ప్రేమించి పెళ్లి చేసుకుంటే గుండుకొట్టిస్తారా..? పచ్చని పల్లెలో గుర్తుండిపోయే ప్రేమకథ..

ప్రేమించి పెళ్లి చేసుకున్న పాపానికి..నందు ఆస్పత్రి పాలయ్యాడు. అమ్మాయిని తల్లిదండ్రులు ఇంటి నుంచి కదలనివ్వడం లేదు..కులాలు వేరని..ఇది ఎప్పటికీ కుదరదని..ఏడాది జంటను విడదీశారు. నందు పోలీసులకు కంప్లయింట్‌ చేశాడు. మరి నందుగాడి ప్రేమ కథ ఇంతటితో ఎండ్‌ అవుతుందా..

ప్రేమించి పెళ్లి చేసుకుంటే గుండుకొట్టిస్తారా..? పచ్చని పల్లెలో గుర్తుండిపోయే ప్రేమకథ..
Newly Married Couple
Follow us
Jyothi Gadda

|

Updated on: Jun 06, 2023 | 12:42 PM

నిజామాబాద్‌ జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. కులాలు వేరని ప్రేమ జంటను విడదీసిన పెద్దలు అంతటితో ఆగలేదు. తమ కుమార్తె ప్రేమించిన యువకుడ్ని ఆమె తల్లిదండ్రులు దారుణంగా చావబాదారు. గతేడాది కులాంతర వివాహం చేసుకున్న ప్రేమజంటపై యువతి కుటుంబీకులు కత్తి కట్టారు. యువకుడిపై దాడి చేసి అతనికి గుండుకొట్టించారు యువతి బంధువులు. ఈ ఘటన ఇందల్‌వాయి మండలం ఆన్సన్‌పల్లిలో తీవ్ర కలకలం రేపింది.

అన్సన్‌పల్లికి చెందిన నందు అనే యువకుడు అదే ఊరికి చెందిన ఓ అమ్మాయి..ఇద్దరికీ అనుకోకుండా పరిచయం ఏర్పడింది. మొదటి చూపులోనే ఇరువురి మనసులు కలిశాయి. ఇద్దరి మధ్య ప్రేమ పుట్టింది. ఒకరంటే ఒకరికి ప్రాణంగా ప్రేమించుకున్నారు. ఈ ప్రేమ కథ కొంతకాలం బాగానే సాగింది. వెంటనే పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత.. ట్విస్టులు మొదలయ్యాయి.. అన్ని ప్రేమకథల్లోలాగే..నందుగాడి ప్రేమ కథలోనూ అమ్మాయి తండ్రి ఎంటరయ్యాడు. అక్కడి నుంచీ ప్రేమకథ నెక్ట్స్‌ లెవెల్‌కు వెళ్లింది. అమ్మాయి ప్రేమకథ తెలిసిన ఆ తండ్రి పగతో రగిలిపోయారు. పగతోనే జీవిస్తున్నాడు. ఈలోగా నందు భార్య కుటుంబ సభ్యులు కొందరు బాగానే మాట్లాడుతున్నారు. గొడవలు సద్దుమణిగాయనుకున్నారు. పెద్దల మనసు కరిగిందనుకున్నారు. అందరూ ఒకటయ్యారనుకున్నారు. నందు కూడా ఇది నమ్మేశాడు. భార్యను పుట్టింటికి పంపాడు..

ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యను ప్రేమతో పుట్టింటికి పంపించటమే అతడు చేసిన పాపంగా మారింది. భార్య పుట్టింటికి వెళ్లిన తర్వాత తను కూడా వెళ్లాడు.. వెళ్లిన వెంటనే అతడిపై దొంగతనం నింద మోపి..గుండు కొట్టించి చితక్కొట్టారు భార్య పుట్టింటి వారు. ఊర్లోని ఇంటికో మనిషి నందును కొట్టారు. విచిత్రం ఏంటంటే.. ఈ దారుణం సర్పంచ్‌ ముందే జరగడం..ఆయన కూడా ఈ చోద్యాన్ని చూస్తూ ఉండిపోయారు.

ఇవి కూడా చదవండి

ప్రేమించి పెళ్లి చేసుకున్న పాపానికి..నందు ఆస్పత్రి పాలయ్యాడు. అమ్మాయిని తల్లిదండ్రులు ఇంటి నుంచి కదలనివ్వడం లేదు..కులాలు వేరని..ఇది ఎప్పటికీ కుదరదని..ఏడాది జంటను విడదీశారు. నందు పోలీసులకు కంప్లయింట్‌ చేశాడు. మరి నందుగాడి ప్రేమ కథ ఇంతటితో ఎండ్‌ అవుతుందా..మళ్లీ భార్య తన దగ్గరికి చేరుకుంటుందా..పుట్టింటిలోనే ఉంటుందా.. పోలీసులు ఎలాంటి పరిష్కారం ఇవ్వనున్నారు అనేది వేచి చూడాల్సిందే..!

మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం ..