Telangana: వరుస మరణాలు.. ఉక్కిరిబిక్కిరి అయిన జనాలు… ఊహించని నిర్ణయం.. కారణం దెయ్యం

 ఆ గూడెం ఒక రోజంతా నిర్మానుష్యంగా మారింది. ఇంటింటికీ తాళం పడింది. నిత్యం జనంతో సందడిగా ఉండే గూడెం ఒక్కసారిగా సైలెంట్‌ అయి పోయింది.

Telangana: వరుస మరణాలు.. ఉక్కిరిబిక్కిరి అయిన జనాలు... ఊహించని నిర్ణయం.. కారణం దెయ్యం
Back To Back Deaths
Follow us

|

Updated on: Oct 17, 2021 | 7:57 PM

ఆ గూడెం ఒక రోజంతా నిర్మానుష్యంగా మారింది. ఇంటింటికీ తాళం పడింది. నిత్యం జనంతో సందడిగా ఉండే గూడెం ఒక్కసారిగా సైలెంట్‌ అయి పోయింది. ఊహించని విధంగా ఆ ఊర్లో నిశ్శబ్దం ఆవరించింది. మహబూబబాద్ జిల్లా గూడూరు మండలం గాజులగట్టు శివారు పాటిమీదిగూడెంలో ఈ వింత ఘటన చోటుచేసుకుంది.  కరోనా మహమ్మరి బారిన పడి ఇలా గ్రామం మొత్తాన్ని లాక్ డౌన్ చేశారనుకుంటే పొరబడినట్లే. ఇటీవలి కాలంలో పాటిమీదిగూడెంలో వరుసగా ఎనిమిది మంది వివిధ కారాణాలతో చనిపోయారు. కొందరు ఆత్మహత్య చేసుకోగా, మరి కొందరు అనారోగ్య కారణాలతో మరణించారు. దీంతో గ్రామస్తులలో అనుమానం మొదలైంది. ఎందుకు ఇలా జరిగింది అని గూడూరులోని ఓ భూత వైద్యున్ని సంప్రదించారు. తంత్రాలు వేసిన అతడు.. ఉదయం నుండి సాయంత్రం వరకు ఒకరోజు జనమంతా గూడేనికి దూరంగా ఉండాలని చెప్పాడు. తెల్లవారుజామునే ఖాళీ చేసి, సాయంత్రం అయ్యాక ఇల్లు చేరాలనీ, వంటలు కూడా ఊరికి దూరంగా వండుకుంటేనే, మిమ్మల్ని పట్టిన అరిష్టం, దెయ్యం వదిలిపోతుందని చెప్పడంతో తెల్లారేసరికి గ్రామం ఖాళీ అయ్యింది. పిల్లజెల్లతో, తట్టాబుట్ట సర్దుకుని  తెల్లవారు జామునే గూడెం ఖాళీ చేసారు. ఊరి బాగు కోసం గ్రామస్తులు గ్రామదేవతలను వేడుకుంటూ గ్రామం వదిలి వనంబాట పట్టారు. గ్రామ శివారులోని పొలాలు, అడవుల్లోకి వెళ్లి చెట్ల కింద గుడారాలు వేసుకుని, అక్కడే వంటావార్పు చేసుకున్నారు.

గాజులగట్టుకు శివారు గ్రామం ఇది. అభివృద్దికి నోచుకోక, ప్రజలలో చైతన్యం లేకపోవడం వల్లనే ఇలాగ ప్రవరిస్తున్నారని పలువురు చెబుతున్నారు. ఇటీవల స్థానిక ఎమ్మెల్యే శంకర్ నాయక్ గూడెంలో మరణాలపై వాకబు చేశారు. జనాలు ఎందుకు చనిపోతున్నారో తెలుసుకుని, తనకు నివేధిక అందించాలని అధికారులను ఆదేశించారు. అయినా గ్రామస్తులు భయంతో ఊరు ఖాళీ చేసారు. ప్రతినిత్యం బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. వారికి అవగాహన కల్పించాల్సిన ఆవశ్యకత కనిపిస్తోంది.

Also Read:  ‘అలయ్‌ బలయ్‌’ కార్యక్రమంలో పవన్‌ను పలకరించేందుకు మంచు విష్ణు యత్నం.. కానీ