తెలంగాణలో ఆ ప్రాజెక్టు చుట్టూ రాజకీయం.. కొనసాగుతున్న క్రెడిట్ వార్..

సీతారామ ప్రాజెక్టు చుట్టూ రాజకీయం నడుస్తోంది. ఆగస్టు 15 న సీఎం రేవంత్ రెడ్డి ప్రాజెక్టును ప్రారంభిస్తున్నారు. దీంతో కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య క్రెడిట్ వార్ నడుస్తోంది. ప్రాజెక్టు పూర్తి చేసిన ఘనత తమదేనని.. తాము కట్టిన ప్రాజెక్టు‎కు మీరు రిబ్బన్ కటింగ్ అంటూ మాజీ మంత్రి హరీష్ రావు మండిపడ్డారు.

తెలంగాణలో ఆ ప్రాజెక్టు చుట్టూ రాజకీయం.. కొనసాగుతున్న క్రెడిట్ వార్..
Telangana
Follow us
N Narayana Rao

| Edited By: Srikar T

Updated on: Aug 13, 2024 | 7:56 PM

సీతారామ ప్రాజెక్టు చుట్టూ రాజకీయం నడుస్తోంది. ఆగస్టు 15 న సీఎం రేవంత్ రెడ్డి ప్రాజెక్టును ప్రారంభిస్తున్నారు. దీంతో కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య క్రెడిట్ వార్ నడుస్తోంది. ప్రాజెక్టు పూర్తి చేసిన ఘనత తమదేనని.. తాము కట్టిన ప్రాజెక్టు‎కు మీరు రిబ్బన్ కటింగ్ అంటూ మాజీ మంత్రి హరీష్ రావు మండిపడ్డారు. తాము ఏమి చేసినా రైతులు, ప్రజలు కోసమే చేశామని క్రెడిట్ కోసం పాకులాడలేదని విమర్శించారు. ప్రజాస్వామ్యంలో మీది, నాదీ అంటూ ఉండదని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వ్యాఖ్యానించారు.

ఖమ్మం జిల్లాలో చేపట్టిన సీతారామ ప్రాజెక్టు‎ చుట్టూ రాజకీయం నడుస్తోంది. ప్రాజెక్టు పూర్తి చేసింది మేమంటే..మేము అని కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతలు చెప్పుకుంటున్నారు. ప్రాజెక్టుపై అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ మధ్య క్రెడిట్ వార్ నడుస్తోంది. సీతారామ ప్రాజెక్టును పూర్తి చేసిన ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వానిదేననీ మాజీ మంత్రి హరీష్ రావు తెలిపారు. ఈ ప్రాజెక్టును అడ్డుకోవడానికి కాంగ్రెస్ కోర్టులో కేసులు వేసినా.. అన్ని అవరోధాలు అధిగమించి పూర్తి చేశామని ఆయన తెలిపారు. 95 శాతం పనులు పూర్తి చేసింది బీఆర్ఎస్ ప్రభుత్వం అయితే ఆ క్రెడిట్ కోసం కాంగ్రెస్ మంత్రులు పోటీ పడుతున్నారని విమర్శించారు.

ఇతరుల ఘనతను తమదిగా చెప్పుకునే భావదారిద్ర్యం నుంచి కాంగ్రెస్ బయటపడాలని ఘాటుగా విమర్శించారు. 2004 నుంచి 2014 వరకు పదేళ్లు కాంగ్రెస్ అధికారంలో ఉండి.. ప్రాజెక్టుకు కనీసం అనుమతులు కూడా తీసుకురాలేదన్నారు. రైతులు అవసరాల కోసం ప్రాజెక్టును రీ డిజైన్ చేసి అయకట్టును 3 లక్షల ఎకరాల నుంచి 6.7 లక్షల ఎకరాలకు పెంచామన్నారు. నీటి సామర్థ్యాన్ని 27 నుంచి 67 టీఎంసీలకు పెంచామని తెలిపారు. కేసీఆర్ కేంద్రం నుంచి అనుమతులు తీసుకువచ్చారన్నారు.

ఇదిలా ఉంటే బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో సీతారామ ప్రాజెక్టును రీ డిజైన్ పేరుతో 18 వేల కోట్లకు అంచనాలు పెంచి అవినీతికి పాల్పడ్డారని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. మాజీ మంత్రి హరీష్ రావు వ్యాఖ్యలపై మంత్రి తుమ్మల నాగేశ్వరరావు భావోద్వేగం కు గురయ్యారు. ప్రెస్ మీట్‎లో మంత్రి తుమ్మల కన్నీరు పెట్టుకున్నారు. తన 40 సంవత్సరాల రాజకీయ జీవితంలో టికెట్, పదవులు కోసం ఎవరినీ అడగలేదని.. అలాగే క్రెడిట్, ప్రచారం కోసం పాకులాడే వ్యక్తిని కాదన్నారు. పక్కనే గోదావరి ఉన్నా.. వాడుకునే అవకాశం లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు.

జిల్లాలో అన్ని ప్రాంతాలకు నీళ్ళు ఇవ్వాలన్నదే తన సంకల్పం అన్నారు. వైఎస్ హయాంలో ఇందిరా సాగర్, రాజీవ్ సాగర్ దీనిని చేపట్టారని గుర్తు చేశారు. వైఎస్ మరణంతో ప్రాజెక్టును పట్టించు కోలేదని తెలిపారు. తనకు బీఆర్ఎస్‎లోకి ఆహ్వానం వస్తే ప్రాజెక్టు కావాలని ప్రతిపాదన పెట్టినట్లు తెలిపారు. నాటి సీఎం కేసీఆర్ ప్రాజెక్టుకు శంఖుస్థాపన చేశారన్నారు. రెండో సారి అధికారంలోకి వచ్చినపుడు కేవలం పంపు హౌజ్‎లకు మాత్రమే పరిమితం అయ్యిందని.. ఆ తరువాత పట్టించుకోలేదని విమర్శించారు. జూలూరు పాడు టన్నెల్ నిర్ణయం కాలేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో తనకు మంత్రిగా అవకాశం వచ్చిందని.. మొదటి రోజే సత్తుపల్లి టన్నెల్ పనులు ప్రారంభించానన్నారు.

సీఎం, ఇరిగేషన్ మంత్రికి రిక్వెస్ట్ చేస్తే.. రాజీవ్ లింక్ కెనాల్ మంజూరు చేశారన్నారు. ప్రభుత్వంపై నమ్మకంతో.. రైతులు భూములు ఇచ్చారని గుర్తు చేశారు. గత 5 సంవత్సరాలు అధికారంలో ఉండి ఈ ప్రాజెక్టును ఎందుకు ప్రారంభంచలేదని ప్రశ్నించారు. అప్పుడే ప్రారంభించి మీరే క్రెడిట్ తీసుకోవచ్చు కదా అని కౌంటర్ ఇచ్చారు. తాను ప్రచారం కోసం ఎపుడూ ప్రాకులాడ లేదన్నారు. ప్రాజెక్టు మేము చేశామని అంటున్నారు.. ప్రజాస్వామ్యంలో మాది, మీది ఉండదని.. నీ సొంతం, నా సొంతం ఉండదు ఇది ప్రజలది అని తెలిపారు. దీంతో ఇరు పార్టీల మధ్య ప్రాజెక్టు క్రెడిట్ వార్ నడుస్తోంది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..

కొత్త ఏడాది 2025లో వచ్చే మార్పులు ఇవే.! ఆధార్ నుండి UPI వరకు..
కొత్త ఏడాది 2025లో వచ్చే మార్పులు ఇవే.! ఆధార్ నుండి UPI వరకు..
వివాదంలో బాలీవుడ్ సూపర్‌స్టార్ ఫ్యామిలీ.! కోర్టుకెక్కిన రాజేశ్‌ఖన
వివాదంలో బాలీవుడ్ సూపర్‌స్టార్ ఫ్యామిలీ.! కోర్టుకెక్కిన రాజేశ్‌ఖన
ఐస్‌క్రీమ్‌ బిర్యానీ.. చూస్తే దిమ్మ తిరగాల్సిందే. కాంబినేషన్ ఏంటి
ఐస్‌క్రీమ్‌ బిర్యానీ.. చూస్తే దిమ్మ తిరగాల్సిందే. కాంబినేషన్ ఏంటి
ఎవర్రా మీరంతా.. 30 సెకన్లలోనే షాపింగ్ మాల్‌ను ఖాళీ చేసేశారు.!
ఎవర్రా మీరంతా.. 30 సెకన్లలోనే షాపింగ్ మాల్‌ను ఖాళీ చేసేశారు.!
పదేళ్లు ఆగండి.. ఆ గ్రహంపై సిటీనే కట్టేద్దామన్న మస్క్.! వీడియో..
పదేళ్లు ఆగండి.. ఆ గ్రహంపై సిటీనే కట్టేద్దామన్న మస్క్.! వీడియో..
చిన్న వయసులోనే జుట్టు తెల్లబడుతోందా.? అయితే ఇలా చేయండి.!
చిన్న వయసులోనే జుట్టు తెల్లబడుతోందా.? అయితే ఇలా చేయండి.!
మీరు OG OG అంటుంటే బెదిరింపుల్లా ఉన్నాయి.! పవన్‌ రియాక్షన్..
మీరు OG OG అంటుంటే బెదిరింపుల్లా ఉన్నాయి.! పవన్‌ రియాక్షన్..
ఆకాశంలో అద్భుతం.. అరుదైన ‘బ్లాక్​ మూన్’.. ఇప్పుడు మిస్సయితే..
ఆకాశంలో అద్భుతం.. అరుదైన ‘బ్లాక్​ మూన్’.. ఇప్పుడు మిస్సయితే..
ఈ పండు తింటే వృద్ధాప్యం రమ్మన్నా రాదంట.ట్యాబ్లెట్ల తయారీలో ఫ్రూట్
ఈ పండు తింటే వృద్ధాప్యం రమ్మన్నా రాదంట.ట్యాబ్లెట్ల తయారీలో ఫ్రూట్
మరో అదిరిపోయే రీఛార్జ్‌ ప్లాన్‌ ను తీసుకొచ్చిన బీఎస్‌ఎన్‌ఎల్‌.!
మరో అదిరిపోయే రీఛార్జ్‌ ప్లాన్‌ ను తీసుకొచ్చిన బీఎస్‌ఎన్‌ఎల్‌.!