Watch Video: సిక్స్‌ కొట్టాడని బ్యాట్స్‌మెన్‌ను గాయపరిచిన పాక్ బౌలర్.. సిరీస్‌ నుంచి నిషేధించాలంటోన్న బంగ్లా ఫ్యాన్స్..!

BAN Vs PAK: బంగ్లాదేశ్‌తో జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో షాహీన్ అఫ్రిది కోపంతో ఊగిపోయాడు. దీంతో షాహీన్‌ను నిషేధించాలనే డిమాండ్ తెరపైకి వచ్చింది.

Watch Video: సిక్స్‌ కొట్టాడని బ్యాట్స్‌మెన్‌ను గాయపరిచిన పాక్ బౌలర్.. సిరీస్‌ నుంచి నిషేధించాలంటోన్న బంగ్లా ఫ్యాన్స్..!
Ban Vs Pak Shaheen Afridi
Follow us
Venkata Chari

|

Updated on: Nov 20, 2021 | 4:35 PM

Bangladesh vs Pakistan: పాకిస్థాన్ స్టార్ ఫాస్ట్ బౌలర్ షాహీన్ అఫ్రిది మరోసారి వార్తల్లో నిలిచాడు. అయితే ఈసారి షాహీన్ అఫ్రిది తన బౌలింగ్ కారణంగా మాత్రం కాకుండా మైదానంలో అతని వింత ప్రవర్తనతో సోషల్ మీడియాలో ట్రోల్‌కి గురయ్యాడు. అతనిని నిషేధించాలనే చర్చ కూడా కొనసాగుతోంది. బంగ్లాదేశ్‌తో జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో షాహీన్ ఆఫ్రిది బంగ్లాదేశ్ బ్యాట్స్‌మెన్‌ను కొట్టాడు. క్రీజులో నిలబడిన అఫీఫ్ హుస్సేన్ వైపు షాహీన్ ఆఫ్రిది విసిరిన త్రో అతని కాలికి తగిలింది. ఆ దెబ్బకు బ్యాట్స్‌మెన్ కిందపడిపోయి నొప్పితో బాధపడటం వీడియోలో చూడోచ్చు.

కోపంతోనే షాహీన్ అఫ్రిది ఈ పని చేయడంతో వివాదాలకు దారి తీస్తోంది. అసలు విషయానికి వస్తే మూడో ఓవర్ వేసిన అఫ్రిది.. తన రెండో బంతికి అఫీఫ్ హుస్సేన్ అద్భుత సిక్సర్ బాదాడు. దీంతో షాహీన్‌ అఫ్రిది తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు. తర్వాతి బంతికి అఫీఫ్ హుస్సేన్ బంతిని సునాయాసంగా ఆడగా, బంతి నేరుగా షాహీన్ వద్దకు వెళ్లింది. దీంతో తన కోపాన్ని బంతి రూపంలో చూపించాడు షాహీన్.. ఆ బంతిని పట్టుకుని స్ట్రెయిట్ త్రోను బ్యాట్స్‌మెన్‌ వైపు విసిరాడు. దాంతో ఆ బంతి అఫీఫ్ హుస్సేన్ పాదాలకు చాలా బలంగా తాకింది.

అఫీఫ్ హుస్సేన్ గాయపడిన వెంటనే షాహీన్ ఆఫ్రిది కోపం చల్లబడింది. అఫ్రిది బ్యాట్స్‌మెన్ వద్దకు వెళ్లి అతనిని పైకి లేపాడు. పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ ఆజం కూడా అఫీఫ్‌ క్షేమాన్ని అడిగి తెలుసుకున్నాడు. అఫీఫ్ కుంటుతూ నడిచాడు. అయితే అతనికి పెద్దగా గాయం కాలేదు. షాహీన్ అఫ్రిది ఈ చర్య క్రికెట్ అభిమానులకు నచ్చలేదు. దీంతో ఈ ఆటగాడి మ్యాచ్ ఫీజును తగ్గించాలని, ఒక మ్యాచ్‌ నుంచి నిషేధించాలని డిమాండ్ చేస్తున్నారు.

జేమ్స్ ప్యాటిన్సన్ కూడా నిషేధానికి గురయ్యాడు.. షాహీన్ ఆఫ్రిది, జేమ్స్ ప్యాటిన్సన్ కూడా మైదానంలో ఇలాంటి చర్యతో వార్తల్లో నిలిచారు. షెఫీల్డ్ షీల్డ్ మ్యాచ్ సమయంలో అతను ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్‌ను కొట్టాడు. దాంతో ఆ ఆటగాడికి తీవ్రం అయింది. ఈ చర్య తర్వాత, జేమ్స్ ప్యాటిన్సన్ మ్యాచ్ ఫీజులో కోత విధించి, ఒక మ్యాచ్ నుంచి నిషేధించారు. షాహీన్ అఫ్రిదిపై అటువంటి చర్య తీసుకుంటారా, లేదా చూడాలి.

Also Read: IND vs NZ: భారత క్రికెట్‌లో ‘ఒకే ఒక్కడు’.. రాంచీలో రికార్డుల వర్షం.. హిట్‌మ్యాన్ దెబ్బకు క్రిస్‌గేల్‌ కూడా వెనక్కే.. అవేంటంటే?

Viral Video: గంటకు 219 కి.మీ. వేగంతో బంతి విసిరిన బౌలర్.. షోయబ్ అక్తర్ ప్రపంచ రికార్డుకు బ్రేకులు?