Odd News: పాము కాటుకు నాటు కోడి వైద్యం.. ఒక్క ప్రాణం పోతే ఒట్టు..!
Odd News: పాము కాటుకు నాటు కోడి వైద్యం.. అదేంటి? అని షాక్ అవుతున్నారా? మీరు విన్నది నిజంగా నిజం. ఖమ్మం జిల్లాలో జరుగుతున్న..
Odd News: పాము కాటుకు నాటు కోడి వైద్యం.. అదేంటి? అని షాక్ అవుతున్నారా? మీరు విన్నది నిజంగా నిజం. ఖమ్మం జిల్లాలో జరుగుతున్న.. గ్రామీణ నాటు వైద్యం అక్కడ ఎంతగానో ప్రాచుర్యం పొందింది. ఇప్పటి వరకు ఈ వైద్యం తీసుకున్న వారందరూ ప్రాణాలతో బయటపడ్డారంటే ఈ ట్రీట్‌మెంట్ ఏ స్థాయిలో పనిచేస్తుందో అర్థం చేసుకోవచ్చు. బ్రాహ్మణ పల్లి గ్రామానికి చెందిన ఓ వ్యక్తి వినూత్న రీతిలో.. తక్కువ ఖర్చుతో పాము కాటు వేసిన చోట నాటు కోడితో వైద్యం అందించి ప్రాణాపాయ స్థితి నుంచి బయటపడే మార్గాన్ని కనుగొని అందరిచే శభాష్ అనిపించుకున్నారు. ఈ వినూత్నం వైద్యం గురించి తెలుసుకోవాలంటే ఖమ్మం జిల్లా బోనకల్లు మండలం బ్రాహ్మణపల్లి గ్రామాని వెళ్ళాల్సిందే మరి. అక్కడ వైద్యం ఎలా చేస్తారో ఇప్పుడు తెలుసుకుందాం..
ఖమ్మం జిల్లా బోనకల్లు మండలంలో బ్రాహ్మణపల్లి ఓ చిన్న పల్లెటూరు. చుట్టుపక్కల వారికీ ఈ గ్రామం పేరు తెలియని వారు ఉండరు. ఎందుకంటే అక్కడ అచ్చయ్య అనే నాటు వైద్యుడు పాముకాటుకి కోడి వైద్యం చేసి ఎంతోమంది ప్రాణాలను కాపాడుతున్నాడు. గత 30 సంవత్సరాలుగా ఇక్కడ పాము కాటుకి నాటు కోడితో వైద్యం చేస్తున్నారు. వైద్యం వికటించి ఇంతవరకు ఎవరూ చనిపోలేదు.
నాటుకోడి వైద్యం కోసం ఆ ఊరి ప్రజలే కాక చుట్టుపక్కల పది గ్రామాల వారు కూడా నాటుకోడి వైద్యుడి దగ్గరకు వెళ్తున్నారు. పాము కరిచిన వ్యక్తికి ముందుగా గాయాన్ని గుర్తించి అక్కడ నాటు కోడి మలవిసర్జన ద్వారాన్ని అదిమి ఉంచుతారు. దీంతో మలద్వారం నుండి విషాన్ని పీల్చుకొని కోడి చనిపోతుంది. అలా ఆ విషం పూర్తిగా తొలగిపోయే వరకు గాయం వద్ద వరుసగా నాటు కోళ్లు పెడుతూనేవుంటారు. ఎప్పుడైతే కోడి చనిపోవడం ఆగిపోతుందో అప్పుడు పూర్తిగా విషం తొలగిపోయినట్లు లెక్క. ఇలా పాము కరిచిన వ్యక్తికి 10 నుంచి 30 కోళ్ల వరకు చనిపోతూ ఉంటాయి. అయితే, పాము కరిచిన వ్యక్తి ఆరోజు ఎటువంటి ఆహారం తీసుకోకుండా, రాత్రి పూట నిద్ర పోకుండా మెలకువగా ఉండాలి. మరుసటిరోజు మధ్యాహ్నం భోజనం చేయాలి. ఇది నిబంధన. కొన్ని సందర్భాల్లో ముక్కులో జిల్లేడు లేదా ఆకు పసరు వేస్తారు. దీంతో తుమ్ములు వచ్చి శరీరంలో రక్త ప్రసరణ జరిగి తొందరగా తగ్గుతుందట.
ఈ వైద్యం 30 సంవత్సరాల క్రితం గ్రామంలోని ఓ పాస్టర్ “అముక్తమాల్య”అనే గ్రంథంలో చూసి నేర్చుకోని గ్రామంలో వైద్యం చేయడం ప్రారంభించాడని, కోడి వైద్యంతో ఎవరూ చనిపోక పోవడంతో గ్రామస్తులకు నమ్మకం ఏర్పడింది. అప్పటి నుండి ఇక్కడ ప్రజలు నాటుకోడి వైద్యం చేయించుకుంటున్నారు. ఆ ఫాస్టర్ గ్రామంలోని ప్రేమానందం అనే వ్యక్తికి ఈ వైద్యం నేర్పించాడు. ఇప్పుడు ఆయన కొడుకు అచ్చయ్య ఈ వైద్యం చేస్తున్నాడు. ఈ వైద్యం ఎవరైనా నేర్చుకోవచ్చని, నేర్చుకొని ఎవరికి వారు చేయవచ్చు అని ధీమాగా చెబుతున్నాడు. ఇక్కడ పాముకాటుకు ఉచితంగా వైద్యం చేస్తూ ఉంటారు. అయితే, సంతోషంగా ఎవరైనా డబ్బులిస్తే తీసుకుంటారు.
అయితే, ఇలాంటి నాటు వైద్యాలను విశ్వసించవద్దని, దీనికి ప్రామాణికత లేదని వైద్యులు, నిపుణులు హెచ్చరిస్తున్నారు. దీనికి కూడా ప్రజలు గమనించాల్సింగా సూచన.
Also read: