May 2, 2026
Subhash
ఇన్నేళ్లు లండన్, న్యూయార్క్‌లలో దాచిన పుత్తడి నిల్వలను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) స్వదేశానికి తరలిస్తోంది. మన సంపద ఇక మన గడ్డపైనే ఉండబోతోంది.
ప్రపంచవ్యాప్తంగా మారుతున్న రాజకీయ సమీకరణాలు, ఆర్థిక సంక్షోభాల దృష్ట్యా 'మన బంగారం మన దగ్గరే ఉండటం ఉత్తమం' అని RBI భావిస్తోంది.
యుద్ధాలు, ఆర్థిక మాంద్యం వంటి విపత్కర పరిస్థితుల్లో విదేశాల్లో ఉన్న మన సొమ్ముకు రక్షణ ఎంత? అన్న ఆలోచనతోనే ఈ ప్రక్రియను వేగవంతం చేశారు.
పసిడి నిల్వలు దేశంలోనే ఉంటే, అత్యవసర సమయాల్లో వాటిని త్వరగా నగదు రూపంలోకి మార్చుకోవచ్చు. తద్వారా ఆర్థిక సవాళ్లను సమర్థవంతంగా ఎదుర్కోవచ్చు.
2026 మార్చి నాటికి భారత్ వద్ద మొత్తం 880.52 టన్నుల బంగారం ఉంది. ఇందులో 77% (680 టన్నులు) ఇప్పటికే దేశీయంగా నిల్వ చేశారు.
197.67 టన్నుల బంగారం బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్‌లో ఉండగా, మరో 2.85 టన్నులు డిపాజిట్ల రూపంలో ఉంది.
2023లో దేశంలో 37% నిల్వలే ఉండగా, గత మూడేళ్లలో ఇది 77%కి పెరగడం గమనార్హం. గత ఆరు నెలల్లోనే 104 టన్నుల బంగారాన్ని భారత్‌కు తెచ్చారు.
కేవలం భారత్ మాత్రమే కాదు.. ఫ్రాన్స్, పోలాండ్ వంటి దేశాలు కూడా తమ బంగారాన్ని స్వదేశానికి తరలిస్తున్నాయి. సేఫ్ వాల్ట్స్ కోసం సొంత గూటినే నమ్ముకుంటున్నాయి.
ప్రపంచంలోనే అత్యధిక బంగారు నిల్వలు ఉన్న దేశాల్లో భారత్ 8వ స్థానంలో ఉంది. 8,133 టన్నులతో అమెరికా అగ్రస్థానంలో కొనసాగుతోంది.