AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

JEE Main 2025 Result Date: జేఈఈ మెయిన్‌ తొలి విడత ఫలితాలు వచ్చేస్తున్నాయ్‌.. ఎప్పుడంటే?

జనవరి 22 నుంచి 30 తేదీల మధ్య జరిగిన జేఈఈ మెయిన్‌ సెషన్‌-1 (జనవరి 2025) పరీక్షల ప్రాథమిక ఆన్సర్‌ కీని ఎన్‌టీఏ విడుదల చేసింది. ప్రాథమిక కీపై ఫిబ్రవరి 4 నుంచి 6వ తేదీ వరకు అభ్యంతరాలను స్వీకరించనున్నట్లు ప్రకటించింది. ఆన్సర్‌ కీతోపాటు రెస్పాన్స్‌షీట్లను ఎన్టీయే వెబ్‌సైట్‌లో అందుబాటులోకి తీసుకువచ్చింది. అభ్యర్ధులు వీటిని తమ వివరాలు నమోదు చేసి డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు..

JEE Main 2025 Result Date: జేఈఈ మెయిన్‌ తొలి విడత ఫలితాలు వచ్చేస్తున్నాయ్‌.. ఎప్పుడంటే?
JEE Main 2025 Result Date
Srilakshmi C
|

Updated on: Feb 05, 2025 | 3:09 PM

Share

హైదరాబాద్, ఫిబ్రవరి 5: దేశవ్యాప్తంగా ఎన్‌ఐటీల్లో బీటెక్‌ సీట్ల భర్తీకి జనవరి 22 నుంచి 29 తేదీల మధ్య జరిగిన పేపర్ 1 జేఈఈ మెయిన్‌ సెషన్‌-1 (జనవరి 2025) పరీక్ష, ఇక 30వ తేదీన జరిగిన బీఆర్క్, బీ ప్లానింగ్‌ సీట్ల కోసం పేపర్‌-2 జరిగిన విషయం తెలిసిందే. ఈ పరీక్షల ప్రాథమిక ఆన్సర్‌ కీని ఎన్‌టీఏ విడుదల చేసింది. ప్రాథమిక కీపై ఫిబ్రవరి 4 నుంచి 6వ తేదీ వరకు అభ్యంతరాలను స్వీకరించనున్నట్లు ప్రకటించింది. దేశవ్యాప్తంగా రెండు పేపర్లకు కలిపి దాదాపు 12 లక్షల మందికిపైగా అభ్యర్ధులు దరఖాస్తు చేసుకున్నారు. ఆయా తేదీల్లో ఉదయం 9 నుంచి 12 గంటల వరకు, మధ్యాహ్నం 3 నుంచి 6 గంటల వరకు రెండు షిఫ్టుల్లో ఈ పరీక్షలు జరిగాయి. ప్రాధమిక కీపై అభ్యంతరాల స్వీకరణ అనంతరం తుది కీ రూపొందించి, ఆ వెనువెంటనే ఫలితాలు కూడా వెల్లడిస్తారు. అందిన సమాచారం మేరకు ఫిబ్రవరి 12న జేఈఈ మెయిన్‌ తొలి విడత ర్యాంకులు ప్రకటించనున్నారు.

ఏప్రిల్‌లో జేఈఈ మెయిన్‌ రెండో విడత పరీక్షలు

ఏప్రిల్‌ 1 నుంచి 8వ తేదీల మధ్య రెండో విడత జేఈఈ మెయిన్‌ రెండో విడత పరీక్షలు జరగనున్నాయి. ప్రస్తుతం ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయి. జేఈఈ మెయిన్‌ చివరి విడత దరఖాస్తులకు ఫిబ్రవరి 25 వరకు గడువు ఉంది. జేఈఈ మెయిన్‌ చివరి విడత ముగిసిన తర్వాత రెండిటిలో ఉత్తమ స్కోర్‌ను పరిగణనలోకి తీసుకొని ఏప్రిల్‌ 17న తుది ర్యాంకులు ప్రకటిస్తారు. జేఈఈ మెయిన్‌లో కనీస మార్కులు సాధించిన తొలి 2.50 లక్షల మందిని జేఈఈ అడ్వాన్స్‌డ్‌ పరీక్ష రాసేందుకు అనుమతిస్తారు. మే 18న జేఈఈ అడ్వాన్స్‌డ్‌ పరీక్ష ఉంటుంది.

జేఈఈ మెయిన్‌ ర్యాంకులతో ఎన్‌ఐటీలు, అడ్వాన్స్‌డ్‌ ర్యాంకులతో ఐఐటీల్లో సీట్లు కేటాయిస్తారన్న సంగతి తెలిసిందే. దేశంలోని 31 ఎన్‌ఐటీల్లో గత ఏడాది సుమారు 24 వేలు, 23 ఐఐటీల్లో 17,600, ట్రిపుల్‌ఐటీల్లో దాదాపు 8,500, ఇతర కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సహకారంతో నడిచే విద్యాసంస్థల్లో 57 వేల సీట్లు ఉన్నాయి. ఈ ఏడాది వీటి సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. సాధారణంగా జేఈఈ మెయిన్‌ రాసిన ప్రతి 100 మందిలో సరాసరిన కేవలం నలుగురికి మాత్రమే సీట్లు దక్కుతాయి. అందువల్లనే జేఈఈ పరీక్షకు విపరీతమైన పోటీ ఉంటుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

Follow Us
కేతు యోగం..ఆ రాశుల వారికి సొంత ఊర్లోనే ఉద్యోగం..!
కేతు యోగం..ఆ రాశుల వారికి సొంత ఊర్లోనే ఉద్యోగం..!
క్రేజీ ఫోటోలతో మెంటలెక్కిస్తున్న మహేష్ బాబు మేనకోడలు..
క్రేజీ ఫోటోలతో మెంటలెక్కిస్తున్న మహేష్ బాబు మేనకోడలు..
గుమ్మడిపై ఆగ్రహించిన ఎన్టీఆర్.. నాలుగేళ్లు దూరం పెట్టారు..
గుమ్మడిపై ఆగ్రహించిన ఎన్టీఆర్.. నాలుగేళ్లు దూరం పెట్టారు..
మరణాన్ని ముందే తెలుసుకోవచ్చా..? శరీరం ఇచ్చే సంకేతాలు ఇవే..
మరణాన్ని ముందే తెలుసుకోవచ్చా..? శరీరం ఇచ్చే సంకేతాలు ఇవే..
ఆఫీస్ బాయ్ అన్న ఆ మాటతో హిట్లర్ సినిమా స్క్రిప్ట్ మారిపోయింది..
ఆఫీస్ బాయ్ అన్న ఆ మాటతో హిట్లర్ సినిమా స్క్రిప్ట్ మారిపోయింది..
అతడిని ప్రాణంగా ప్రేమించా.. పెళ్లి అనగానే వదిలేశాడు..
అతడిని ప్రాణంగా ప్రేమించా.. పెళ్లి అనగానే వదిలేశాడు..
ఢిల్లీ క్యాపిటల్స్ ప్లేయర్ వివాదంపై నోరు విప్పిన యెషా సాగర్..
ఢిల్లీ క్యాపిటల్స్ ప్లేయర్ వివాదంపై నోరు విప్పిన యెషా సాగర్..
ఆ బూత్ బంగ్లాలో నిజంగా దెయ్యమా? శాస్త్రవేత్తలు చెప్పిన అసలు నిజం!
ఆ బూత్ బంగ్లాలో నిజంగా దెయ్యమా? శాస్త్రవేత్తలు చెప్పిన అసలు నిజం!
నేను ఎవరికీ వ్యతిరేకం కాదు..అలాగనీ నా పోరాటం ఆపను.. యాంకర్ రష్మీ
నేను ఎవరికీ వ్యతిరేకం కాదు..అలాగనీ నా పోరాటం ఆపను.. యాంకర్ రష్మీ
రూ.15 కోట్లతో నిర్మిస్తే రూ.230 కలెక్షన్స్.. థియేటర్లలో బ్లాక్ బస
రూ.15 కోట్లతో నిర్మిస్తే రూ.230 కలెక్షన్స్.. థియేటర్లలో బ్లాక్ బస