AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మన ఒంట్లో ఈ పార్ట్‌ సరిగ్గా క్లీన్‌ చేయకుంటే.. రోగాలకు రెడ్‌ కార్పెట్‌ వేసినట్లే!

మనలో చాలా మంది అత్యంత మురికిగా ఉంటాయని చెవులను, ముక్కును తరచు శుభ్రం చేసుకుంటూ ఉంటాం. కానీ ఇవి అంత మురికి భాగాలు కావు. మానవ శరీరంలో అత్యంత మురికిగా ఉండే భాగం బొడ్డు. బొడ్డులో బ్యాక్టీరియా, హానికరమైన సూక్ష్మజీవులు సులభంగా పేరుకుపోతాయి. కాబట్టి ఈ భాగం శుభ్రత విషయంలో కొంచెం ఎక్కువ శ్రద్ధ తీసుకోవాలి..

మన ఒంట్లో ఈ పార్ట్‌ సరిగ్గా క్లీన్‌ చేయకుంటే.. రోగాలకు రెడ్‌ కార్పెట్‌ వేసినట్లే!
Belly Button Health
Srilakshmi C
|

Updated on: Apr 30, 2026 | 3:14 PM

Share

మన ఒంట్లో సాధారణంగా చెవులు, ముక్కు అత్యంత మురికిగా ఉండే భాగాలు అని అనుకుంటారు. అందుకే చెవులను, ముక్కును తరచు శుభ్రం చేసుకుంటూ ఉంటాం. కానీ ఇవి అంత మురికి భాగాలు కావు. మానవ శరీరంలో అత్యంత మురికిగా ఉండే భాగం బొడ్డు. బొడ్డులో బ్యాక్టీరియా, హానికరమైన సూక్ష్మజీవులు సులభంగా పేరుకుపోతాయి. కాబట్టి ఈ భాగం శుభ్రత విషయంలో కొంచెం ఎక్కువ శ్రద్ధ తీసుకోవాలి. దీనిని సరిగ్గా శుభ్రం చేయకపోతే దుర్వాసనకు కారణం అవ్వడమే కాకుండా ఇన్ఫెక్షన్లకు కూడా దారితీస్తుంది. కాబట్టి బొడ్డు శుభ్రత విషయంలో తగిన శ్రద్ధ వహించాలి.

బొడ్డు ప్రాంతం ఎందుకు అత్యంత మురికిగా ఉంటుంది?

బొడ్డు లోపలి వైపున ఉండటం వల్ల అక్కడ చెమట, చనిపోయిన చర్మ కణాలు, సబ్బు మరకలు, బట్టల పీచులు పేరుకుపోతాయి. దీనిని చాలా కాలం పాటు శుభ్రం చేయకపోవడం వల్ల అక్కడ బ్యాక్టీరియా, ఫంగస్ పెరుగుతాయి. ఈ కారణంగానే బొడ్డు తరచుగా దుర్వాసన వస్తుంది. ఒక అధ్యయనం ప్రకారం, బొడ్డులో వేలాది రకాల బ్యాక్టీరియా నివసిస్తాయి. వాటిలో చాలా వరకు ఇన్ఫెక్షన్‌కు కారణమవుతాయి. కానీ చాలా మంది బొడ్డు పరిశుభ్రతపై శ్రద్ధ పెట్టరు. దీనివల్ల బొడ్డు మరింత మురికిగా మారి దుర్వాసన వస్తుంది. అందుకే బొడ్డు పరిశుభ్రత విషయంలో శ్రద్ధ తీసుకోవాలి.

బొడ్డును ఎలా శుభ్రం చేసుకోవాలి ?

బొడ్డు మురికిగా ఉండే ప్రదేశం కాబట్టి, దానిని శుభ్రంగా ఉంచుకోవడం చాలా ముఖ్యం. చర్మవ్యాధి నిపుణుల ప్రకారం బొడ్డులో బ్యాక్టీరియా సులభంగా పేరుకుపోతుంది. కాబట్టి దీనిని నివారించడానికి శుభ్రత చాలా అవసరం. అధిక బరువు ఉన్నవారు, టైప్ 2 డయాబెటిస్ ఉన్నవారు, బొడ్డుకు పియర్సింగ్ చేయించుకున్నవారు శుభ్రంగా ఉంచుకోవాలి. ఈ పార్ట్‌ను శుభ్రం చేసుకోవడానికి గోరువెచ్చని నీటిని ఉపయోగించాలి. ఇది మురికిని మరింత సమర్థవంతంగా తొలగించడంలో సహాయపడుతుంది. అలాగే బొడ్డు ఎర్రగా ఉన్నా, దురదగా ఉన్నా, నొప్పిగా ఉన్నా, దుర్వాసన వస్తున్నా దానిని నిర్లక్ష్యం చేయకూడదు. వెంటనే వైద్యుడిని సంప్రదించాలి.

ఇవి కూడా చదవండి

బొడ్డు తర్వాత, మన ‘నోరు’ అత్యంత మురికిగా ఉంటుంది. మన నోటిలో లక్షలాది బ్యాక్టీరియా ఉంటాయి. అందుకే రోజుకు రెండుసార్లు పళ్ళు తోముకోవడం చాలా ముఖ్యం. బొడ్డును శుభ్రం చేసుకోకపోతే ఇన్ఫెక్షన్ వచ్చే ప్రమాదం ఉంది. స్నానం చేసేటప్పుడు చిన్న దూది ముక్కతో, మెత్తని గుడ్డతో బొడ్డు లోపలి భాగాన్ని సున్నితంగా శుభ్రం చేసుకోవాలి.

మరిన్ని ఆరోగ్య కథనాల కోసం క్లిక్‌ చేయండి.

Follow Us
సంకష్టహర చతుర్థి.. ఈ విధంగా గణపతిని పూజిస్తే అన్ని విఘ్నాలు తొలగి
సంకష్టహర చతుర్థి.. ఈ విధంగా గణపతిని పూజిస్తే అన్ని విఘ్నాలు తొలగి
బాబా నిరాళా మళ్లీ వస్తున్నాడు.. 'ఆశ్రమ్' సీజన్ 4 ఎప్పటినుంచంటే?
బాబా నిరాళా మళ్లీ వస్తున్నాడు.. 'ఆశ్రమ్' సీజన్ 4 ఎప్పటినుంచంటే?
బడ్జెట్‌లో అండమాన్ ట్రిప్.. 5 రోజుల్లో 3 అందమైన దీవుల సందర్శన..
బడ్జెట్‌లో అండమాన్ ట్రిప్.. 5 రోజుల్లో 3 అందమైన దీవుల సందర్శన..
పీరియడ్స్ సమయంలో వచ్చే ఈ సమస్యను నిమిషాల్లో నయం చేసుకోవచ్చు..
పీరియడ్స్ సమయంలో వచ్చే ఈ సమస్యను నిమిషాల్లో నయం చేసుకోవచ్చు..
చర్చిద్దాం..రా.. తెలంగాణ రాజకీయాల్లో హైఓల్టేజ్‌ ఫైట్‌..
చర్చిద్దాం..రా.. తెలంగాణ రాజకీయాల్లో హైఓల్టేజ్‌ ఫైట్‌..
వారంలో ఏ రోజున ఏ చెట్టును పూజించాలి? ఈ వృక్షారాధనతో ధనం, ఆరోగ్యం
వారంలో ఏ రోజున ఏ చెట్టును పూజించాలి? ఈ వృక్షారాధనతో ధనం, ఆరోగ్యం
అఖిల్ అక్కినేని మూడేళ్లు గ్యాప్ తీసుకోవడానికి కారణమిదే
అఖిల్ అక్కినేని మూడేళ్లు గ్యాప్ తీసుకోవడానికి కారణమిదే
గ్యాస్ సిలిండర్ల ధరలను ఎలా నిర్ణయిస్తారు..?
గ్యాస్ సిలిండర్ల ధరలను ఎలా నిర్ణయిస్తారు..?
ఇవి అదుపులో ఉంచుకుంటే చాలు.. ధనస్సు రాశి వారు కోటీశ్వరులే
ఇవి అదుపులో ఉంచుకుంటే చాలు.. ధనస్సు రాశి వారు కోటీశ్వరులే
స్నానం చేసేటప్పుడు చెవిలోకి నీళ్లు వెళ్లాయా.. ఇలా చేస్తే చిటికెలో
స్నానం చేసేటప్పుడు చెవిలోకి నీళ్లు వెళ్లాయా.. ఇలా చేస్తే చిటికెలో