AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bullet bandi song: ‘నీ బుల్లెట్టు బండెక్కి వచ్చేత్తా పా’ సాంగ్‌కు నర్సు కిర్రాక్ డ్యాన్స్.. కట్‌ చేస్తే, ఉద్యోగానికి ఎసరు

రెండు రోజుల క్రితం బుల్లెట్ బండి పాట ఎంత పాపులర్‌ అయిందో అందరికి తెలుసు. పెళ్లి బరాత్‌లో వధువు, వరుడుకు సర్‌ప్రైజ్‌ ఇస్తూ చేసిన డ్యాన్స్‌కు...

Bullet bandi song: ‘నీ బుల్లెట్టు బండెక్కి వచ్చేత్తా పా’ సాంగ్‌కు నర్సు కిర్రాక్ డ్యాన్స్..  కట్‌ చేస్తే, ఉద్యోగానికి ఎసరు
Nurse Dance
Ram Naramaneni
|

Updated on: Aug 21, 2021 | 7:05 PM

Share

రెండు రోజుల క్రితం బుల్లెట్ బండి పాట ఎంత పాపులర్‌ అయిందో అందరికి తెలుసు. పెళ్లి బరాత్‌లో వధువు, వరుడుకు సర్‌ప్రైజ్‌ ఇస్తూ చేసిన డ్యాన్స్‌కు సంబంధించిన వీడియో.. ఫుల్‌ ట్రెండ్‌ అయింది. డ్యాన్స్‌తో కొత్త జంటకు సెలబ్రిటీ హోదా వచ్చింది. అయితే అదే పాట ఒకరి ఉద్యోగానికి ఎసరు తెచ్చింది. అవును అదే సాంగ్‌కు డ్యాన్స్‌ చేసి, చిక్కులో పడిందో నర్సు. పంద్రాగస్టు రోజున రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లి PHCలో ఓ నర్సు బుల్లెట్ బండి పాటకు డ్యాన్స్‌ చేసింది.  ఈ విషయం ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లింది.   జిల్లా వైద్యాధికారి సుమన్‌ మోహన్‌ రావుఈ వ్యవహారంపై సీరియస్‌ యాక్షన్‌ తీసుకున్నారు. ఆన్‌ డ్యూటీలో ఉండటమే కాకుండా.. ఇండిపెండెంట్స్‌ డే రోజున ఇలా పాటలు పెట్టుకోని డ్యాన్స్‌లు చేయడంపై మండిపడ్డారు. డ్యాన్స్‌ చేసిన మహిళకు మెమో జారీ చేశారు. కాంట్రాక్ట్ నర్సుగా పనిచేస్తున్న రజని.. కరోనా రోగులకు సేవలు చేసిన క్రమంలో తాను కూడా వైరస్‌ బారిన పడ్డారు. అనంతరం కోలుకొన్నారు. పంద్రాగస్టు రోజున తోటి ఉద్యోగులు ఎంకరేజ్‌ చేస్తేనే తాను డ్యాన్స్‌ చేశానని ఆమె అంటోంది. తాను డ్యూటీకి డుమ్మా కొట్టి ఎంజాయ్‌ చేయలేదని ఆమె చెప్తోంది.

అయితే జ్యోతికి మెమో జారీ చేయడంతో నెటిజన్లు తప్పుపడుతున్నారు. దీనిపై ఓ నెటిజన్‌ స్పందిస్తూ ‘‘కొన్ని రోజుల క్రితం డాక్టర్లు, నర్సులు చేసిన డ్యాన్స్‌లకు జనాలు క్లాప్స్ కొట్టి, కాంప్లిమెంట్స్ ఇచ్చారు. అప్పుడు ఎంత మందికి మెమోలు జారీ చేశారు. ఆ సమయంలో కనిపించని తప్పు ఇప్పుడు ఎందుకు?’’ అంటూ ప్రశ్నించాడు.

అసలు ఈ బుల్లెట్ బండి సాంగ్ ఎవరు పాడారు…

ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతున్న ‘నీ బుల్లెట్టు బండెక్కి వచ్చేత్తా పా’  సాంగ్‌ను  ప్రముఖ గాయని మోహన భోగరాజు ఆలపించారు. లక్ష్మణ్‌ రచించిన ఈ పాటకు ఎస్‌కే బాజి సంగీతం అందించారు.  ఆగస్టు ఏప్రిల్‌ 7న యూట్యూబ్‌‌లో విడుదలైన ఈ ప్రవేట్ సాంగ్ ఇప్పటివరకు మూడు కోట్లకు పైచిలుకు వ్యూస్ దక్కించుకుంది.  లైక్‌లు లక్షల్లో.. షేర్లు, కామెంట్లు వేలల్లో వస్తున్నాయి.

Also Read: వీడుతోన్న రాహుల్ హత్య మిస్టరీ.. టీవీ9 చేతిలో కేసు ఎఫ్‌ఐఆర్‌ రిపోర్ట్

Telangana: పగలు సర్పంచ్.. రాత్రి సెక్యూరిటీ గార్డ్.. పాపం ఇరుసు మల్లేష్

Follow Us
ధర్మాజీపేటలో వరుస ఆలయ దొంగతనాలు.. హుండీలు, ఆభరణాలు మాయం!
ధర్మాజీపేటలో వరుస ఆలయ దొంగతనాలు.. హుండీలు, ఆభరణాలు మాయం!
కొత్త కారు కొనాలనుకుంటే ఇదే బెస్ట్‌ ఆప్షన్‌!
కొత్త కారు కొనాలనుకుంటే ఇదే బెస్ట్‌ ఆప్షన్‌!
మాజీ ఆర్మీ జవాన్.. తాగుడు అతడ్ని ఇంతలా దిగజార్చింది..
మాజీ ఆర్మీ జవాన్.. తాగుడు అతడ్ని ఇంతలా దిగజార్చింది..
అందుకే జీవన్ రెడ్డి కాంగ్రెస్‌ను వీడారు..మల్లు రవి కీలక వ్యాఖ్యలు
అందుకే జీవన్ రెడ్డి కాంగ్రెస్‌ను వీడారు..మల్లు రవి కీలక వ్యాఖ్యలు
టేస్ట్.. డబుల్ ఎనర్జీ.. ఎవ్వరికీ తెలియని రాగి లడ్డు రెసిపీ ఇదే..
టేస్ట్.. డబుల్ ఎనర్జీ.. ఎవ్వరికీ తెలియని రాగి లడ్డు రెసిపీ ఇదే..
పిల్లలకు ఇస్తున్న క్రీమ్ బిస్కెట్లలో అసలు క్రీమ్ ఉందా?
పిల్లలకు ఇస్తున్న క్రీమ్ బిస్కెట్లలో అసలు క్రీమ్ ఉందా?
రంగు పోయిన రోల్డ్ గోల్డ్ నగలకు ఇంట్లోనే మెరుగు
రంగు పోయిన రోల్డ్ గోల్డ్ నగలకు ఇంట్లోనే మెరుగు
ఈ మొక్క మీ ఇంట్లో ఉంటే బల్లులకు చుక్కలే.. ఇలా చేస్తే ఒక్కటి కూడా
ఈ మొక్క మీ ఇంట్లో ఉంటే బల్లులకు చుక్కలే.. ఇలా చేస్తే ఒక్కటి కూడా
పీఎఫ్ ఖాతాదారులకు కేంద్రం సూపర్ న్యూస్.. దేశంలో ఎక్కడైనా..
పీఎఫ్ ఖాతాదారులకు కేంద్రం సూపర్ న్యూస్.. దేశంలో ఎక్కడైనా..
ఐపీఎల్ లో వైభవ్ సూర్యవంశీ సంచలన రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్‌మెంట్
ఐపీఎల్ లో వైభవ్ సూర్యవంశీ సంచలన రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్‌మెంట్