AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

AP News: టెన్త్‌, ఇంటర్ రిజల్ట్స్.. సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు

రాష్ట్ర సచివాలయంలో పాఠశాల, ఇంటర్, ఉన్నత విద్యా విభాగాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షకు ఐటీ, విద్యాశాఖ మంత్రి నారాలోకేష్, విద్యాశాఖ ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఏపీలోని విద్యారంగంలో విప్లవాత్మక మార్పులు రావాలని.. కోర్సుల ఫోర్ క్యాస్టింగ్ జరగాలని సీఎం ఈ సమావేశంలో సూచించారు..

AP News: టెన్త్‌, ఇంటర్ రిజల్ట్స్.. సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు
CM Chandrababu review Meeting
Srilakshmi C
|

Updated on: May 01, 2026 | 6:13 AM

Share

అమరావతి, మే 1: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సచివాలయంలో పాఠశాల, ఇంటర్, ఉన్నత విద్యా విభాగాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షకు ఐటీ, విద్యాశాఖ మంత్రి నారాలోకేష్, విద్యాశాఖ ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఏపీలోని విద్యారంగంలో విప్లవాత్మక మార్పులు రావాలని.. కోర్సుల ఫోర్ క్యాస్టింగ్ జరగాలని సీఎం ఈ సమావేశంలో సూచించారు. రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాలు అందిస్తున్న కోర్సుల రీస్ట్రక్చరింగ్ జరగాలని దిశానిర్దేశం చేశారు. రీసెర్చ్, ఇన్నోవేషన్, స్టార్టప్ లను ప్రోత్సహించేలా విద్యా వ్యవస్థ మార్పులు అందిపుచ్చుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు సూచించారు. క్వాంటం టెక్నాలజీపై కోర్సును ప్రారంభించిన ఆంధ్రా యూనివర్సిటీని ఆయన అభినందించారు. ప్రపంచ స్థాయీ వర్శిటీలతో ఏపీ విశ్వవిద్యాలయాలు పోటీ పడేలా చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు.

కాగా ఏపీలో ప‌దో త‌ర‌గ‌తి ఫ‌లితాలను రాష్ట్ర విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ గురువారం విడుద‌ల చేసిన సంగతి తెలిసిందే. ఆయన ఎక్స్ వేదికగా ఫ‌లితాలు పోస్ట్ చేశారు. మొత్తం ఫలితాల్లో 85.25 శాతం మంది ఉత్తీర్ణ‌త‌ పొందారు. ఇందులో బాలురు 82.68 శాతం ఉత్తీర్ణ‌త‌ పొందగా, బాలిక‌లు 87.90 శాతం చొప్పున ఉత్తీర్ణ‌త‌ సాధించారు. ఈసారి బాలురు కంటే బాలిక‌ల ఉత్తీర్ణ‌త శాతం 5.22 శాతం ఎక్కువగా నమోదైంది. ఈ ఏడాది 12,089 పాఠ‌శాల‌ల్లో చ‌దువుతున్న మొత్తం 6,18,131 మంది విద్యార్ధులు పదో తరగతి పరీక్షలు రాశారు. అత్య‌ధికంగా పార్వ‌తీపురం మ‌న్యం జిల్లాల్లో 96.07 శాతం ఉత్తీర్ణ‌త‌ నమోదైంది. అత్య‌ల్పం అల్లూరు సీతారామ‌రాజు జిల్లా 57.02 శాతం ఉత్తీర్ణ‌త‌ నమోదైంది. రాష్ట్రంలో 2161 పాఠ‌శాలల్లో 100 శాతం ఉత్తీర్ణ‌త‌ నమోదైంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్ చేయండి.

Follow Us
నిద్రలో పళ్లు కొరుకుతున్నారా? ఈ కారణాలు, లక్షణాలు తెలుసుకోండి!
నిద్రలో పళ్లు కొరుకుతున్నారా? ఈ కారణాలు, లక్షణాలు తెలుసుకోండి!
కాళ్ల నొప్పి పదేపదే వస్తుందా? ఈ 3 పోషకాల లోపం కారణం కావచ్చట!
కాళ్ల నొప్పి పదేపదే వస్తుందా? ఈ 3 పోషకాల లోపం కారణం కావచ్చట!
30 ఏళ్ల నొప్పికైనా 5 నిమిషాల్లో ఉపశమనం.. నిమ్మకాయతో ఇలా చేస్తే
30 ఏళ్ల నొప్పికైనా 5 నిమిషాల్లో ఉపశమనం.. నిమ్మకాయతో ఇలా చేస్తే
గజకేసరి రాజయోగంతో ఈ 4 రాశులకు అదృష్టం, ఊహించని ధనలాభం! మీ రాశి..
గజకేసరి రాజయోగంతో ఈ 4 రాశులకు అదృష్టం, ఊహించని ధనలాభం! మీ రాశి..
హైదరాబాద్‌కు వాటర్ అలర్ట్.. వర్షాలు పడుతున్నా నీటి భయం ఎందుకు..?
హైదరాబాద్‌కు వాటర్ అలర్ట్.. వర్షాలు పడుతున్నా నీటి భయం ఎందుకు..?
అక్క తోప్ హీరోయిన్ చెల్లి మాత్రం సినిమాలు మానేసి ఇప్పుడు ఇలా..
అక్క తోప్ హీరోయిన్ చెల్లి మాత్రం సినిమాలు మానేసి ఇప్పుడు ఇలా..
సినిమా చూస్తా.. సీఎం సార్ పర్మిషన్ ఇవ్వండి.. రేవంత్ రెడ్డికి నాని
సినిమా చూస్తా.. సీఎం సార్ పర్మిషన్ ఇవ్వండి.. రేవంత్ రెడ్డికి నాని
బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తున్న ఒకే ఒక్క హిట్..
బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తున్న ఒకే ఒక్క హిట్..
పసిఫిక్‌లో వేడి.. హైదరాబాద్ మార్కెట్‌లో ధరల సెగలు..
పసిఫిక్‌లో వేడి.. హైదరాబాద్ మార్కెట్‌లో ధరల సెగలు..
గణపయ్యకు 10వ రోజు పెరుగు వడ నైవేద్యం..
గణపయ్యకు 10వ రోజు పెరుగు వడ నైవేద్యం..