- Telugu News Photo Gallery What is the spiritual meaning of the aloe vera flower telugu lifestyle news
సంవత్సరానికి ఒకసారి మాత్రమే పూసే ఈ పువ్వు మీ అదృష్టాన్ని మార్చగలదు..! లాభాలు తెలిస్తే..
హిందూ మతంలో పవిత్రమైనవి, పూజనీయమైనవిగా భావించే అనేక చెట్లు, మొక్కలు ఉన్నాయి. అలాంటి వాటిలో తులసి, అరటి, కలబంద మొదలైనవి అనేకం ఉన్నాయి. అయితే, కలబందలో కూడా ఒక పువ్వు ఉంటుందని చాలా తక్కువ మందికి తెలుసు. జ్యోతిశాస్త్రంలో కలబంద మొక్క, దాని పువ్వు చాలా ప్రాముఖ్యత కలిగి ఉన్నాయి. కలబంద పూలు పూస్తే అది దేనికి సంకేతమో తప్పక తెలుసుకోవాలి.
Updated on: Feb 05, 2025 | 8:43 AM

కలబంద పువ్వులు అనుకూలమైన వాతావరణ పరిస్థితులలో మాత్రమే వికసిస్తాయి. మీ ఇంట్లో కలబంద పువ్వు వికసించాలనుకుంటే సూర్యరశ్మి సమృద్ధిగా లభించే ప్రదేశంలో దీనిని పెంచండి. ఈ మొక్కలు, పువ్వులకు సూర్యరశ్మిని అధికంగా అవసరం. కాబట్టి, నీడ ఉన్న ప్రదేశాలో పెట్టకూడదు. కలబంద మొక్కలను ఇంటి లోపల కూడా పెంచవచ్చు. కానీ, అవి ఇంటి లోపల పెరిగే పూలు వికసించే అవకాశం లేదు.

జ్యోతిశాస్త్రం ప్రకారం..కలబంద మొక్కతో పాటు దాని పువ్వులు కూడా అనేక లక్షణాలను కలిగి ఉన్నాయి. ఆరోగ్య ప్రయోజనాలతో పాటు ఆధ్యాత్మిక ప్రయోజనాలు కూడా సూచిస్తున్నారు. ఈ పువ్వులు ఆధ్యాత్మిక కోణంలో చాలా ముఖ్యమైనవి. కలబంద మొక్క నారింజ లేదా ఎరుపు పువ్వులతో వికసిస్తే అది శుభ సంకేతంగా పరిగణిస్తారు.

కలబంద మొక్కలు అనేక ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉన్నాయి. అవి చర్మానికి, జుట్టుకు మేలు చేస్తాయి. కలబంద జెల్‌లో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. మధుమేహం, జీర్ణ సంబంధిత సమస్యలతో సహా అనేక వ్యాధుల చికిత్సకు ఔషధంగా ఉపయోగిస్తారు. కలబంద పువ్వులను మూలికా కషాయాలను తయారు చేయడానికి ఉపయోగిస్తారు.

కలబంద పువ్వు సంపదను ఆకర్షించే సామర్థ్యాన్ని కలిగి ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.. దీనివల్ల కుటుంబంలో ఆనందం, శ్రేయస్సు ఉంటాయి. కుటుంబ సభ్యులలో ప్రేమ నిండివుంటుంది. కలబంద పువ్వు ఎవరి ఇంట్లో పెరుగుతుందో ఆ ఇంట్లోని వారి ఆర్థిక సమస్యలు పరిష్కారమవుతాయి. ఎందుకంటే ఈ పువ్వు సంపదను ఆకర్షించే బలమైన సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది.

ప్రతి కలబంద మొక్క పూలు పూయదు. కలబంద మొక్కలను బాగా సంరక్షించినప్పుడు మాత్రమే పుష్పిస్తాయి. ఆర్థిక లాభాల కోసం కలబంద పువ్వులను ఎర్రటి వస్త్రంలో చుట్టి మీ పూజా మందిరం లేదంటే, మీరు డబ్బు దాచుకునే చోట ఉంచండి. దీని వలన మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. (NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది... ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు TV9 Telugu.com బాధ్యత వహించదు.)





























