AP : ఓ వైపు పులి, మరోవైపు ఎలుగుబంటి..! ఎట్నుంచి ఎటాక్‌ చేస్తాయో తెలియదు.. బిక్కుబిక్కుమంటున్న జనం

పట్టపగలే రోడ్లపై ఎలుగుబంటి ప్రత్యక్షమైంది. నడిరోడ్డుపై తిరుగుతూ హల్‌చల్‌ చేసింది. ఎలుగుబంటిని చూసిన వాహనదారులు, ప్రయాణికులు భయంతో పరుగులు తీశారు.

AP : ఓ వైపు పులి, మరోవైపు ఎలుగుబంటి..! ఎట్నుంచి ఎటాక్‌ చేస్తాయో తెలియదు.. బిక్కుబిక్కుమంటున్న జనం
Ap
Follow us

|

Updated on: Jun 04, 2022 | 12:18 PM

పట్టపగలే రోడ్లపై ఎలుగుబంటి ప్రత్యక్షమైంది. నడిరోడ్డుపై తిరుగుతూ హల్‌చల్‌ చేసింది. ఎలుగుబంటిని చూసిన వాహనదారులు, ప్రయాణికులు భయంతో పరుగులు తీశారు. అడవిలో ఉండాల్సిన ఎలుగుబంటి అనంతపురం జిల్లాలో స్థానికుల్ని హడలెత్తించింది. దాంతో ప్రజలంతా ఒక్కసారిగా ఎలుగుబంటి మీదకు తిరగబ్డడారు. పంట పొలాల్లో ఉన్న రైతులు, వాహనదారులు ఏకమై కేకలు వేస్తూ వెంబడించారు. ఆ తర్వాత ఎలుగుబంటి ఏం చేసిందో తెలుసా..?

శ్రీ సత్యసాయి జిల్లా రొళ్ళ మండలం నాసేపల్లి గ్రామ సమీపంలో ఎలుగుబంటి చాలాసేపు హల్ చల్ చేసింది. పొలాల్లో ఉన్న రైతులు, అటుగా వెళుతున్న వాహనదారులు భయంతో వణికిపోయారు. కానీ, అందరూ ఏకమై కేకలు వేయడంతో ఎలుగుబంటి అక్కడినుంచి సమీపంలోని కొండల్లోకి పరుగులు తీసింది. ఒకానొక పరిస్థితిలో ఎలుగుబంటి తిరగబడడంతో ఆ ప్రాంత వాసులు ఏకమై తరిమికొట్టారు. ఈ ప్రాంతంలో ఎలుగుబంట్లు, చిరుతపులుల సంచారం అధికంగా ఉండటంతో రైతులు ఒంటరిగా పంట పొలాల్లో పనులు చేసుకోవడానికి భయపడిపోతున్నారు. ఎప్పుడు ఏ ప్రమాదం ముంచుకొస్తుందో అంటూ గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వన్యప్రాణులు జనావాసాల్లోకి రాకుండా అటవీశాఖ అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

ఇవి కూడా చదవండి

ఇదిలా ఉంటే, అటు కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గంలో పులి భయం వీడటం లేదు. ఒమ్మంగి గ్రామంలో అటవీ శాఖ అధికారులు పులి కోసం ప్రత్యేక బోన్లను ఏర్పాటు చేశారు. కానీ, పులి మాత్రం చిక్కలేదు. అధికారుల అప్రమత్తతో బెంగాల్‌ టైగర్‌ తన స్థావరాన్ని మార్చుకున్నట్లుగా అధికారులు భావిస్తున్నారు. పులి పాదముద్రలు గమనిస్తున్న అటవీశాఖ అధికారులు..పులి రాజమార్గం అయిన రోడ్డు మార్గం ద్వారానే వెళ్ళినట్లుగా గుర్తించారు. పులి ఎక్కడ కు వెళ్ళిందో వెతికే పనిలో పడ్డారు అటవీశాఖ అధికారులు.