AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కొడుకా.. మాకు నువ్వేదిక్కు..! వృద్ధ తల్లిదండ్రుల ఆవేదన వింటే..

తల్లిదండ్రులకు బుక్కెడు అన్నం పెట్టడం లేదు ఓ కొడుకు.. ఎంతో కష్టపడి పెంచి పెద్ద చేసిన తల్లిదండ్రులను అవసాన దశలో కనీసం ఆదరించడం లేదు..ఎన్ని సార్లు.. కొడుకును బ్రతిమాలిన పట్టించుకోవడం లేదు. ఇక లాభం లేదని కొడుకు ఇంటి ముందు బైఠాయించిన ఆ వృద్ధ తల్లిదండ్రులు తమ గోడు వినేవారి కోసం దీనంగా ఎదురు చూస్తున్నారు.. పోలీసులు తమకు న్యాయం చేయాలనీ కోరుతున్నారు. ఈ హృదయవిదారక సంఘటన పూర్తివివరాల్లోకి వెళితే..

కొడుకా.. మాకు నువ్వేదిక్కు..! వృద్ధ తల్లిదండ్రుల ఆవేదన వింటే..
Elderly Couple Protest
G Sampath Kumar
| Edited By: |

Updated on: Feb 05, 2025 | 1:30 PM

Share

జగిత్యాల జిల్లా కోరుట్లలో హృదయవిదారక సంఘటన చోటు చేసుకుంది. కోరుట్లలోని ఆనంద్ నగర్ లో తల్లిదండ్రులకు అన్నం పెట్టకుండా ఇబ్బంది పెడుతున్నారంటూ  కొడుకు ఇంటి ఎదుట తల్లిదండ్రులు బైఠాయించారు. ఆనంద్ నగర్ కు చెందిన గంగాధర సుబ్బయ్య, లక్ష్మి దంపతులకు కొడుకు, ఇద్దరు కూతుర్లు ఉన్నారు. కొన్నేళ్లుగా వారి కొడుకు తల్లితండ్రుల పోషణ చూడక పోవడంతో వృద్దదంపతులు వారి కూతురు ఇంట్లో ఉంటున్నారు. కొన్ని నెలల క్రితం బుచ్చయ్య అనారోగ్యం భారిన పడటంలో లక్షల రూపాయలు ఖర్చు అయ్యాయి. అప్పు తెచ్చి వైద్యం చేయించుకున్నారు.. ఆ డబ్బులు వాటిని చెల్లించాలని కొడుకు దగ్గరికి వెళ్ళితే వెళ్లగొట్టాడు. వారు పెద్ద మనుషులను ఆశ్రయించారు..

కానీ..కొడుకు మాత్రం ఇంటికి రానివ్వడం లేదు. కడుపు కాస్త తిండి కుడా పెట్టడం లేదు. ఇటీవల r.d.o కార్యాలయం లో ఫిర్యాదు చేశారు. r.d.o జివాకర్ రెడ్డి.. కుమారుడు లింగమూర్తి ని పిలిపించి మాట్లాడారు. తల్లితండ్రుల పోషణ చూడాలని వారి ఖర్చులకు నెలకు రూ.3000ల నగదు ఇవ్వాలని ఆదేశాలు జారీ చేశారు. అయినప్పటికి కుమారుడు పట్టించు కోలేదు.

దీంతో వృద్ధ తల్లితండ్రులు చేసేదేమీ లేక కొడుకు ఇంటి ముందు బైఠాయించారు. చుట్టూ పక్కల వారు వచ్చి వారిని చూసి ఆవేదన వ్యక్తం చేశారు. ఎండను సైతం భరించి అక్కడే కూర్చున్నారు. తనకు న్యాయం జరిగే వరకు ఇక్కడే ఆందోళన కొనసాగిస్తామని తల్లిదండ్రులు చెబుతున్నారు..ఆ.. కొడుకు మనస్సు మాత్రం కరగడం లేదు. లేదంటే ఇతని పై చట్టరీత్య చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు స్థానికులు..

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

దేశంలో అత్యంత సంపన్నుడైన చెఫ్‌ ఇతనే నట..ఆయన ఆస్తుల విలువ తెలిస్తే
దేశంలో అత్యంత సంపన్నుడైన చెఫ్‌ ఇతనే నట..ఆయన ఆస్తుల విలువ తెలిస్తే
వందేభారత్ ప్రయాణీకులకు తీపికబురు.. ఇకపై ఆ స్టేషన్‌లోనూ..
వందేభారత్ ప్రయాణీకులకు తీపికబురు.. ఇకపై ఆ స్టేషన్‌లోనూ..
వెజ్‌లో నాన్‌వెజ్‌ రుచి కావాలంటే..ఈ కూరగాయతో రెట్టింపు బలం,టేస్ట్
వెజ్‌లో నాన్‌వెజ్‌ రుచి కావాలంటే..ఈ కూరగాయతో రెట్టింపు బలం,టేస్ట్
ఎన్నో విమర్శలు వచ్చినా.. వాటిని సరిదిద్ధుకుంటాను.. లోకేష్
ఎన్నో విమర్శలు వచ్చినా.. వాటిని సరిదిద్ధుకుంటాను.. లోకేష్
బ్యాటర్లు వచ్చారు..వెళ్ళారు..అంతే..109 ఓవర్లకే 30 వికెట్లా?
బ్యాటర్లు వచ్చారు..వెళ్ళారు..అంతే..109 ఓవర్లకే 30 వికెట్లా?
రెండు కోట్లు లేవు అన్నవారికి 26 బంతుల్లోనే సమాధానం చెప్పాడు
రెండు కోట్లు లేవు అన్నవారికి 26 బంతుల్లోనే సమాధానం చెప్పాడు
క్రిస్మస్ పర్వదినాన కాలిఫోర్నియాను ముంచెత్తిన వరదలు
క్రిస్మస్ పర్వదినాన కాలిఫోర్నియాను ముంచెత్తిన వరదలు
సీన్ గురించి చెప్పాలని గదిలోకి అలా ప్రవర్తించాడు..
సీన్ గురించి చెప్పాలని గదిలోకి అలా ప్రవర్తించాడు..
ఈజీగా డబ్బులు వస్తాయనుకున్నాడు.. కానీ చివరకు ఇలా బలైపోయాడు..
ఈజీగా డబ్బులు వస్తాయనుకున్నాడు.. కానీ చివరకు ఇలా బలైపోయాడు..
శ్రేయస్ అయ్యర్ రిటర్న్ గిఫ్ట్.. నెట్స్‌లో బ్యాటింగ్ షురూ
శ్రేయస్ అయ్యర్ రిటర్న్ గిఫ్ట్.. నెట్స్‌లో బ్యాటింగ్ షురూ