OU Exams Postponed: ఓయూ పరిధిలో జరగాల్సిన పరీక్షలన్నీ వాయిదా.. మళ్లీ పరీక్షలు ఎప్పుడంటే..
OU Exams Postponed: హైదరాబాద్‌తో పాటు తెలంగాణలోని ఇతర జిల్లాల్లో భారీ వర్షాల కారణంగా గురు, శుక్రవారాల్లో జరగాల్సిన అన్ని పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు ఉస్మానియా యూనివర్సిటీ (ఓయూ) ప్రకటించింది. వర్షాల కారణంగా తెలంగాణలోని అన్ని విద్యాసంస్థలకు రాష్ట్ర ప్రభుత్వం రెండు రోజుల సెలవు ప్రకటించిన విషయం తెలిసిందే.

OU Exams Postponed: హైదరాబాద్‌తో పాటు తెలంగాణలోని ఇతర జిల్లాల్లో భారీ వర్షాల కారణంగా గురు, శుక్రవారాల్లో జరగాల్సిన అన్ని పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు ఉస్మానియా యూనివర్సిటీ (ఓయూ) ప్రకటించింది. వర్షాల కారణంగా తెలంగాణలోని అన్ని విద్యాసంస్థలకు రాష్ట్ర ప్రభుత్వం రెండు రోజుల సెలవు ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఓయూ అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. వాయిదా వేసిన పరీక్షలకు సంబంధించి రీషెడ్యూల్‌ను త్వరలో ఓయూ అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచుతామని ప్రకటించారు.
అంతకుముందు తెలంగాణ విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ట్విట్టర్ వేదికగా విద్యా సంస్థలు సెలవు ప్రకటిస్తూ ఒక పోస్ట్ చేశారు. ‘రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాల దృష్ట్యా, సీఎం కేసీఆర్ సూచనల మేరకు రాష్ట్ర ప్రభుత్వం విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించాలని నిర్ణయించింది. రాష్ట్రంలోని అన్ని విద్యా సంస్థలకు గురువారం, శుక్రవారం నాడు సెలవులు ఇవ్వడం జరిగింది’ అని ప్రకటించారు.
పరీక్షలు వాయిదా వేయాలంటూ విద్యార్థుల ఆందోళన..
ఇదిలాఉంటే.. ఓయూ పరిధిలో జరగాల్సిన పరీక్షను వాయిదా వేయాలంటూ యూనివర్సిటీ విద్యార్థులు ఆందోళన చేపట్టిన విషయం తెలిసిందే. ఈ నెల 28 నుంచి జరగాల్సిన పరీక్షలను వాయిదా వేయాలంటూ ఓయూ విద్యార్థులు బుధవారం ఆందోళనకు దిగారు. అర్థరాత్రి సైతం స్టూడెంట్స్ తమ డిమాండ్ నెరవేర్చలాంటూ రోడ్డుపై బైటయించారు. నిన్నటినుండి చేపట్టిన తమ నిరసన వీసి వచ్చి హామీ ఇచ్చేవరకువెనక్కి తగ్గే ప్రసక్తే లేదని ఓయూ విద్యార్థులు హెచ్చరించారు. సిలబస్ పూర్తికాకుండా పరీక్షలు ఎలా నిర్వహిస్తారని విద్యార్థినులు ప్రశ్నించారు. సెప్టెంబర్లో నిర్వహించాల్సిన పీజీ సైన్స్ 2వ, 4వ సెమిస్టర్ పరీక్షలను జూలైలో ఎలా నిర్వహిస్తారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పరీక్షలువాయిదా వేసేదాక తమ ఆందోళన నిర్వహిస్తామని హెచ్చరించారు.వర్షంలోనే నిన్నటి ఉదయం నుండి కొనసాగుతున్న ఆందోళన అర్థరాత్రి ఓయూ కాలేజ్ లేడీస్ హాస్టల్ ముందు చేపట్టిన ధర్నాలో పెద్ద ఎత్తున విద్యార్థులు పాల్గొన్నారు. ఓయూ విసి ఉన్నతాధికారులు, తమ గోడు పట్టించుకోవట్లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అర్థరాత్రి వానను సైతం లెక్కచేయకుండా పెద్ద ఎత్తున విద్యార్థులు నిరసన కార్యక్రమంలోపాల్గొన్నారు.




మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..




