AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

RRB Railway Jobs 2025: టెట్ అభ్యర్ధులకు రైల్వేలో ఉద్యోగాలు.. దరఖాస్తు గడువు పొడిగిస్తూ ప్రకటన జారీ

టెట్ అర్హత కలిగిన నిరుద్యోగ అభ్యర్థులకు రైల్వే శాఖ తీపి కబురు చెప్పింది. దేశంలోని వివిధ రీజియన్లలో గ్రాడ్యుయేట్ టీచర్లు, సైంటిఫిక్ సూపర్‌వైజర్, ట్రెయిన్డ్‌ గ్రాడ్యుయేట్ టీచర్లు, చీఫ్ లా అసిస్టెంట్, పబ్లిక్ ప్రాసిక్యూటర్, ఫిజికల్ ట్రైనింగ్ ఇన్‌స్ట్రక్టర్, జూనియర్ ట్రాన్స్‌లేటర్, లైబ్రేరియన్, ప్రైమరీ రైల్వే టీచర్, అసిస్టెంట్ టీచర్ తదితర పోస్టుల భర్తీకి దరఖాస్తు గడువు పొడిగిస్తూ ప్రకటన జారీ చేసింది..

RRB Railway Jobs 2025: టెట్ అభ్యర్ధులకు రైల్వేలో ఉద్యోగాలు.. దరఖాస్తు గడువు పొడిగిస్తూ ప్రకటన జారీ
RRB Railway Jobs
Srilakshmi C
|

Updated on: Feb 05, 2025 | 2:42 PM

Share

రైల్వే శాఖలోని ఆర్‌ఆర్‌బీ మినిస్టీరియల్, ఐసోలేటెడ్ కేటగిరీ పోస్టులకు దరఖాస్తు గడువు ఫిబ్రవరి 6, 2025వ తేదీతో ముగుస్తుందన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు (RRB) దరఖాస్తు గడువు పెంపొందిస్తూ కీలక ప్రకటన జారీ చేసింది. తాజా ప్రకటన మేరకు దరఖాస్తు గడువు ఫిబ్రవరి 16, 2025వ తేదీ వరకు పొడిగించింది. దీంతో ఇప్పటి వరకు దరఖాస్తు చేసుకోని అభ్యర్ధులకు మరో అవకాశం దొరికినట్లైంది. చివరి నిమిషం వరకు వేచి చూడకుండా వెంటనే దరఖాస్తు చేసుకోవాలని ఆర్‌ఆర్‌బీ అభ్యర్ధులకు సూచించింది. ఈ నోటిఫికేషన్‌ ద్వారా పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్లు, సైంటిఫిక్ సూపర్‌వైజర్, ట్రెయిన్డ్‌ గ్రాడ్యుయేట్ టీచర్లు, చీఫ్ లా అసిస్టెంట్, పబ్లిక్ ప్రాసిక్యూటర్, ఫిజికల్ ట్రైనింగ్ ఇన్‌స్ట్రక్టర్, జూనియర్ ట్రాన్స్‌లేటర్, లైబ్రేరియన్, ప్రైమరీ రైల్వే టీచర్, అసిస్టెంట్ టీచర్ తదితర పోస్టులు మొత్తం 1036 వరకు భర్తీ చేయనున్నారు. అర్హత గల అభ్యర్థులు ఫిబ్రవరి 16, 2025వ తేదీ రాత్రి 11.59 గంటలలోగా దరఖాస్తు చేసుకోవాలి.

పోస్టుల వివరాలు ఇవే..

  • పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్ పోస్టుల సంఖ్య : 187
  • సైంటిఫిక్ సూపర్‌వైజర్ పోస్టుల సంఖ్య: 03
  • ట్రెయిన్డ్‌ గ్రాడ్యుయేట్ టీచర్లు పోస్టుల సంఖ్య: 338
  • చీఫ్ లా అసిస్టెంట్‌ పోస్టుల సంఖ్య: 54
  • పబ్లిక్ ప్రాసిక్యూటర్ పోస్టుల సంఖ్య: 20
  • ఫిజికల్ ట్రైనింగ్ ఇన్‌స్ట్రక్టర్ పోస్టుల సంఖ్య: 18
  • సైంటిఫిక్‌ అసిస్టెంట్‌/ ట్రైనింగ్‌ పోస్టుల సంఖ్య: 02
  • జూనియర్ ట్రాన్స్‌లేటర్ పోస్టుల సంఖ్య: 130
  • సీనియర్‌ పబ్లిసిటీ ఇన్‌స్పెక్టర్‌ పోస్టుల సంఖ్య: 03
  • స్టాఫ్‌ అండ్‌ వెల్ఫేర్‌ ఇన్‌స్పెక్టర్‌ పోస్టుల సంఖ్య: 59
  • మ్యూజిక్‌ టీచర్‌ పోస్టుల సంఖ్య: 10
  • ప్రైమరీ రైల్వే టీచర్‌ పోస్టుల సంఖ్య: 03
  • లైబ్రేరియన్ పోస్టుల సంఖ్య: 188
  • అసిస్టెంట్ టీచర్ పోస్టుల సంఖ్య: 02
  • ల్యాబొరేటరీ అసిస్టెంట్‌/ స్కూల్‌ పోస్టుల సంఖ్య: 07
  • ల్యాబ్‌ అసిస్టెంట్‌ గ్రేడ్‌-3 పోస్టుల సంఖ్య: 12

ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు పోస్టును అనుసరించి సంబంధిత విభాగాల్లో డిప్లొమా, డిగ్రీ, పీజీ, పీజీ డిప్లొమా, ఎంబీఏతోపాటు టెట్‌లో ఉత్తీర్ణత పొంది ఉండాలి. అభ్యర్ధుల వయోపరిమితి జనవరి 01, 2025 నాటికి 18 ఏళ్లు నిండి ఉండాలి. దరఖాస్తు ఫీజు కింద జనరల్‌ అభ్యర్ధులు రూ.500, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ, ఎక్స్‌ సర్వీస్‌మెన్‌, ఈబీసీ, మైనారిటీ అభ్యర్థులు రూ.250 చొప్పున చెల్లించవల్సి ఉంటుంది. ఫిబ్రవరి 17 వరకు ఫీజు చెల్లించవచ్చు. ఫిబ్రవరి 19 నుంచి 28 వరకు దరఖాస్తుల సవరనకు అనుమతిస్తారు. ఆన్‌లైన్‌ రాత పరీక్ష, టీచింగ్‌ స్కిల్ టెస్ట్‌, ట్రాన్స్‌లేషన్‌ టెస్ట్‌ తదితరాల ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

కిలో ఉల్లి రూ.15లకే.. కొనేందుకు ఎగబడ్డ జనాలు! గంటలో కాసుల వర్షం..
కిలో ఉల్లి రూ.15లకే.. కొనేందుకు ఎగబడ్డ జనాలు! గంటలో కాసుల వర్షం..
ఈ బియ్యం తింటే పీసీవోఎస్ మాయం.. బరువు కంట్రోల్..!
ఈ బియ్యం తింటే పీసీవోఎస్ మాయం.. బరువు కంట్రోల్..!
11 సిక్సర్లతో 233 పరుగులు.. తొలి టీ20ఐ నుంచి సూర్య ఔట్..?
11 సిక్సర్లతో 233 పరుగులు.. తొలి టీ20ఐ నుంచి సూర్య ఔట్..?
దివ్వెల మాధురి పరువు తీసేసిన రీతూ తల్లి.. మరీ అలా అనేసిందేంటి?
దివ్వెల మాధురి పరువు తీసేసిన రీతూ తల్లి.. మరీ అలా అనేసిందేంటి?
మీ చేతిలో ఇలాంటి చిహ్నాలు ఉన్నాయంటే.. డబ్బు వద్దన్నా వెంటపడుతుంది
మీ చేతిలో ఇలాంటి చిహ్నాలు ఉన్నాయంటే.. డబ్బు వద్దన్నా వెంటపడుతుంది
200 ఏళ్ల నాటి అరుదైన శంఖం.. ఆ ఒక్కరోజు మాత్రమే చూసే అవకాశం..
200 ఏళ్ల నాటి అరుదైన శంఖం.. ఆ ఒక్కరోజు మాత్రమే చూసే అవకాశం..
మీ ప్రియమైనవారికి వాటిని గిఫ్టుగా ఇవ్వడం మంచిది కాదట.!
మీ ప్రియమైనవారికి వాటిని గిఫ్టుగా ఇవ్వడం మంచిది కాదట.!
చలి మీ అందాన్ని ఎలా నాశనం చేస్తుందో తెలుసా?
చలి మీ అందాన్ని ఎలా నాశనం చేస్తుందో తెలుసా?
క్యాన్సర్ రోగుల కోసం కురులు దానం చేసిన టాలీవుడ్ హీరోయిన్.. వీడియో
క్యాన్సర్ రోగుల కోసం కురులు దానం చేసిన టాలీవుడ్ హీరోయిన్.. వీడియో
జస్ట్ నీళ్లేగా అనుకునేరు.. పవర్‌హౌస్.. ఉదయాన్నే తాగితే..
జస్ట్ నీళ్లేగా అనుకునేరు.. పవర్‌హౌస్.. ఉదయాన్నే తాగితే..