Woman Video: ఏకంగా ఆఫీస్‌కు మంచం, దుప్పటితో వచ్చేసిన మహిళ..! ఎందుకో తెలిసా.?
ఖమ్మం జిల్లా నేలకొండపల్లిలో ఓ కుటుంబం వినూత్నంగా నిరసనకు దిగింది. తమ భూమిని ఇతరుల పేరున రికార్డుల్లోకి ఎక్కించారంటూ తహశీల్దార్ ఆఫీస్‌లో ఆందోళనకు దిగారు. మంచం, దుప్పట్లు అన్నీ తీసుకుని వచ్చి,
ఖమ్మం జిల్లా నేలకొండపల్లిలో ఓ కుటుంబం వినూత్నంగా నిరసనకు దిగింది. తమ భూమిని ఇతరుల పేరున రికార్డుల్లోకి ఎక్కించారంటూ తహశీల్దార్ ఆఫీస్‌లో ఆందోళనకు దిగారు. మంచం, దుప్పట్లు అన్నీ తీసుకుని వచ్చి, తహశీల్దార్ కార్యాలయంలోనే మకాం పెట్టారు. రాజేశ్వరపురం గ్రామానికి చెందిన అరుణకు ఒక ఎకరం మూడు కుంటల భూమి వారసత్వంగా సంక్రమించింది. అయితే, ఆ భూమిని ఇతరుల పేరున రాసేశారు రెవెన్యూ అధికారులు. ప్రభుత్వం నుంచి అందాల్సిన పథకాలేమీ వాళ్లకు అందకుండా పోతున్నాయి. పేరు మార్పిడిపై పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకువచ్చిన ఫలితం లేకుండాపోయింది. ఏళ్లతరబడి ఆఫీస్ చుట్టూ తిరుగుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని బాధితురాలు అరుణ ఆవేదన వ్యక్తం చేసింది. తమ భూమికి పట్టా పాస్ బుక్ ఇప్పించాలని కోరుతోంది. లేదంటే, ఇక్కడ్నుంచి కదిలేది లేదంటూ కొడుకుతో కలిసి తహశీల్దార్ ఆఫీస్ ముందే మకాం పెట్టింది అరుణ. చివరికి ఉన్నతాధికారులు సమస్యను పరిష్కరిస్తామని హామీనిచ్చారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Rashmika Mandanna: క్రష్మిక క్రష్ ఎవరో చెప్పేసింది.. స్కూల్ డేస్ నుంచి అతనంటే చాలా ఇష్టం..!
Man dies in hotel: హోటల్‌లో ప్రేయసితో శృంగారం చేస్తూ వ్యక్తి మృతి.. ఏం జరిగిందంటే..?
Google Search: ఈ 3 విషయాలు గూగుల్‌లో సెర్చ్ చేయకండి.. చేస్తే జైలుకెళ్లడం కన్ఫమ్..!
Ratlam Temple: ఆ గుడికి వెళ్తే.. బంగారం ఫ్రీ..! భక్తులకు ప్రసాదంగా బంగారు, వెండి నాణాలు.. ఎక్కడంటే.?