కొబ్బరి నీళ్లు వీరికి విషం…! పొరపాటున కూడా తాగకూడదు… ఎవరు తాగకూడదో తెలుసా..?
కొబ్బరి నీళ్లు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఈ విషయం మనందరికీ తెలిసిందే..! ఆరోగ్యకరమైన పానీయాల విషయానికి వస్తే ముందుగా గుర్చొచ్చే పేరు కొబ్బరి నీళ్లు. కొబ్బరి నీరు ఎల్లప్పుడూ ఆరోగ్యానికి ప్రయోజనకరమే..కొబ్బరి నీళ్లలో విటమిన్లు, ఖనిజాలు, ఎలక్ట్రోలైట్లు, యాంటీ ఆక్సిడెంట్లు, పొటాషియం వంటివి సమృద్ధిగా లభిస్తాయి. ఇవి శరీరాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచడంలో, శక్తిని కాపాడటంలో సాయపడతాయి. అయితే, ఆరోగ్య ప్రయోజనాలున్నప్పటికీ కొబ్బరి నీళ్లకి కొందరు దూరంగా ఉండాలంటున్నారు ఆరోగ్య నిపుణులు. కొబ్బరి నీళ్లు ఎవరికి హానికరమో ఇక్కడ తెలుసుకుందాం.
Updated on: Feb 05, 2025 | 7:19 AM

కొబ్బరి నీళ్లలో చక్కెర ఉంటుంది. ఇది డయాబెటిస్ రోగులకు హానికరం. మధుమేహ వ్యాధిగ్రస్తులు కొబ్బరి నీళ్లు తాగితే, వారి రక్తంలో చక్కెర స్థాయి పెరుగుతుంది. అంతేకాకుండా షుగర్ లెవల్స్ అదుపులో ఉండకపోవచ్చు. అందుకే షుగర్ బాధితులు కొబ్బరి నీళ్లు తాగే ముందు డాక్టర్‌ని సలహా తీసుకోవడం మంచిది.

కొబ్బరి నీళ్లలో అధిక మొత్తంలో పొటాషియం ఉంటుంది. ఇది మూత్రపిండాల సమస్యలు ఉన్నవారికి హానికరం. వీరి శరీరాల ద్వారా అదనపు పొటాషియంను సరిగ్గా ఫిల్టర్ చేయలేరు. ఇది వారి రక్తంలో అధిక స్థాయి పొటాషియం కు దారితీస్తుంది. దీనివల్ల కండరాల బలహీనత, క్రమరహిత హృదయ స్పందన, తీవ్రమైన సందర్భాల్లో గుండెపోటు కూడా వచ్చే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు.

ఉదయాన్నే ఖాళీ కడుపుతో ప్రతిరోజు కొబ్బరి నీళ్లు తాగడం వల్ల శరీరంలో రోగ నిరోధక శక్తి అమాంతంగా పెరుగుతుంది. ఇన్ఫెక్షన్లు, సీజనల్ వ్యాధులు రాకుండా ఉంటాయి. ఎల్లప్పుడూ సీజనల్ వ్యాధులతో బాధపడేవారు క్రమం తప్పకుండా కొబ్బరి నీళ్లు తాగటం వల్ల ప్రయోజనం ఉంటుంది.

ప్రతిరోజు ఉదయాన్నే కొబ్బరి నీళ్లు తాగడం వల్ల గుండె సమస్యల నుంచి ఉపశమనం కలుగుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇందులో ఉండే కొన్ని గుణాలు శరీరంలోని చెడు కొలెస్ట్రాల్‌ని తగ్గించేందుకు కీలక పాత్ర పోషిస్తాయి. అంతేకాకుండా గుండెను శక్తివంతంగా చేసేందుకు సహాయపడతాయి.

కొబ్బరి నీళ్లలో శరీరానికి కావలసినన్ని పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. ఈ నీళ్లలో ఉండే కొన్ని మూలకాలు జీర్ణక్రియను ఆరోగ్యంగా చేసి దీర్ఘకాలిక వ్యాధుల నుంచి రక్షిస్తాయి. ప్రతి రోజూ ఉదయం ఖాళీ కడుపుతో కొబ్బరి నీళ్లు తాగడం వల్ల శరీరం హైడ్రేషన్‌గా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. శరీరంలో నీటి కొరతను కూడా తీరుస్తుంది.





























