Viral Video: వాహ్.. ఇలా కదా ప్రేమను ఎక్స్‌ప్రెస్ చేసేది!.. ఈ ఏనుగు తన ప్రేయసికి ఎలా ప్రపోజ్ చేసిందో చూస్తే ఫిదా అయిపోతారంతే..

Viral Video: సమస్త జీవకోటి మనుగడ ప్రేమ అనే పునాదిపైనే సాగుతుందనడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు.

Viral Video: వాహ్.. ఇలా కదా ప్రేమను ఎక్స్‌ప్రెస్ చేసేది!.. ఈ ఏనుగు తన ప్రేయసికి ఎలా ప్రపోజ్ చేసిందో చూస్తే ఫిదా అయిపోతారంతే..
Elephant Love
Follow us
Shiva Prajapati

|

Updated on: Nov 20, 2021 | 5:03 PM

Viral Video: సమస్త జీవకోటి మనుగడ ప్రేమ అనే పునాదిపైనే సాగుతుందనడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. అందుకే అంతటి ప్రేమను వర్ణించేందుకు ప్రమాణాలు లేవంటారు. ప్రేమకు హద్దులు, సరిహద్దులు అనేవి కూడా లేవని చెప్పుకోవాలి. ప్రేమ రెండు మనసుల మధ్య పరిచయం.. ఇద్దరు వ్యక్తుల మాటలను కాకుండా.. మౌనానికి కూడా భావాలను అందిస్తుంది. అయితే, ఈ ప్రేమ మనుషుల్లోనే కాదు.. జంతువుల్లోనూ చిగురిస్తుంది. అది మాతృత్వ ప్రేమ కావొచ్చు.. బంధు ప్రీతి రూపంలో కావొచ్చు.. ఆడ,మగ మధ్య చిగురించే ప్రేమ కావొచ్చు. ఎదుటి వారిపై గుండె లోతుల్లో పుట్టే ఆ ప్రేమ మాధుర్యాన్ని వర్ణించలేం.. అది ఒక అనుభూతి మాత్రమే. అయితే, తాజాగా రెండు ఏనుగుల ప్రేమ కథకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ వీడియోలో ఓ గజరాజు.. మరో ఆడ ఏనుగుకు పుష్పగుచ్చంతో అందంగా ప్రపోజ్ చేసింది.

మనసుకు హత్తుకునే ఈ వీడియోలో ఏముందంటే.. ఒక గజరాజు.. తన ప్రియురాలైన మరో ఏనుగుకు ప్రపోజ్ చేస్తాడు. పుష్ప గుచ్చాన్ని తొండంతో పట్టుకుని.. ఆడ ఏనుగుకు అందజేస్తాడు. ఆ పుష్ప గుచ్చాన్ని అందుకున్న ఆడ ఏనుగు.. ప్రేమను అంగీకరిస్తున్నట్లుగా సంజ్ఞలు ఇవ్వడం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ఆ తరువాత రెండు ఏనుగులు తమ తొండాలను మేలివేసి హగ్ చేసుకుంటున్నట్లుగా ఫోజ్ ఇవ్వడం కొసమెరుపు. ఈ అద్భుతమైన వీడియోను “Elephantsofworld” పేరుతో ఉన్న ఇన్‌స్టాగ్రమ్ పేజీలో షేర్ చేయగా.. అదికాస్తా వైరల్‌గా మారింది. ఇప్పటి వరకు ఈ వీడియోను వేల సంఖ్యలో నెటిజన్లు వీక్షించారు. అనేక లైక్స్ వచ్చాయి. వాటి ప్రేమకు ఫిదా అయిపోతున్నారు. రకరకాల కామెంట్స్ పెడుతున్నారు. ‘జీవితంలో ఇప్పటి వరకు ఇంత అందమైన వీడియోను ఎప్పుడూ చూడలేదు’ అని ఓ నెటిజన్ పేర్కొన్నారు. గజరాజు ప్రేమను అర్థం చేసుకున్నారని అంటున్నారు. ‘నేను చాలాసార్లు మనుషులు ప్రపోజ్ చేయడం చూశాను కానీ, ఏనుగు ప్రపోజ్ చేయడం నిజంగా చాలా అందంగా ఉంది.’ అని మరో నెటిజన్ పేర్కొన్నారు.

Viral Video:

Also read:

Abu Dhabi T10 League: అబుదాబిలో పరుగుల విధ్వంసం.. గేల్, స్టెర్లింగ్‌ల ధాటికి చేతులెత్తేసిన బౌలర్లు..!

‘చంద్రబాబు మాయలో పడొద్దు.. సీనియర్ ఎన్టీఆర్ ఇష్యూలో చేసినట్లుగానే..’ లక్ష్మీ పార్వతి సంచలన వ్యాఖ్యలు..

Naga Babu: చంద్రబాబు కంటతడి పెట్టడంపై స్పందించిన మెగా బ్రదర్‌.. అసెంబ్లీ పరిణామాలపై సీరియస్ కామెంట్స్..