Supreme court: సుప్రీంకోర్టు బయట నిప్పంటించుకున్న జంటలో ఒకరి మృతి..
ఇటీవల ఢిల్లీలో సుప్రీంకోర్టు బయట ఓ మహిళతో బాటు నిప్పంటించుకున్న 27 ఏళ్ళ యువకుడు... రామ్ మనోహర్ లోహియా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శనివారం ఉదయం మరణించాడు. ఇతనికి 65 శాతం గాయాలయ్యాయని పోలీసులు తెలిపారు.
ఇటీవల ఢిల్లీలో సుప్రీంకోర్టు బయట ఓ మహిళతో బాటు నిప్పంటించుకున్న 27 ఏళ్ళ యువకుడు… రామ్ మనోహర్ లోహియా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శనివారం ఉదయం మరణించాడు. ఇతనికి 65 శాతం గాయాలయ్యాయని పోలీసులు తెలిపారు. ఇతని వెంట ఉన్న 24 ఏళ్ళ యువతికి 85 శాతం గాయాలయ్యాయని, ఆమె చికిత్స పొందుతోందని వారు చెప్పారు. యూపీలోని ఘాజీపూర్ కు చెందిన ఈ యువతిపై 2019 లో బహుజన్ సమాజ్ పార్టీకి చెందిన ఎంపీ అతుల్ రాయ్ అత్యాచారం చేశాడని.. ఈ నేరానికి గాను గత రెండేళ్లుగా జైలు శిక్ష అనుభవిస్తున్నాడని వారు పేర్కొన్నారు. ఈ మహిళ..ఈమెతో బాటు ఉన్న మరో వ్యక్తి ఇటీవల సుప్రీంకోర్టు బయట తమ ఒంటిపై పెట్రోలు పోసుకుని ఆత్మహత్యాయత్నం చేశారు. ఫేస్ బుక్ లైవ్ లో దాన్ని స్ట్రీమ్ చేశారు. 2019 లో తాను అతుల్ రాయ్ పై కేసు పెట్టినప్పటి నుంచి కొందరు పోలీసు అధికారుల నుంచి, ఇతరుల నుంచి కూడా బెదిరింపులు అందాయని.. నిందితుడి తరఫు వారు తనను తప్పుడు కేసుల్లో ఇరికిస్తామని భయపెడుతూ వచ్చారని ఈ మహిళ తెలిపింది.
యూపీ లోని ఓ లోకల్ కోర్టు తనకు నాన్ బెయిలబుల్ వారంట్ జారీ చేసిందని, జడ్జి నుంచి సమన్లు అందాయని ఈమె పేర్కొంది. తనకు ప్రాణహాని ఉన్నందున తన కేసును అలహాబాద్ కోర్టు నుంచి ఢిల్లీ కోర్టుకు మార్చాలని ఈమె సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసిందని ఢిల్లీ పోలీసులు తెలిపారు. పైగా ఈ మహిళ ఫోర్జరీకి పాల్పడిందంటూ నిందితుడు రాయ్ సోదరుడు కూడా ఈమెపై కేసు పెట్టినట్టు తెలిసిందన్నారు. దాంతో వారణాసి లోని కోర్టు ఈమెకు నాన్-బెయిలబుల్ వారంట్ జారీ చేసిందన్నారు.
మరిన్ని ఇక్కడ చూడండి: మంచు విష్ణు మరో షాక్..!’మా’ రచ్చ మళ్ళీనా..?హాట్ టాపిక్ గా మారిన విష్ణు ట్వీట్..:MAA Elections 2021 vIdeo.
శింగనమల మండలంలో విషాదం.. కొండపై నుండి కాలుజారి పూజారి మృతి..Priest Falls Down Live Video.
రాహుల్ హత్యకేసులో సంచలన నిజాలు.. స్పీడ్ అందుకున్న ఇన్విస్టిగేషన్..:Rahul Murder Mystery Live Video.
Local to global Video: రాహుల్ హత్యకేసు మరియు నకిలీ చలానా కేసులో కదులుతున్న డొంక..(వీడియో).