AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Panchayat Raj: స్థానిక సంస్థలకు గుడ్‌న్యూస్.. రూ.432 కోట్ల నిధులు విడుదల చేసిన తెలంగాణ సర్కార్

గ్రామీణ ప్రాంత స్థానిక సంస్థలకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రూ.432 కోట్ల నిధులు విడుదల చేసింది.

Panchayat Raj: స్థానిక సంస్థలకు గుడ్‌న్యూస్.. రూ.432 కోట్ల నిధులు విడుదల చేసిన తెలంగాణ సర్కార్
Balaraju Goud
|

Updated on: Aug 21, 2021 | 2:17 PM

Share

Panchayat Raj Fund released: గ్రామీణ ప్రాంత స్థానిక సంస్థలకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రూ.432 కోట్ల నిధులు విడుదల చేసింది. ఈ మేరకు పంచాయతీరాజ్ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో 15వ ఆర్థిక సంఘం, రాష్ట్ర ప్రభుత్వ మ్యాచింగ్ గ్రాంటు నిధులు విడుదలయ్యాయి. గ్రామ పంచాయతీలకు రూ.182.49 కోట్లు కాగా, మండల పరిషత్‌లకు రూ.124.11 కోట్లు, జిల్లా పరిషత్‌లకు రూ. 125.95 కోట్లు విడుదల చేశారు.

ఇదిలావుంటే, ఇటీవల కేంద్ర ప్రభుత్వం కూడా పట్టణ, గ్రామీణ ప్రాంతాలకు సంబంధించి గ్రాంట్లను విడుదల చేసింది. 15 వ ఆర్థిక సంఘం సిఫారసుల మేరకు పట్టణ స్థానిక సంస్థలకు గ్రాంట్లు విడుదల చేశారు. వారు నిర్దిష్ట పౌర సేవలను మెరుగుపరచడం లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ గ్రాంట్‌లు కంటోన్మెంట్ బోర్డ్‌లతో సహా చిన్న నగరాల కోసం ఉద్దేశించినవి కేంద్ర ఆర్థిక శాఖ స్పష్టం చేసింది.

15 వ ఆర్థిక సంఘం పట్టణ స్థానిక సంస్థలను రెండు వర్గాలుగా విభజించింది: (ఏ) మిలియన్-ప్లస్ పట్టణాలు, నగరాలు (ఢిల్లీ, శ్రీనగర్ మినహా), (బి) ఒక మిలియన్ కంటే తక్కువ జనాభా ఉన్న అన్ని ఇతర నగరాలు, పట్టణాలు. నాన్ మిలియన్ ప్లస్ సిటీలకు 15 వ ఫైనాన్స్ కమిషన్ సిఫార్సు చేసిన గ్రాంట్లలో, 50% బేసిక్ మిగిలిన 50% జత కట్టే గ్రాంట్‌గా విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది.

జీతం లేదా ఇతర స్థాపన వ్యయం మినహా స్థానిక అవసరాల పరంగా ప్రాథమిక గ్రాంట్‌లు (అన్‌టైడ్) ఉపయోగిస్తారు. జత కూడే గ్రాంట్లు (ఎ) తాగునీరు (రెయిన్‌వాటర్ హార్వెస్టింగ్, రీసైక్లింగ్‌తో సహా) (బి) ఘన వ్యర్థాల నిర్వహణ కోసం ఉపయోగిస్తారు. కేంద్ర ప్రాయోజిత పథకాల కింద పారిశుధ్యం, తాగునీటి కోసం కేంద్రం, రాష్ట్రం కేటాయించిన నిధుల కంటే పట్టణ స్థానిక సంస్థలకు అదనపు నిధులను అందించేలా గ్రాంట్‌లు వినియోగించుకోవచ్చని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇదిలావుంటే, కేంద్ర ప్రభుత్వం నుండి రాష్ట్రానికి 10 రోజుల పని దినాల్లో గ్రాంట్లను యుఎల్బీలకు బదిలీ చేయాల్సి ఉంటుంది. 10 పని రోజులకు మించి ఆలస్యం అయితే రాష్ట్ర ప్రభుత్వాలు గ్రాంట్లను వడ్డీతో విడుదల చేయాల్సి ఉంటుంది.

2021-22 రాష్ట్రాల వారీగా పట్టణ స్థానిక సంస్థలకు విడుదలైన గ్రాంట్లు 

వరుస 

సంఖ్య 

రాష్ట్రం 

2021-22 లో  విడుదలైన నిధులు 

(రూ.కోట్లలో)

1 గోవా 5.40
2 గుజరాత్ 110.20
3 హర్యానా 77.40
4 హిమాచల్ ప్రదేశ్ 51.75
5 ఝార్ఖండ్ 74.80
6 కర్ణాటక 150.00
7 మధ్యప్రదేశ్ 199.60
8 మిజోరాం 6.80
9 ఒడిశా 164.40
10 పంజాబ్ 74.00
11 రాజస్థాన్ 196.20
12 తమిళనాడు 295.25
13 తెలంగాణ 50.43
14 ఉత్తరప్రదేశ్ 851.00
15 పశ్చిమ బెంగాల్ 209.50
మొత్తం  2,516.73

Read Also… Covovax vaccine: కోవోవాక్స్ అత్యవసర వినియోగానికి సీరం కంపెనీకి ప్రపంచ ఆరోగ్య సంస్థ గ్రీన్ సిగ్నల్