Jabardasth : అతడిని ప్రాణంగా ప్రేమించా.. పెళ్లి అనగానే వదిలేశాడు.. జబర్దస్త్ బ్యూటీ..
"జబర్దస్త్" షో ద్వారా బుల్లితెరపై మంచి గుర్తింపు తెచ్చుకుంది ఐశ్వర్య. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తన ప్రేమ, బ్రేకప్ కథలను వెల్లడించారు. సాయితో చేసిన ఓ స్కిట్ వల్ల తామిద్దరూ నిజంగానే రిలేషన్‌లో ఉన్నారని చాలామంది నమ్మారని తెలిపారు. ప్రస్తుతం సింగిల్‌గా ఉన్న ఆమె, పరిశ్రమలో "కమిట్‌మెంట్" పేరుతో ఎదురైన చేదు అనుభవాలను, సరైన బ్రేక్ లభించకపోవడంపై ఆవేదనను పంచుకున్నారు.

“జబర్దస్త్” ద్వారా ప్రేక్షకులకు సుపరిచితురాలైన నటి ఐశ్వర్య తన ప్రేమ, బ్రేకప్ కథతో పాటు సినీ పరిశ్రమలో ఎదురైన అనుభవాలను ఓ ఇంటర్వ్యూలో పంచుకున్నారు. తన కెరీర్, వ్యక్తిగత జీవితానికి సంబంధించిన పలు ఆసక్తికర విషయాలను ఆమె వెల్లడించారు. గతంలో సాయితో కలిసి “నాతో నేను” సినిమా ప్రమోషన్స్ కోసం చేసిన ఒక స్కిట్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యిందని ఐశ్వర్య గుర్తు చేసుకున్నారు. ఈ స్కిట్ చూసి చాలా మంది తామిద్దరూ నిజంగానే ప్రేమలో ఉన్నారని, కొందరైతే పెళ్లి కూడా చేసుకున్నారని అనుకున్నారని ఆమె తెలిపారు. అయితే, ఈ విషయాలపై స్పందిస్తూ తాను ఒక రిలేషన్‌లో ఉన్నానని, అయితే అది బ్రేకప్ అయ్యిందని వెల్లడించారు. “ప్రేమ అనేది చాలా వాల్యుబుల్. అంత ప్రెషియస్ అయిన దానికి డిజర్వ్ లేని వాళ్లు లైఫ్‌లోకి వస్తే అది ఉండదు” అని బ్రేకప్‌నకు గల కారణాన్ని ఆమె వివరించారు.
ఎక్కువ మంది చదివినవి : Singer Sravana Bhargavi : 10 ఏళ్లు ఎన్నో కష్టాలు చూశాను.. నాపై చాలా ట్రోల్స్ చేశారు.. శ్రావణ భార్గవి ఎమోషనల్.
ప్రస్తుతం తాను సింగిల్‌గా ఉన్నానని, సింగిల్‌గా ఉండటం ఆనందంగా ఉందని ఐశ్వర్య పేర్కొన్నారు. పెళ్లికి సంబంధించి ప్రస్తుతం ఎలాంటి ఆసక్తి లేదని, తన తల్లికి కూడా ఇదే విషయం చెప్పానని తెలిపారు. మొదట తన ఇంటిని క్లియర్ చేసుకోవాలని, ఆ తర్వాతే పెళ్లి గురించి ఆలోచిస్తానని ఆమె స్పష్టం చేశారు. సినీ పరిశ్రమలో ఎదురైన “కమిట్‌మెంట్” సమస్యల గురించి ఐశ్వర్య కీలక వ్యాఖ్యలు చేశారు. “కమిట్‌మెంట్” అనే పదాన్ని తాను మొదట పని పట్ల నిబద్ధతగా, కష్టపడటంగా భావించానని చెప్పారు. అయితే, కొందరు దీనిని అభ్యంతరకరమైన ఆఫర్‌లుగా ఉపయోగించారని గ్రహించినప్పుడు తాను తీవ్రంగా స్పందించానని తెలిపారు. అగ్రిమెంట్‌కు ముందు, డైరెక్టర్ లేదా ప్రొడ్యూసర్ తరఫున ఇలాంటి కాల్స్ వచ్చేవని ఆమె వెల్లడించారు. ఒక సందర్భంలో ఒక డైరెక్టర్‌తో తీవ్ర వాగ్వాదం జరిగి, ఆయనను కొట్టి మరీ బయటకి వచ్చానని ఐశ్వర్య ధైర్యంగా చెప్పారు. అయితే, ఆ డైరెక్టర్ పేరు చెప్పడానికి ఆమె నిరాకరించారు.
ఎక్కువ మంది చదివినవి : Krishna Vamsi : రమ్య కృష్ణతో ప్రేమ, పెళ్లికి ఆ పాటనే కారణం.. డైరెక్టర్ కృష్ణ వంశీ..
సినిమా అవకాశాల కోసం తాను ఎవరినీ అడగనని, అయినప్పటికీ అవకాశాలు వస్తాయని ఐశ్వర్య పేర్కొన్నారు. తన డబ్బింగ్ థియేటర్‌కు వచ్చిన కొందరు డైరెక్టర్లు తన నటన చూసి, లేదా స్నేహితులు క్లిప్‌లు చూపించడం ద్వారా తనకు ఆఫర్లు వచ్చాయని వివరించారు. నిరంతరం టీవీ షోలు, సీరియల్స్, సినిమాలు, వెబ్ సిరీస్‌లు చేస్తున్నప్పటికీ తనకు ఇప్పటివరకు సరైన బ్రేక్ లభించలేదని ఐశ్వర్య ఆవేదన వ్యక్తం చేశారు. సినిమా కథ చెప్పడం బాగా చేసినా, తీసిన తర్వాత అవుట్‌పుట్ భిన్నంగా ఉంటుందని, డీఓపీ సరిగా తీయకపోవడం లేదా డైరెక్టర్ తనను సరిగా చూపించకపోవడం వంటి సమస్యలుంటాయని ఆమె తెలిపారు.
ఎక్కువ మంది చదివినవి : Vadde Naveen: అందుకే సినిమాలు చేయడం లేదు.. అసలు విషయం చెప్పిన హీరో వడ్డే నవీన్..
జబర్దస్త్ ఐశ్వర్య ఇన్ స్టా పోస్ట్..
View this post on Instagram
ఎక్కువ మంది చదివినవి : Trending Song : 30 ఏళ్లుగా యూట్యూబ్‌ను షేక్ చేస్తున్న సాంగ్.. కుర్రాళ్లు మళ్లీ మళ్లీ పాడుకునే పాట.. ఇప్పటికీ ట్రెండింగ్..
