వేసవిలో డ్రాగన్ ఫ్రూట్ తినడం ఆరోగ్యానికి మంచిదేనా?

samatha

02 may 2026

డ్రాగన్ ఫ్రూట్ ఆరోగ్యానికి చాలా మంచిది. అందుకే చాలా మంది ఎక్కువగా డ్రాగన్ ఫ్రూట్ తినడానికి ఇష్టపడుతుంటారు. ఇందులో పోషకాలు పుష్కలంగా ఉంటాయి.

డ్రాగన్ ఫ్రూట్

డ్రాగన్ ఫ్రూట్ భారత్‌లో కూడా ఎక్కువగా పండిస్తున్నారు. అంతే కాకుండా ఇవి చూడటానికి మంచి రంగు, రుచితో ఉంటాయి.

భారత్

అంతే కాకుండా ఇందులో విటమిన్స్, మినరల్స్, ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి. ఇవి శరీరానికి ఎక్కువగా ప్రయోజనాలు చేకూరుస్తుంది.

విటమిన్స్, మినరల్స్

అయితే చాలా మందికి వీటిని సమ్మర్‌లో తినడం మంచిదేనా? అనే డౌట్ ఉంటుంది. కాగా, దాని గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

సమ్మర్

డ్రాగన్ ఫ్రూట్‌లో నీటి శాతం పుష్కలంగా ఉండటమే కాకుండా, ఇందులో ఫైబర్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. అందువలన ఇది శరీరానికి చాలా మంచిది.

నీటి శాతం పుష్కలం

ముఖ్యంగా ఎండాకాలంలో దీనిని తినడం వలన ఇది జీర్ణక్రియ ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. చాలా త్వరగా తీసుకున్న ఆహారం జీర్ణం అయ్యేలా చేస్తుంది.

జీర్ణక్రియ

అలాగే ఎవరు అయితే చాలా త్వరగా బరువు తగ్గాలని ప్రయత్నిస్తున్నారో వారికి ఇది చాలా బెస్ట్ అని చెప్పవచ్చు. దీనిని తినడం వలన సులభంగా బరువు తగ్గుతారు.

బరువు నియంత్రణ

అయితే ఇది ఆరోగ్యానికి చాలా మంచిదైనప్పటికీ, డయాబెటీస్ ఉన్నవారు, అలెర్జీ సమస్యలతో బాధపడే వారు చాలా తక్కువ మోతాదులో తీసుకోవాలి.

వీరు తినడం ప్రమాదకరం