AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Thieves: మేకను దొంగిలించేందుకు ప్రయత్నించాడు.. అడ్డంగా బుక్కయ్యాడు.. ఆ తరువాత ఏం జరిగిందంటే..

Thieves: ఇప్పటి వరకు ఇళ్లు దోపిడీ, దారి దోపిడీ, చైన్ స్నాచింగ్ ఘటనలు మాత్రం ఎక్కువగా వెలుగు చూస్తుండేవి. కానీ, ఈ మధ్య కాలంలో సాధు జంతువుల

Thieves: మేకను దొంగిలించేందుకు ప్రయత్నించాడు.. అడ్డంగా బుక్కయ్యాడు.. ఆ తరువాత ఏం జరిగిందంటే..
Thieve
Shiva Prajapati
|

Updated on: Aug 21, 2021 | 1:50 PM

Share

Thieves: ఇప్పటి వరకు ఇళ్లు దోపిడీ, దారి దోపిడీ, చైన్ స్నాచింగ్ ఘటనలు మాత్రం ఎక్కువగా వెలుగు చూస్తుండేవి. కానీ, ఈ మధ్య కాలంలో సాధు జంతువుల దోపిడీ ఎక్కువైపోతోంది. బర్లు, గొర్లు, మేకలు, గోవులను ఎత్తుకెళ్తున్నారు దుండగులు. ప్రస్తుత కాలంలో పశువులకు భారీగా ధరలు పెరగడంతో.. దొంగలు వాటిపై కన్నేశారు. తాజాగా మహబూబాబాద్‌ జిల్లాలో ఓ వ్యక్తి మేక ను దొంగిలించబోయి అడ్డంగా బుక్కయ్యాడు. ఫలితంగా ఒళ్లు హూనం చేయించుకుని ఊచలు లెక్కిస్తున్నాడు. ఈ ఘటనకు సంబంధించి స్థానికులు, పోలీసు అధికారులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. మహబూబాబాద్ జిల్లా కేసముద్రంలోని ఎన్టీఆర్‌ నగర్‌లో బోడ సునీల్ అనే వ్యక్తి రెచ్చిపోయాడు. పట్ట పగలే మేకను దొంగిలించేందుకు ప్రయత్నించాడు.

అయితే, చోరీ యత్నాన్ని గమనించిన రైతులు.. సునీల్‌ను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. సునీల్‌ను పట్టుకున్న రైతులు మొదట అతనికి దేహశుద్ధి చేశారు. కర్రలతో చితకబాదారు. స్తంభానికి తాళ్లతో కట్టేసి కొట్టారు. ఆ తరువాత పోలీసులకు సమాచారం అందించారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఎన్టీఆర్‌ నగర్‌కు చేరుకున్నారు. జరిగిన ఘటనపై స్థానికులను ఆరా తీశారు. అనంతరం మేకను దొంగిలించేందుకు యత్నించిన సునీల్‌ను అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించారు. అతనిపై కేసు నమోదు చేసి విచారిస్తున్నారు.

Also read:

Panchayat Raj: స్థానిక సంస్థలకు గుడ్‌న్యూస్.. రూ.432 కోట్ల నిధులు విడుదల చేసిన తెలంగాణ సర్కార్

Delhi supreme court: సుప్రీంకోర్టు బయట నిప్పంటించుకున్న జంటలో ఒకరి మృతి..

క్యాన్సర్ విద్యార్థిని ఎగతాళి చేసిన కూతురికి తండ్రి రెండు అప్షన్స్.. సెల్ వదులుకో.. లేదా గుండు చేసుకో..కూతురు ఏ శిక్ష ఎంచుకుందంటే