నేను చేసిన తప్పు అదే.. అందుకే నాకు ఆఫర్స్ రాలేదు.. హీరోయిన్ సదా..

Rajitha Chanti

Pic credit - Instagram

28 May 2026

‘జయం’ సినిమాతో టాలీవుడ్‌లోకి ‘వెళ్లవయ్యా వెళ్ళు’ అంటూ ఎంట్రీ ఇచ్చి, మొదటి చిత్రంతోనే ఇండస్ట్రీని ఊపేసిన హీరోయిన్ సదా. మొదటి సినిమాతోనే ఓవర్ నైట్ స్టార్ అయిపోయింది.

ఎన్టీఆర్‌తో ‘నాగ’, విక్రమ్‌తో ‘అపరిచితుడు’ వంటి భారీ బ్లాక్‌బస్టర్లలో నటించి మెప్పించింది. అయితే, అంతటి భారీ విజయాలు దక్కినప్పటికీ సదా కెరీర్ ఆశించిన స్థాయిలో ముందుకు సాగలేదు.

ఆమె ఒక పాత ఇంటర్వ్యూలో తన సినీ ప్రయాణం, కెరీర్‌లో ఎదురైన ఒడిదుడుకులు, తాను కోల్పోయిన స్టార్ అవకాశాల గురించి పంచుకున్న ఆసక్తికర విషయాలు నెట్టింట వైరల్‌గా మారాయి.

తనకు దక్కిన భారీ హిట్స్‌కు తగిన గుర్తింపు, ఆఫర్లు ఎందుకు రాలేదనే ప్రశ్న తనను కూడా ఎప్పుడూ వెంటాడుతూనే ఉంటుందని సదా ఆవేదన వ్యక్తం చేసింది.

కొన్ని విషయాలు మన చేతుల్లో ఉండవని, పరిశ్రమలో ఎంత ప్రతిభ ఉన్నా సరే.. సరైన సమయంలో సరైన అవకాశాలు, అదృష్టం కలిసి రావడం కూడా అంతే ముఖ్యమని ఆమె పేర్కొంది.

‘జయం’ వంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత కూడా తనకు ఆశించిన స్థాయిలో వరుస ఆఫర్లు రాకపోవడం తనను ఎంతో ఆశ్చర్యానికి గురిచేసిందని వెల్లడించింది. అలాగే అవకాశాలు మిస్ అయినట్లు తెలిపింది.

రజనీకాంత్ బ్లాక్‌బస్టర్ హిట్ చిత్రం ‘చంద్రముఖి’ లో జ్యోతిక పోషించిన ఐకానిక్ పాత్ర, అలాగే శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన క్లాసిక్ హిట్ ‘ఆనంద్’ లో కమలినీ ముఖర్జీ చేసిన రూపా క్యారెక్టర్..

ఈ రెండింటినీ మొదట తనకే ఆఫర్ చేశారని. ఆ సినిమాలను వదులుకోవడం గురించి మాట్లాడుతూ ఇప్పుడు వెనక్కి తిరిగి ఆలోచిస్తే ఆ నిర్ణయం తాను చేసిన పెద్ద తప్పుగా అనిపిస్తోందని చెప్పుకొచ్చింది.