Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

గ్రూప్‌1 అభ్యర్థులకు గొప్ప శుభవార్త..! మార్చిలో మంచి ముహూర్తం.. నియామక పరీక్ష ఫలితాలు అప్పుడే..

మరోవైపు ఇప్పటికే పరీక్షలు పూర్తైనందున ఎన్నికల కోడ్ అడ్డురాదని నిపుణులు అంటున్నారు. మొత్తంగా ఫలితాల విడుదలకు ఫిబ్రవరిలో ప్రాసెస్ అంతా పూర్తి చేసి మార్చిలో రిలీజ్ చేసేలా టీజీపీఎస్సీ కసరత్తు చేస్తుండగా.. టెట్ ఫలితాలు మాత్రం ఫిబ్రవరిలో విడుదల చేసేందుకు విద్యాశాఖ ట్రై చేస్తోంది. నిరుద్యోగులకు మార్చి ముహుర్తాన మంచి వార్త అందివ్వనున్నట్లు టీజీపీఎస్సీ స్పష్టం చేస్తోంది.

గ్రూప్‌1 అభ్యర్థులకు గొప్ప శుభవార్త..! మార్చిలో మంచి ముహూర్తం.. నియామక పరీక్ష ఫలితాలు అప్పుడే..
Tspsc Grous
Follow us
Vidyasagar Gunti

| Edited By: Jyothi Gadda

Updated on: Feb 05, 2025 | 1:16 PM

తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వద్ద పెండింగ్ లో ఉన్న అన్నీ పరీక్షా ఫలితాలను మార్చి 31 నాటికి విడుదల చేయాలని కమిషన్ నిర్ణయం తీసుకుంది. ప్రధానంగా గ్రూప్ వన్ మెయిన్స్ రిజల్ట్ కు అడ్డంకిగా ఉన్న లీగల్ చిక్కులు తొలగిపోయాయి. జీవో 29 పై దాఖలైన రెండు పిటిషన్లను సుప్రీంకోర్టు కొట్టివేయడంతో ఫలితాల విడుదలకు పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్లాన్ చేస్తోంది. మార్చి మొదటి వారంలో గ్రూప్ వన్ జనరల్ ర్యాంకింగ్స్ ఇచ్చి తర్వాత రిజర్వేషన్లు, పోస్టుల ఆప్షన్స్ వంటి చేసి తుది ఫలితాలు మార్చి చివరి నాటికి ఇచ్చేలా ప్రణాళికలు చేస్తున్నారు. వాటితో పాటే గ్రూప్ -2. గ్రూప్-3 ఫలితాలను మార్చిలోనే వారాల వ్యవధిలో విడుదల చేయనున్నారు. ఇప్పటికే ఈ మేరకు టీజీపీఎస్సీ చైర్మన్ బుర్రా వెంకటేశం మార్చి వరకు అన్నీ ఫలితాలను ఇవ్వడమే లక్ష్యంగా కమిషన్ పని చేస్తోందని.. ఏప్రిల్ తర్వాతే కొత్త నోటిఫికేషన్లకు అవకాశం ఉంటుందని తేల్చి చెప్పారు.

తెలంగాణలో 563 పోస్టుల భర్తీకి గతేడాది అక్టోబర్ 21 నుంచి 27 వరకు గ్రూప్ వన్ మెయిన్స్ పరీక్షలు టీజీపీఎస్సీ నిర్వహించింది. ప్రిలిమినరీ ఎగ్జామ్ తర్వాత క్వాలిఫై అయిన 31 వేల మందిలో 21 వేల మంది మెయిన్స్ పరీక్షలు రాశారు. 783 పోస్టుల భర్తీకీ గత నవంబర్ లో గ్రూప్-2 ఎగ్జామ్ నిర్వహించగా.. రెండున్నర లక్షల మంది అభ్యర్థులు పరీక్ష రాశారు. 1363 పోస్టుల భర్తీ కోసం నవంబర్ లో నిర్వహించిన గ్రూప్ -3 పరీక్షకు 2 లక్షల 69 వేల మంది హాజరైనట్లు అధికారులు తెలిపారు. ఈ మూడు పరీక్షలు రాసిన ఆశావహులు ఫలితాల కోసం ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.

మరోవైపు టెట్ ఫలితాలు బుధవారం విడుదల కావాల్సి ఉన్నప్పటికి రాష్ట్రంలో ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అడ్డువస్తుందేమోనన్న సందేహంలో అధికారులు వాయిదా వేశారు. దీనిపై ప్రభుత్వ వర్గాలు చర్చిస్తున్నాయని.. అవసరమైతే ఎన్నికల సంఘానికి లేఖ రాసి ఫలితాలు విడుదల చేసేందుకు విద్యాశాఖ ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది, మరోవైపు ఇప్పటికే పరీక్షలు పూర్తైనందున ఎన్నికల కోడ్ అడ్డురాదని నిపుణులు అంటున్నారు. మొత్తంగా ఫలితాల విడుదలకు ఫిబ్రవరిలో ప్రాసెస్ అంతా పూర్తి చేసి మార్చిలో రిలీజ్ చేసేలా టీజీపీఎస్సీ కసరత్తు చేస్తుండగా.. టెట్ ఫలితాలు మాత్రం ఫిబ్రవరిలో విడుదల చేసేందుకు విద్యాశాఖ ట్రై చేస్తోంది. నిరుద్యోగులకు మార్చి ముహుర్తాన మంచి వార్త అందివ్వనున్నట్లు టీజీపీఎస్సీ స్పష్టం చేస్తోంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

శివరాత్రి తెల్లారే ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్.. టెన్షన్.. టెన్షన్
శివరాత్రి తెల్లారే ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్.. టెన్షన్.. టెన్షన్
ఢిల్లీ రైల్వేస్టేషన్‌లో తొక్కిసలాట జరగడానికి కారణం ఇదే.. RPF
ఢిల్లీ రైల్వేస్టేషన్‌లో తొక్కిసలాట జరగడానికి కారణం ఇదే.. RPF
ఉదయాన్నే ఈ టిప్స్ పాటిస్తే, మీ మైండ్ షార్ప్‌గా పనిచేస్తుందంట!
ఉదయాన్నే ఈ టిప్స్ పాటిస్తే, మీ మైండ్ షార్ప్‌గా పనిచేస్తుందంట!
వసీం అక్రమ్ కంటే రషీద్ ఖాన్ గొప్పవాడా? తెరపైకి కొత్త వాదన..!
వసీం అక్రమ్ కంటే రషీద్ ఖాన్ గొప్పవాడా? తెరపైకి కొత్త వాదన..!
టెకీ నయా దందా.. యూట్యూబ్‌ చూసి గుట్టుగా బైక్‌ చోరీలు!
టెకీ నయా దందా.. యూట్యూబ్‌ చూసి గుట్టుగా బైక్‌ చోరీలు!
ఇండియాలో జాబ్‌ ఓపెనింగ్స్‌ ప్రకటించిన టెస్లా!
ఇండియాలో జాబ్‌ ఓపెనింగ్స్‌ ప్రకటించిన టెస్లా!
అసిస్టెంట్ డైరెక్టర్ నుంచి క్రేజీ హీరోయిన్‏గా..
అసిస్టెంట్ డైరెక్టర్ నుంచి క్రేజీ హీరోయిన్‏గా..
ఎల్ఐసి నుంచి స్మార్ట్ పెన్షన్ ప్లాన్‌..ఫిబ్రవరి 18 నుంచి అమలు
ఎల్ఐసి నుంచి స్మార్ట్ పెన్షన్ ప్లాన్‌..ఫిబ్రవరి 18 నుంచి అమలు
ఛాంపియన్స్ ట్రోఫీ ముందు రెచ్చిపోయిన కీపర్ కమ్ బ్యాట్స్‌మెన్..
ఛాంపియన్స్ ట్రోఫీ ముందు రెచ్చిపోయిన కీపర్ కమ్ బ్యాట్స్‌మెన్..
అందానికే అసూయ పుట్టేనా నిన్ను చూస్తే.. మతిపోగొడుతున్న అయేషా..
అందానికే అసూయ పుట్టేనా నిన్ను చూస్తే.. మతిపోగొడుతున్న అయేషా..