ఇదేక్కడి దారుణం… మూఢనమ్మకాలతో వ్యక్తిపై పెట్రోల్ పోసి నిప్పుపెట్టారు..

ఇప్పుడంతా కంప్యూటర్‌ యుగం. ఉన్నదంతా అత్యాధునిక సమాజం.. రోజు రోజుకు టెక్నాలజీ పెరుగుతున్నప్పటికీ.. ఇంకా అనేక ప్రాంతాలు మూఢనమ్మకాల పెనుభూతంలోనే ఉన్నాయి.

ఇదేక్కడి దారుణం... మూఢనమ్మకాలతో వ్యక్తిపై పెట్రోల్ పోసి నిప్పుపెట్టారు..
Petrol Attack
Follow us
Jyothi Gadda

|

Updated on: Jun 04, 2022 | 1:11 PM

ఇప్పుడంతా కంప్యూటర్‌ యుగం. ఉన్నదంతా అత్యాధునిక సమాజం.. రోజు రోజుకు టెక్నాలజీ పెరుగుతున్నప్పటికీ.. ఇంకా అనేక ప్రాంతాలు మూఢనమ్మకాల పెనుభూతంలోనే ఉన్నాయి. తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లో జనం మూఢనమ్మకం కొందరి పాలిట శాపంగా మారుతోంది. ఇప్పటికీ కొన్ని ప్రాంతాల్లో అంధ విశ్వాసాలను పాటిస్తూ.. మంత్రాలు, చేతబడులు వంటివాటిని నమ్ముతున్నారు ప్రజలు. మెదక్‌ జిల్లాలో క్షూద్ర పూజలు, మంత్రాల నెపంతో ఓ వ్యక్తిపై పెట్రోల్‌ పోసి నిప్పంటించారు దుండగులు. పూర్తి వివరాల్లోకి వెళితే..

జిల్లాలోని నిజాంపేట్ మండలం చల్మెడ గ్రామంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. మంత్రాలు చేస్తున్నాడనే నెపంతో శాల సుదర్శన్ అనే వ్యక్తి పై పెట్రోల్ పోసి నిప్పటించారు. అయితే పోలీసులు అక్కడకు చేరుకుని అతన్ని ఆస్పత్రికి తరలించడంతో ప్రమాదం తప్పింది. ఈ ఘటన మెదక్ జిల్లాలోని నిజాంపేట్ మండలం చల్మెడ గ్రామంలో చోటు చేసుకుంది. పలువురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

అయితే, జరిగిన దారుణంపై పలువురు మండిపడుతున్నారు. ప్రభుత్వంతో పాటు స్వచ్ఛంద సంస్థలు, హేతువాదులు, యువత, మీడియా సమాజంలో శాస్త్రీయ ఆలోచనా విధానాన్ని పెంపొందించే విధంగా కృషి చేయాలని డిమాండ్‌ చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని క్రైం వార్తల కోసం..