ఉన్నత స్థాయి అధికారులే కాదు.. ఉన్నత వ్యక్తిత్వం ఉన్న మనుషులు కూడా.. సెల్యూట్..
విధి ఆడిన వింతనాటకంలో తల్లిదండ్రులను కోల్పోయారు ఆ బిడ్డలు అనాథలుగా మారారు. అందరితో ఆడుతూ పాడుతూ చదువుకోవాల్సిన వయసులో పిల్లలు దిక్కుతోచనిస్థితికి చేరారు. ఎక్కడో పుట్టి, ఎక్కడో పెరిగిన వారందరికీ బాలసదనం ఆశ్రయం అయ్యింది.
విధి ఆడిన వింతనాటకంలో తల్లిదండ్రులను కోల్పోయారు ఆ బిడ్డలు అనాథలుగా మారారు. అందరితో ఆడుతూ పాడుతూ చదువుకోవాల్సిన వయసులో పిల్లలు దిక్కుతోచనిస్థితికి చేరారు. ఎక్కడో పుట్టి, ఎక్కడో పెరిగిన వారందరికీ బాలసదనం ఆశ్రయం అయ్యింది. అలాంటి వారికీ ఏదైనా తమ వంతు సాయం చేయాలని సదుద్దేశంతో ముందుకు వచ్చారు జిల్లా ఉన్నతాధికారులు. దసరా పండుగ సందర్భంగా వారితో కలిసి సంబరాలు జరుపుకున్నారు.
బాలసదనం పిల్లలతో కలిసి భోజనం చేశారు జిల్లా ఐఏఎస్ అధికారులు. అనాథలనే భావన మనస్సు నుండి తీసివేయాలన్న అధికారులు, విద్యతో మంచి భవిష్యత్తు సాధ్యం అవుతుందని సూచించారు జిల్లా యంత్రాంగం మీతో ఉన్నారనే ధైర్యంతో ముందుకు సాగాలన్నారు. అనాథ పిల్లలకు భరోసా కల్పించాలన్న ఉద్దేశ్యంతో బాలసదనంకు వచ్చిన జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ ను చూసి ఆ పిల్లలు సంబరపడిపోయారు. పండుగ వేళ అనాధ పిల్లల ముఖాలలో సంతోషం వెళ్లి విరిసింది. అనాథలం అనే దిగులు ఆ అధికారి ఇచ్చిన భరోసాతో మాయమైంది. మీకు మేమున్నామంటూ ఇచ్చిన అభయం సప్త సముద్రాలు దాటే అంత ధైర్యాన్ని ఇచ్చింది.
పండుగ అంటే చిన్నపిల్లల నుండి ముసలి వాళ్ళ వరకు అందరూ ఒక చోటకు చేరి సంతోషంగా జరుపుకుంటారు. ఆ వాతావరణంలో తల్లిదండ్రులు, పిల్లలు తమను తాము ఆనందంలో మైమరిచిపోతుంటారు. కానీ అదే పండుగ వేళ తల్లిదండ్రులు లేకుండా అనాథల్లా సదనాలలో ఉండే పిల్లలు పరిస్థితి ఎలా ఉంటుంది. వారి మొహంలో ఆనందాన్ని చూసే వారెవరు? ఆ ఆలోచన ఖమ్మం జిల్లా కలెక్టర్‌కు వచ్చింది. దేశమంతా జరుపుకునే దసరా సంబరాలలో అనాథ పిల్లల ఆనందాన్ని రెట్టింపు చేశాడు ఖమ్మం జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్.
కలెక్టర్ అంటే జిల్లా పరిపాలన అధికారి, నిత్యం ఎన్నో పనులతో సతమతమవుతుంటారు. సమీక్షలు సమావేశాలతో ఎప్పుడు బిజీగా గడుపుతుంటారు. ఒక్కోసారి వీరిని కలవాలంటే రోజుల తరబడి వేచి చూసే పరిస్థితి ఉంటుంది. కానీ ఖమ్మం జిల్లా కలెక్టర్ ముజమిల్ ఖాన్ మాత్రం అందుకు భిన్నం ఎన్ని సమావేశాలు, సమీక్షలు ఉన్నా, ఎప్పుడు ప్రజలకు అందుబాటులో ఉంటుంటారు. వీలైనంత వరకు ప్రజలకు చేరువగా ఉండేందుకు ప్రయత్నం చేస్తుంటారు. అందుకు ఉదాహరణే తాజా ఘటన. తనతో పాటు ట్రైనీ కలెక్టర్, అదనపు కలెక్టర్‌లతో కలిసి అనాథ పిల్లలతో కలిసి దసరా వేడుకలు జరుపుకున్నారు. వారితో కలిసి భోజనం చేశారు.
ప్రభుత్వ బాలికల సదనంలో ఉండే అనాథ పిల్లలను తీసుకువెళ్లి ఓ ఖరీదైన హోటల్లో భోజనం చేయడం జిల్లా కలెక్టర్ ఉన్నత వ్యక్తిత్వానికి నిదర్శనం. ఖమ్మం జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ అదనపు కలెక్టర్ శ్రీజ, ట్రైనీ కలెక్టర్ మృణాల్ శ్రేష్ఠ లతో కలిసి బాలసదనంలో ఉన్న 27 మంది పిల్లలను ఖమ్మం నగరంలోని ప్రముఖ రెస్టారెంట్‌లో డిన్నర్ చేశారు. ఈ సందర్భంగా పిల్లలతో కలెక్టర్ సరదాగా గడిపారు. అనాథ అనే భావన తొలగించుకోవాలని, ఇతర పిల్లలతో సమానంగా అన్ని రంగాలలో రాణించేందుకు అన్ని అవకాశాలు అందుబాటులో ఉన్నాయని కలెక్టర్ వివరించారు. అందరు విద్యపై శ్రద్ధ పెట్టాలని, ఇప్పుడు బాగా చదువుకుంటేనే మంచి స్థాయికి చేరుకుని ఆనందమైన జీవితం గడపవచ్చన్నవారు. నిర్దేశించుకున్న లక్ష్యాలు సాధించవచ్చు అని తెలిపారు. బాల సదనంలోని పిల్లలంతా గొప్ప స్థాయికి చేరుకునేందుకు అవసరమైన అన్ని రకాల సహాయ, సహకారాలు జిల్లా యంత్రాంగం అందజేస్తుందని జిల్లా కలెక్టర్ భరోసా ఇచ్చారు. పండుగ సమయంలో జిల్లా కలెక్టర్ తోపాటు జిల్లా ఉన్నతాధికారులు తమతో కలిసి భోజనం చేయడం పట్ల పిల్లలు సంతోషం వ్యక్తం చేశారు.
వీడియో చూడండి..
మరిన్ని హ్యుమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..