ఒడిస్సా టూ మహారాష్ట్ర.. స్కూటీపై కిలాడీ లేడీ నయా దందా.. పోలీసుల విచారణలో షాకింగ్ నిజాలు
ఓ కిలాడీ లేడీ ఆదిలాబాద్ జిల్లా పోలీసులకు దిమ్మతిరిగే షాక్ ఇచ్చింది. అలా ఇలా కాదు ఏకంగా నాలుగేళ్లు దర్జాగా 600 కిమీలు స్కూటీపై చక్కర్లు కొడుతూ సవాల్ గా విసిరింది. స్కూటీపై చక్లర్లు కొడితే తప్పేంటీ అనేగా.. ఆ లేడీ చక్కర్లు కొట్టింది ఏదో సరదా కోసమో లేదా అదేదో సినిమాలో అలీలా బీదర్ లో ఇసుక చల్లుకోవడం కోసమో కాదు. ఏకంగా గంజాయిని రవాణా చేసేందుకే. అవును నాలుగేళ్లుగా ఎవ్వరికి అనుమానం..

ఓ కిలాడీ లేడీ ఆదిలాబాద్ జిల్లా పోలీసులకు దిమ్మతిరిగే షాక్ ఇచ్చింది. అలా ఇలా కాదు ఏకంగా నాలుగేళ్లు దర్జాగా 600 కిమీలు స్కూటీపై చక్కర్లు కొడుతూ సవాల్ గా విసిరింది. స్కూటీపై చక్లర్లు కొడితే తప్పేంటీ అనేగా.. ఆ లేడీ చక్కర్లు కొట్టింది ఏదో సరదా కోసమో లేదా అదేదో సినిమాలో అలీలా బీదర్ లో ఇసుక చల్లుకోవడం కోసమో కాదు. ఏకంగా గంజాయిని రవాణా చేసేందుకే. అవును నాలుగేళ్లుగా ఎవ్వరికి అనుమానం రాకుండా ఎంచక్కా స్కూటీపై 600 కిమీలు పైగా ప్రయాణిస్తూ యదేచ్చగా గంజాయి రవాణా చేసింది. సీన్ కట్ చేస్తే ఆదిలాబాద్ జిల్లా గుడిహత్నూర్ పోలీసులకు ఎట్టకేలకు చిక్కింది.
పేరు మోహినీ సంతోష్ ఠాక్రే.. వయసు 34 ఏళ్లు. ఒడిస్సా టూ మహరాష్ట్ర స్కూటీ పై ప్రయాణం. ఒకరోజో రెండు రోజులో కాదు నాలుగేళ్లుగా లాంగ్ డ్రైవ్ లో ద్వి చక్ర వాహనాలపై దూసుకెళ్లడం సరదా. అందులోను మహిళ కావడంతో ఇన్నాళ్లు అంత దూరం స్కూటీ పై ఎందుకు ప్రయాణిస్తోందని ఎవ్వరు గమనించాలేదు. సీన్ కడ్ చేస్తే ఇదిగో ఇలా 28 కిలోల గంజాయితీ రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డాక కానీ తెలియలేదు మోహినీ అసలు విశ్వరూపం.
ఈ కిలాడీ లేడు అసలు నాలుగేళ్లుగా 600 కిమీలకు పైగా స్కూటీపై ప్రయాణిస్తోంది సరదా కోసం కాదు.. అక్రమ గంజాయి తరలింపు కోసమని. యాంటి నార్కోటిక్ బ్యూరో సమాచారం మేరకు ఆదిలాబాద్ జిల్లా గుడిహత్నూర్ మండలం పోలీసులు కాపుకాసి.. మాన్కాపూర్ గ్రామం సమీపంలో ఈ మహిళను పట్టుకున్నాక కానీ అసలు భాగోతం తెలియలేదు.. తాను చేస్తోంది గంజాయి అక్రమ రవాణా అని. మోహిని అదుపులోకి తీసుకొని తమదైన స్టైల్ లో విచారించిన పోలీసులకు కిలాడీ లేడీ నాలుగేళ్లుగా సాగించిన గంజాయి అక్రమ రవాణా సమాచారం పూసగుచ్చినట్టు వివరించింది. ఒడిస్సా లోని మల్కన్ గిరి నుండి మహరాష్ట్ర లోని వాసిం కు 600 కిలోమీటర్ల దూరం స్కూటిపై ప్రయాణించి గంజాయి సరఫరా చేస్తున్నానని తెలిపింది మోహినీ సంతోష్ ఠాక్రే (34) అనే మహిళ.
ఒడిస్సాలో గంజాయి పొలంలో కూలీగా పనిచేస్తున్న సమయంలో గంజాయి స్మగ్లర్ గా మారినట్టు తెలిపింది. అడ్డదారిలో ఈజీ మనికోసం ఈ ఫీట్లు చేసినట్టు తెలిపింది మోహిని. కిలాడీ లేడిని అరెస్ట్ చేసిన గుడిహత్నూర్ పోలీసులు నిందితురాలి వద్ద నుండి రెండు సెల్ ఫోన్లు , ఒక స్కూటీ, 28 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. విచారణలో ఆవిడ నటవిశ్వరూపాన్ని చూసి విస్తుపోయామని తెలిపారు మహిళ పోలీసులు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి




