Police Alert: దసరా దొంగలు వస్తున్నారు.. ఈ జాగ్రత్తలు తీసుకోవాలంటున్న పోలీసులు..!

పండగ అందులో ద‌స‌రా వచ్చిదంటే చాలు ఎన్ని పనులున్నా పక్కనబెట్టి సొంతూరు వెళ్లాల్సిందే. దీంతో మూడు నుంచి వారం రోజుల పాటు ఇంటికి తాళమే..!

Police Alert: దసరా దొంగలు వస్తున్నారు.. ఈ జాగ్రత్తలు తీసుకోవాలంటున్న పోలీసులు..!
Dasara Thieves
Follow us
Ranjith Muppidi

| Edited By: Balaraju Goud

Updated on: Oct 11, 2024 | 10:38 AM

పండగ అందులో ద‌స‌రా వచ్చిదంటే చాలు ఎన్ని పనులున్నా పక్కనబెట్టి సొంతూరు వెళ్లాల్సిందే. దీంతో మూడు నుంచి వారం రోజుల పాటు ఇంటికి తాళమే..! అయితే.. ఇప్పుడు ఈ తాళాలు వేసి ఉన్న ఇండ్లను టార్గెట్‌గా చేసే ముఠాలు సిటీలోకి ఎంటర్ అయ్యాయి. ప్రతీ రోజూ ఉదయం, మధ్యాహ్నం సమయాల్లో రెక్కీలు నిర్వహించి తాళాలు వేసి ఉన్న ఇండ్లను గుర్తించటం, రాత్రిళ్లు ఆ ఇండ్లను లూటీ చేయటం ఈ ముఠాల పని.

ప్రతి సంవ‌త్సరం పండగ సెల‌వుల్లో అంత‌రాష్ట్ర ముఠాలు చోరీలు పోలీసులకు స‌వాల్ గా మారాయి. ట్రైన్ లో వ‌చ్చి ఒక్క రోజులోనే చోరీకి పాల్పడి తిరిగి అదే ట్రైన్ ద్వారా వెళ్లిపోతున్న ఘ‌ట‌న‌లు గతంలో చాలానే జ‌రిగాయి. దీంతో ఈసారి పోలీసులు అంత‌రాష్ట్ర ముఠాల‌పై ప్రత్యేక దృష్టి సారించారు. రైల్వే స్టేష‌న్‌లో ఏర్పాటు చేసిన ఫెషియ‌ల్ రికగ్నైజేషన్ టెక్నాల‌జీ ద్వారా అంత‌రాష్ట్ర ముఠాల క‌ద‌లిక‌ల‌పై ఫోకస్ చేశారు. ద‌స‌రా పండగ సెలవుల్లో ఇళ్లకు తాళం వేసి ఊళ్లకు వెళ్లేవారు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని పోలీసులు సూచిస్తున్నారు.

  • ఉదయం వేళ రద్దీని, పేపర్లు, ఖాళీ సంచులు, పూల మొక్కలు, తదితర వస్తువులను విక్రయించే వారిపై నిఘా పెట్టాలని కోరుతున్నారు.
  • రాత్రివేళ అనుమానంగా కాలనీలో సంచరించేవారి గురించి పోలీసులకు సమాచారం అందించాలన్నారు.
  • శివారు కాలనీలలో తాళం వేసిన ఇండ్లను అపరిచిత వ్యక్తులు ఉదయం వేళ వెతికినట్లు కనిపిస్తే అప్రమత్తం కావాలని కోరుతున్నారు.
  • విలువైన వస్తువులను పక్కింటి వారికి ఇచ్చి నమ్మి మోసపోవద్దని చెప్తున్నారు.
  • ఇరుగు పొరుగు వారిని తమ ఇంటిని కనిపెట్టి ఉండమని చెప్పి వెళ్లడం మంచిదని సూచిస్తున్నారు.
  • వీలైనంత త్వరగా ప్రయాణం ముగించుకుని వచ్చేలా ప్లాన్ చేసుకోవాలని సూచిస్తున్నారు పోలీసులు.
  • పక్కింటి వారిద్వారా ఇంటికి సంబంధించిన సమాచారం ఎప్పటికప్పుడు తెలుసుకోవటం మంచిదని చెప్తున్నారు.
  • ఇంట్లో కుటుంబసభ్యులు వెళ్లగా ఉన్న మహిళలు, వృద్దుల వద్దకు అపరిచితులు సమాచారం కావాలంటూ వస్తే, నమ్మవద్దని, ఏమరుపాటుగా ఉండవద్దని పోలీసులు హెచ్చరిస్తున్నారు.
  • ఊరు వెళ్ళేటప్పుడు ఖరీదైన వస్తువులను ఇంట్లో పెట్టకపోవటమే మంచిదని చెప్తున్నారు. వాటిని బ్యాంక్‌ లాకర్‌లో పెట్టుకోవాలని సూచిస్తున్నారు.
  • తాళం వేసి ఊరు వెళ్లే ముందు మీ సమీప పోలీస్‌ స్టేషన్‌లో సమాచారం ఇవ్వడం మంచిదని చెప్తున్నారు.
  • ప్రత్యేకంగా చుట్టు పక్కల వారి ల్యాండ్‌ఫోన్‌, సెల్‌ఫోన్‌ నంబర్లు దగ్గర ఉంచుకోవాలని సూచిస్తున్నారు.
  • ఎప్పటికప్పుడు సమాచారం ఇవ్వదలుచుకునేవారు సమీప పోలీస్‌ స్టేషన్లను సంప్రదించాలని పోలీసులు సూచిస్తున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..