Kishan Reddy: మోదీ చేతుల మీదుగా ఎన్టీపీసీ థర్మల్‌ పవర్‌ ప్లాంట్‌ జాతికి అంకితం: కిషన్‌ రెడ్డి

ఈ పవర్‌ ప్లాంట్‌తో తెలంగాణ ప్రజల గృహ, వాణిజ్య, వ్యవసాయ విద్యుత్ అవసరాలను తీరనున్నాయని కిషన్‌ రెడ్డి తెలిపారు. మార్చి 4న ప్రారంభోత్సవం కానుంది. రూ.11వేల కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న ఈ ప్రాజెక్టులో మొత్తంగా 1600 మెగావాట్ల విద్యుదుత్పత్తి ప్రారంభం కానుంది. దీంతో తెలంగాణ ప్రజల విద్యుత్ అవసరాలు తీరుతాయని...

Kishan Reddy: మోదీ చేతుల మీదుగా ఎన్టీపీసీ థర్మల్‌ పవర్‌ ప్లాంట్‌ జాతికి అంకితం: కిషన్‌ రెడ్డి
Kishan Reddy
Follow us

|

Updated on: Feb 29, 2024 | 9:30 PM

మార్చి 4న ప్రధాని చేతుల మీదుగా ఎన్టీపీసీ థర్మల్ పవర్ ప్లాంట్ జాతికి అంకితం ఇవ్వనున్నారన్ని కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి తెలిపారు. ఆదిలాబాద్ పర్యటనలో భాగంగా రూ. 6,000 కోట్లతో ఎన్టీపీసీ నిర్మించిన 800 మెగావాట్ల థర్మల్ పవర్ ప్లాంట్‌ను ప్రధాని ప్రారంభించనున్నారు పేర్కొన్నారు. గత అక్టోబర్‌లో నిజామాబాద్ పర్యటనలో ప్రధాని 800 మెగావాట్ల థర్మల్ పవర్ ప్లాంట్‌ను ప్రారంభించిన విషయం తెలిసిందే. దీంతో మొత్తంగా 1,600 మెగావాట్ల సామర్థ్యం కలిగిన థర్మల్ పవర్ ప్లాంట్లు అందుబాటులోకి రానున్నాయి.

ఈ పవర్‌ ప్లాంట్‌తో తెలంగాణ ప్రజల గృహ, వాణిజ్య, వ్యవసాయ విద్యుత్ అవసరాలను తీరనున్నాయని కిషన్‌ రెడ్డి తెలిపారు. మార్చి 4న ప్రారంభోత్సవం కానుంది. రూ.11వేల కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న ఈ ప్రాజెక్టులో మొత్తంగా 1600 మెగావాట్ల విద్యుదుత్పత్తి ప్రారంభం కానుంది. దీంతో తెలంగాణ ప్రజల విద్యుత్ అవసరాలు తీరుతాయని కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి వివరించారు. తెలంగాణ ప్రజల విద్యుత్ సమస్యలు తీరడమే కాకుండా, రైతులకు, వాణిజ్య అవసరాలకు నాణ్యమైన విద్యుత్ సరఫరాకు మార్గం సుగమం అవుతుందని మంత్రి అన్నారు.

తెలంగాణ సూపర్ థర్మల్ పవర్ ప్రాజెక్టు క్రింద 1,600 మెగావాట్ల(2*800 MW) సామర్థ్యం కలిగిన థర్మల్ పవర్ ప్లాంట్లను మొదటి విడత (ఫేజ్-I) లో భాగంగా, 2,400 మెగావాట్ల(3*800 MW) సామర్థ్యం కలిగిన థర్మల్ పవర్ ప్లాంట్లను రెండవ విడత (ఫేజ్-II) లో భాగంగా పెద్దపల్లి జిల్లా రామగుండంలో ఏర్పాటు చేయాలని NTPC నిర్ణయం తీసుకుందని. ప్రధాని చొరవతో మొదటి విడత 1600 మెగావాట్ల విద్యుత్ ప్రజలకు అందుబాటులోకి రానుందని కేంద్ర మంత్రి పేర్కొన్నారు. దీంతోపాటుగా 100 మెగావాట్ల సామర్థ్యమున్న దేశంతోనే అతిపెద్ద ఫ్లోటింగ్ సోలార్ పవర్ ప్లాంటును 2022లో NTPC రామగుండంలో ఏర్పాటుచేసిన సంగతి తెలిసిందే.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..

నిమిషంలో నవయవ్వనంగా మార్చే మెషిన్‌.! ఉత్తరప్రదేశ్‌లో ఇదే ట్రెండ్.
నిమిషంలో నవయవ్వనంగా మార్చే మెషిన్‌.! ఉత్తరప్రదేశ్‌లో ఇదే ట్రెండ్.
యూట్యూబర్ హర్షసాయి కేసులో దిమ్మతిరిగే ట్విస్ట్! ఎక్కడున్నావ్ బాస్
యూట్యూబర్ హర్షసాయి కేసులో దిమ్మతిరిగే ట్విస్ట్! ఎక్కడున్నావ్ బాస్
భార్యకు సూపర్ విషెస్‌ చెప్పిన రాక్ స్టార్ మంచు మనోజ్.!
భార్యకు సూపర్ విషెస్‌ చెప్పిన రాక్ స్టార్ మంచు మనోజ్.!
జానీ మాస్టర్‌కు భారీ షాక్‌.! నేషనల్ అవార్డు రద్దు.. మరి బెయిల్.?
జానీ మాస్టర్‌కు భారీ షాక్‌.! నేషనల్ అవార్డు రద్దు.. మరి బెయిల్.?
సారీ చెప్పినా తగ్గని నాగ్ | పవన్ కళ్యాణ్‌పై మధురైలో కేసు నమోదు.
సారీ చెప్పినా తగ్గని నాగ్ | పవన్ కళ్యాణ్‌పై మధురైలో కేసు నమోదు.
బాబోయ్‌.. విమానం ల్యాండ్ అవుతుండగా చెలరేగిన మంటలు.. వీడియో వైరల్
బాబోయ్‌.. విమానం ల్యాండ్ అవుతుండగా చెలరేగిన మంటలు.. వీడియో వైరల్
రాజయ్య అంగిల జొర్రి ఆగం పట్టిచ్చిన తొండ | బతుకమ్మ స్టెప్పులతో..
రాజయ్య అంగిల జొర్రి ఆగం పట్టిచ్చిన తొండ | బతుకమ్మ స్టెప్పులతో..
తల మసాజ్‌ వల్ల పక్షవాతం.! యువకుడి ప్రాణంతో బార్బర్ చెలగాటం..
తల మసాజ్‌ వల్ల పక్షవాతం.! యువకుడి ప్రాణంతో బార్బర్ చెలగాటం..
అమ్మా క్షమించు.! మారాలని ఉన్నా మారలేక శాశ్వతంగా వెళ్లిపోతున్నా.!
అమ్మా క్షమించు.! మారాలని ఉన్నా మారలేక శాశ్వతంగా వెళ్లిపోతున్నా.!
మగమహారాజులకు డేంజర్ బెల్స్.. ఆ క్యాన్సర్ ముప్పు వారికే ఎక్కువ.!
మగమహారాజులకు డేంజర్ బెల్స్.. ఆ క్యాన్సర్ ముప్పు వారికే ఎక్కువ.!