Bullet Train Accident: పట్టాలు తప్పిన బుల్లెట్ రైలు.. గంటకు 350కి.మీ వేగంతో దూసుకెళ్తుండగా..

చైనాలో ఘోర రైలు ప్రమాదం జరిగింది. చైనాలోని గుయిజౌ ప్రావిన్స్‌లో బుల్లెట్ రైలు పట్టాలు తప్పింది. బుల్లెట్ రైలు రెండు కోచ్‌లు పట్టాలు తప్పటంతో పెను ప్రమాదం సంభవించింది.

Bullet Train Accident: పట్టాలు తప్పిన బుల్లెట్ రైలు.. గంటకు 350కి.మీ వేగంతో దూసుకెళ్తుండగా..
Bullet Train
Follow us
Jyothi Gadda

|

Updated on: Jun 04, 2022 | 12:54 PM

చైనాలో ఘోర రైలు ప్రమాదం జరిగింది. చైనాలోని గుయిజౌ ప్రావిన్స్‌లో బుల్లెట్ రైలు పట్టాలు తప్పింది. బుల్లెట్ రైలు రెండు కోచ్‌లు పట్టాలు తప్పటంతో పెను ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో డ్రైవర్ మృతి చెందగా, మరో ఏడుగురు ప్రయాణికులు గాయపడినట్లు సమాచారం. బుల్లెట్ రైలు చైనాలోని నైరుతి ప్రావిన్స్ గుయాంగ్ నుండి దక్షిణ ప్రావిన్స్ గ్వాంగ్‌జౌ వైపు నడుస్తోంది. శనివారం ఉదయం 10:30 గంటలకు గుయిజౌలోని ఒక స్టేషన్‌లో కొండచరియలు విరిగిపడటంతో రైలు కోచ్‌లు పట్టాలు తప్పడంతో రైలు డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ప్రమాదంలో 7 మంది ప్రయాణికులు గాయపడ్డారని చైనా స్థానిక మీడియా సంస్థ గ్లోబల్ టైమ్స్ శనివారం ఒక ట్వీట్‌లో తెలిపింది. పూర్తి వివరాల్లోకి వెళితే…

సమాచారం ప్రకారం, రైలు యుఎజై టన్నెల్ ప్రవేశ ద్వారం వద్దకు చేరుకోగానే రైలులోని ఏడవ, ఎనిమిదో కోచ్‌లు పట్టాలు తప్పాయి. గాయపడిన ప్రయాణికులందరినీ స్థానిక ఆసుపత్రికి తరలించి, మరో 136 మంది ప్రయాణికులను రక్షించారు. ట్రైన్ ఇంజిన్ పూర్తిగా ధ్వంస‌మైంది. ఘటనా స్థలంలో సహాయక చర్యలు ముమ్మరం చేసి ప్రమాదానికి గల కారణాలపై ఆరా తీస్తున్నారు.

గతంలో సెంట్రల్ చైనాలోని హునాన్ ప్రావిన్స్‌లో రైలు పట్టాలు తప్పింది. ఈ ఘటనలో రైల్వే పోలీస్‌ ఒకరు మృతి చెందగా, నలుగురు తీవ్రంగా గాయపడ్డారు, 123 మందికి స్వల్ప గాయాలయాలతో బయటపడ్డారు. అప్పుడు కూడా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు, కొండచరియలు విరిగిపడడమే ప్రమాదానికి కారణం.

ఇవి కూడా చదవండి

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం..

పెళ్లికి రావాలని చంద్రబాబు, పవన్‌లకు పీవీ సింధు ఆహ్వానం
పెళ్లికి రావాలని చంద్రబాబు, పవన్‌లకు పీవీ సింధు ఆహ్వానం
ఇన్నాళ్లు సహించా.. ఇక నా విశ్వరూపం చూపిస్తా.! సాయి పల్లవి సీరియస్
ఇన్నాళ్లు సహించా.. ఇక నా విశ్వరూపం చూపిస్తా.! సాయి పల్లవి సీరియస్
ఈ సీన్ తిరుమలలో తప్ప ఇంకెక్కడా చూడలేరు.! వీడియో వైరల్..
ఈ సీన్ తిరుమలలో తప్ప ఇంకెక్కడా చూడలేరు.! వీడియో వైరల్..
అమ్మవారి కోసం తపస్సు.. ప్రత్యక్షం కాకపోవడంతో ఎంతపని చేసాడంటే.!
అమ్మవారి కోసం తపస్సు.. ప్రత్యక్షం కాకపోవడంతో ఎంతపని చేసాడంటే.!
అదిరిపోయే బెనిఫిట్స్‌.. జియో న్యూ ఇయర్ ప్లాన్‌.! వీడియో..
అదిరిపోయే బెనిఫిట్స్‌.. జియో న్యూ ఇయర్ ప్లాన్‌.! వీడియో..
ఆకస్మిక మరణాలకు కోవిడ్ వ్యాక్సిన్ కారణమా.? వీడియో..
ఆకస్మిక మరణాలకు కోవిడ్ వ్యాక్సిన్ కారణమా.? వీడియో..
క్లాసులో ఇదేం పని మాస్టారు.! తిట్టిపోస్తున్న నెటిజన్లు.! వీడియో.
క్లాసులో ఇదేం పని మాస్టారు.! తిట్టిపోస్తున్న నెటిజన్లు.! వీడియో.
ఎప్పటికీ నువ్వే నా స్పూర్తి.! నేను ఎప్పటికీ మీ అభిమానినే అంటూ..
ఎప్పటికీ నువ్వే నా స్పూర్తి.! నేను ఎప్పటికీ మీ అభిమానినే అంటూ..
అందరూ ఇంటికి వచ్చారు సరే మరి NTR, చరణ్‌? | పెరుగుతున్న పుష్ప 2..
అందరూ ఇంటికి వచ్చారు సరే మరి NTR, చరణ్‌? | పెరుగుతున్న పుష్ప 2..
అది.. పవన్ రేంజ్.! గూగుల్ ట్రేండింగ్ లో పవన్ హవా.. బద్దలైన గూగుల్
అది.. పవన్ రేంజ్.! గూగుల్ ట్రేండింగ్ లో పవన్ హవా.. బద్దలైన గూగుల్