పరారయ్యాడు. బాబా అనుచరులను పట్టుకుని గ్రామస్తులు బంధించారు. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేయగా.. వారు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. తమ పైసలు తమకు ఇప్పించాలని, గుర్రం బాబా మాటలకు మోసపోయామని బాధితులు లబోదిబోమంటున్నారు.
వీడియో చూడండి..
శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం రోజు రోజుకూ అభివృద్ధి చెందుతున్నప్పటికీ గ్రామీణ ప్రాంతాల్లో మాత్రం ప్రజలు మూఢ విశ్వాసాలలో మగ్గుతున్నారు. ఇలాంటి బాబాల మోసాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
