KCR in Assembly : పోడు భూములు సాగు చేస్తున్న రైతులకు కూడా రైతుబంధు.. దేశానికి 55శాతం ధాన్యాన్ని తెలంగాణ ఇచ్చింది : కేసీఆర్

KCR in Assembly : తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో సీఎం కేసీఆర్ నాగార్జున సాగర్ ఉప ఎన్నికల అంశాన్ని ప్రస్తావించారు. సాగర్ లో 1 లక్ష 53వేల మంది వివిధ పథకాలకు..

KCR in Assembly : పోడు భూములు సాగు చేస్తున్న రైతులకు కూడా రైతుబంధు..  దేశానికి 55శాతం ధాన్యాన్ని తెలంగాణ ఇచ్చింది : కేసీఆర్
Kcr In Assembly
Follow us
Venkata Narayana

|

Updated on: Mar 26, 2021 | 6:01 PM

KCR in Assembly : తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో సీఎం కేసీఆర్ నాగార్జున సాగర్ ఉప ఎన్నికల అంశాన్ని ప్రస్తావించారు. సాగర్ లో 1 లక్ష 53వేల మంది వివిధ పథకాలకు సంబంధించి లబ్ధిదారులు ఉన్నారని వెల్లడించారు. ఎన్నికలు ఉన్నాయి కాబట్టే లబ్ధిదారులను నాయకులు వెళ్లి కలవాలని అన్నానని సీఎం చెప్పారు. బస్తీ దవాఖానాలుకు బస్తీ ప్రజలనుంచి విశేష స్పందన వస్తుందని కేసీఆర్ తెలిపారు. ఎస్సీ సబ్ ప్లాన్ పై గురించి సీఎల్పీ నేత భట్టి విక్రమార్క వేగ్ ఆరోపణ చేస్తున్నారని సీఎం విమర్శించారు.

దళితుల కోసం ప్రత్యేకంగా వెయ్యి కోట్లు కేటాయించామని, దళితుల అభివృద్ధి కోసం దళిత మంత్రి, ఎమ్మెల్యేల సమావేశం పెడతామని ఆ సమావేశాలకు భట్టిని పిలుస్తామని కేసీఆర్ చెప్పారు. పోడు భూముల విషయంలో వేధింపులు వద్దని ఆదేశాలు ఇచ్చామని, పోడు భూముల సమస్యల పై ప్రజా దర్బార్ నిర్వహిస్తామని సీఎం స్పష్టం చేశారు.

తెలంగాణలో జీవవైవిధ్యం (బయోడైవర్సిటీ) పెరిగిందన్న సీఎం, తెలంగాణలో అద్భుతమైన ఆటవీ అభివృద్ధి జరిగిందని వెల్లడించారు. పోడు భూముల సమస్యలు పరిష్కరించి గిరిజనులకే హక్కు కల్పిస్తామని కేసీఆర్ అన్నారు. పోడు భూములు చేస్తున్న రైతులకు కూడా రైతుబంధు ఇస్తామన్నారు. కరోనా వల్ల ప్రపంచం అంతా దెబ్బతింటే తెలంగాణ రాష్ట్రం తట్టుకొని కుదురుకొని కొలుకుంటుందని కేసీఆర్ అన్నారు.

దేశం సేకరించిన ధాన్యంలో 55 శాతం తెలంగాణ ఇచ్చిందని తెలుసుకొని సంతోష పడ్డానని కేసీఆర్ గుర్తుచేసుకున్నారు. ప్రతిపక్షాలు గతంలో ప్రభుత్వంలో ఉన్నప్పుడు మాటలు చెప్పే వాళ్ళు.. మేము ఇప్పుడు చేతల్లో చూపిస్తున్నాం అని కేసీఆర్ అన్నారు.

Read also : GMR Hyderabad Air Cargo : రవాణాలో కొత్త శకం, వ్యాక్సిన్ సరఫరాలో బ్లాక్‌చెయిన్ బేస్డ్ రియల్ టైమ్ ట్రాకింగ్‌ను తీసుకొచ్చిన GMR హైదరాబాద్ ఎయిర్ కార్గో

ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే