AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rahul Murder Case: వీడుతోన్న రాహుల్ హత్య మిస్టరీ.. టీవీ9 చేతిలో కేసు ఎఫ్‌ఐఆర్‌ రిపోర్ట్

డొంక కదులుతోంది. పుట్ట పగులుతోంది. రాహుల్‌ మర్డర్‌ మిస్టరీ వీడుతోంది. రాహుల్‌ హత్య కేసు ఎఫ్‌ఐఆర్‌ టీవీ9 చేతికొచ్చింది. ఎఫ్‌ఐఆర్‌లో ఐదుగురి...

Rahul Murder Case: వీడుతోన్న రాహుల్ హత్య మిస్టరీ.. టీవీ9 చేతిలో కేసు ఎఫ్‌ఐఆర్‌ రిపోర్ట్
Rahul Murder Case
Ram Naramaneni
|

Updated on: Aug 21, 2021 | 6:15 PM

Share

డొంక కదులుతోంది. పుట్ట పగులుతోంది. రాహుల్‌ మర్డర్‌ మిస్టరీ వీడుతోంది. రాహుల్‌ హత్య కేసు ఎఫ్‌ఐఆర్‌ టీవీ9 చేతికొచ్చింది. ఎఫ్‌ఐఆర్‌లో ఐదుగురి పేర్లను చేర్చారు పోలీసులు. తీవ్ర కలకలం రేపిన రాహుల్‌ హత్య కేసులో పోలీసులు కీలక సమాచారం రాబట్టారు. సెక్షన్‌ 302, 120బీ రెడ్‌ విత్‌ 34 ఐపీసీ కింద కేసు నమోదు చేశారు మాచవరం పోలీసులు. ఏ1 గా కొరడ విజయ్‌కుమార్‌, ఏ2గా కోగంటి సత్యం, ఏ3గా పద్మజ, ఏ4గా పద్మజ, ఏ5గా గాయత్రిని ఎఫ్‌ఐఆర్‌లో చేర్చారు పోలీసులు. రాహుల్‌ తండ్రి కరణం రాఘవరావు ఫిర్యాదుతో దర్యాప్తును స్పీడప్‌ చేశారు. పక్కా స్కెచ్‌తోనే రాహుల్‌ హత్య జరిగినట్లు నిర్ధారించారు పోలీసులు. మెడకు తాడు బిగించి, ముక్కుపై దిండు అదిమిపెట్టి చంపినట్లు పోస్టుమార్టం నివేదికలో వెల్లడైంది. ఈ కేసులో లభించిన సాక్ష్యాధారాలతో విజయ్‌కుమార్‌ను ప్రధాన నిందితుడిగా గుర్తించారు. వ్యాపార లావాదేవీలే రాహుల్‌ హత్యకు కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు. కొన్నిరోజులుగా రాహుల్‌, వ్యాపార భాగస్వామి విజయ్‌కు మధ్య విభేదాలు నడుస్తున్నాయి. తన వాటా 15 కోట్లు ఇచ్చేయాలంటూ రాహుల్‌పై విజయ్ ఒత్తిడి తెచ్చాడు. నిందితుడు విజయ్ గత ఎన్నికల్లో విజయవాడ పశ్చిమ నియోజకవర్గం నుంచి పోటీచేసి ఓడాడు. ఎన్నికల్లో ఓటమితో భారీగా నష్టపోయానని.. వెంటనే డబ్బులివ్వాలంటూ ఒత్తిడి తెచ్చాడు. రాహుల్ కాలయాపన చేస్తుండటంతో పక్కా ప్రణాళికతో హత్య చేశాడు.

హత్య వెనకాల ఉన్న కుట్ర కేసులో కోగంటి సత్యం పాత్రను విజయవాడ పోలీసులు గుర్తించారు. ప్రధాన నిందితుడు దొరికితే కోగంటి సత్యంపై క్లారిటీ వస్తుంది  అంటున్నారు.  హత్యకు మాస్టర్ ప్లాన్ వేసింది  కోగంటి టీమ్‌గా పోలీసులు భావిస్తున్నారు. గతంలో జరిగిన పంజాగుట్ట మర్డర్ తరహాలో స్పాట్‌లో లేకుండా కోగంటి దీన్ని ప్లాన్ చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. అందుకే కేసులో అతడిని ఏ2గా చేర్చి విచారణ జరుపుతున్నారు.

Also Read: Telangana: పగలు సర్పంచ్.. రాత్రి సెక్యూరిటీ గార్డ్.. పాపం ఇరుసు మల్లేష్

 ‘టీడీపీ అంటే తెలుగు తాలిబన్ పార్టీ’.. సంచలన వ్యాఖ్యలు చేసిన వైసీపీ ఎమ్మెల్యే జోగి రమేష్