AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

SSC JE Selection List: జూనియర్‌ ఇంజినీర్‌ సెలక్షన్ లిస్ట్ వచ్చేసింది.. డౌన్‌లోడ్‌ లింక్‌ ఇదే

జూనియర్‌ ఇంజినీర్‌ పోస్టుల భర్తీకి సంబంధించి పేపర్‌ 2 రాత పరీక్ష ఫలితాలు స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌ తాజాగా విడుదల చేసింది. ఈ పరీక్షకు హాజరైన అభ్యర్ధులు స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌ అధికారిక వెబ్‌సైట్‌ నుంచి ఈ ఫలితాలను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఇందులో అర్హత సాధించిన అభ్యర్ధులను వివిధ కేంద్ర ప్రభుత్వ సంస్థలు, శాఖల్లో గ్రూప్‌-బి (నాన్‌ గెజిటెడ్‌) జూనియర్‌ ఇంజినీర్‌ పోస్టుల్లో ఉద్యోగాలు పొందవచ్చు..

SSC JE Selection List: జూనియర్‌ ఇంజినీర్‌ సెలక్షన్ లిస్ట్ వచ్చేసింది.. డౌన్‌లోడ్‌ లింక్‌ ఇదే
SSC JE Selection List
Srilakshmi C
|

Updated on: Feb 05, 2025 | 2:17 PM

Share

హైదరాబాద్, ఫిబ్రవరి 5: స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన జూనియర్‌ ఇంజినీర్‌ ఖాళీల భర్తీకి సంబంధించి పేపర్‌ 2 రాత పరీక్ష ఫలితాలు తాజాగా విడుదలయ్యాయి. ఈ పరీక్షకు హాజరైన అభ్యర్ధులు స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌ అధికారిక వెబ్‌సైట్‌ నుంచి ఫలితాలను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఫలితాల్లో మొత్తం 1701 అభ్యర్థులు షార్ట్‌లిస్టింగ్‌ చేసినట్లు కమిషన్‌ వెల్లడించింది. ఈ నోటిఫికేషన్‌ ద్వారా ఎంపికైన వారు దేశవ్యాప్తంగా ఉన్న కేంద్ర ప్రభుత్వ సంస్థలు, శాఖల్లో గ్రూప్‌-బి (నాన్‌ గెజిటెడ్‌) జూనియర్‌ ఇంజినీర్‌ పోస్టుల్లో ఉద్యోగాలు పొందుతారు. ఎంపికైన వారికి నెలకు రూ.35,400 నుంచి రూ.1,12,400 వరకు జీతంగా చెల్లిస్తారు. పేపర్‌ 2 ఫలితాల్లో ఎంపికైన వారికి ధ్రువపత్రాల పరిశీలన, వైద్య పరీక్షలు నిర్వమించి తుది జాబితాను వెల్లడిస్తారు. ఇందుకు సంబంధించి ఇతర వివరాలు అధికారిక వెబ్‌సైట్‌లో చెక్‌ చేసుకోవచ్చు.

ఎస్సెస్సీ జూనియర్‌ ఇంజినీర్‌ టైర్ 2 సెలక్షన్ లిస్ట్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఫిబ్రవరి 9న నిఫ్ట్‌ యూజీ, పీజీ 2025 పరీక్షలు.. వెబ్‌సైట్‌లో కార్డులు విడుదల

నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ (నిఫ్ట్) 2025 ఆధారంగా 2025-26 విద్యా సంత్సరానికి సంబంధించి యూజీ, పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే ప్రవేశ పరీక్ష అడ్మిట్‌ కార్డులను నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ (ఎన్‌టీఏ) విడుదల చేసింది. ఈ పరీక్షకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌లో అప్టికేషన్‌ నెంబర్‌, పుట్టిన తేదీ వివరాలు నమోదు చేసి అడ్మిట్‌ కార్డులను డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. ఈ మేరకు ఎన్‌టీఏ ప్రకటన జారీ చేసింది.

ఇవి కూడా చదవండి

ఇక ఫిబ్రవరి 9వ తేదీన ఉదయం, సాయంత్రం మొత్తం రెండు షిప్టుల్లో ఆన్‌లైన్‌ విధానంలో ఈ పరీక్ష జరగనుంది. నిఫ్ట్ 2025 వచ్చిన ర్యాంకు ఆధారంగా దేశవ్యాప్తంగా ఉన్న మొత్తం 18 క్యాంపస్‌లలో బ్యాచిలర్, మాస్టర్ డిగ్రీ, పీహెచ్‌డీ కోర్సుల్లో ప్రవేశాలు నిర్వహిస్తారు. దేశవ్యాప్తంగా 81 నగరాల్లోని 92 కేంద్రాల్లో కంప్యూటర్‌ ఆధారిత/ పేపర్‌ ఆధారిత విధానంలో నిర్వహించనున్నారు. అభ్యర్థులు డౌన్‌లోడ్‌ చేసుకున్న అడ్మిట్‌ కార్డుల్లో ఫోటో, సంతకం, క్యూఆర్‌కోడ్‌, బార్‌కోడ్‌ వివరాల్లో ఏవైనా లేకుంటే.. వాటిని తిరిగి డౌన్‌లోడ్‌ చేసుకోవాల్సి ఉంటుంది.

నిఫ్ట్‌ యూజీ, పీజీ 2025 పరీక్ష అడ్మిట్‌ కార్డుల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

Viral Video: టికెట్‌ లేకుండా.. విమానంలో దూరిన పావురం...
Viral Video: టికెట్‌ లేకుండా.. విమానంలో దూరిన పావురం...
Viral Video: ఛ డామిట్‌.. ప్రియుడితో ఉండగా ఎంటరైన భార్య...
Viral Video: ఛ డామిట్‌.. ప్రియుడితో ఉండగా ఎంటరైన భార్య...
Viral Video: ఇలా కాలు పెడితే చాలు.. అలా బూట్లు రెడీ చేస్తుంది!
Viral Video: ఇలా కాలు పెడితే చాలు.. అలా బూట్లు రెడీ చేస్తుంది!
పట్టపగలు దారుణం.. వేట కత్తులతో నరికి, తుపాకీతో కాల్చి మర్డర్‌
పట్టపగలు దారుణం.. వేట కత్తులతో నరికి, తుపాకీతో కాల్చి మర్డర్‌
ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన సినీ నటుడు జూనియర్ ఎన్టీఆర్
ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన సినీ నటుడు జూనియర్ ఎన్టీఆర్
పదో తరగతి పబ్లిక్‌ పరీక్షల 2026 తేదీలు వచ్చేశాయ్.. ఎప్పట్నుంచంటే?
పదో తరగతి పబ్లిక్‌ పరీక్షల 2026 తేదీలు వచ్చేశాయ్.. ఎప్పట్నుంచంటే?
టీ20 అరంగేట్రంలోనే ప్రపంచ రికార్డ్.. వైభవ్ కంటే డేంజరస్ భయ్యో..
టీ20 అరంగేట్రంలోనే ప్రపంచ రికార్డ్.. వైభవ్ కంటే డేంజరస్ భయ్యో..
క్యూర్, ప్యూర్, రేర్ మోడల్‌తో తెలంగాణ అభివృద్ది: భట్టి విక్రమార్క
క్యూర్, ప్యూర్, రేర్ మోడల్‌తో తెలంగాణ అభివృద్ది: భట్టి విక్రమార్క
ఏటీఎంలో నకిలీ రూ.500 నోట్లు.. ఇక జాగ్రత్తగా ఉండాల్సిందే
ఏటీఎంలో నకిలీ రూ.500 నోట్లు.. ఇక జాగ్రత్తగా ఉండాల్సిందే
ప్రియుడు కాదు.. రాక్షసుడు.. పెళ్లికి ఒప్పుకోలేదని.. పట్టపగలే..
ప్రియుడు కాదు.. రాక్షసుడు.. పెళ్లికి ఒప్పుకోలేదని.. పట్టపగలే..