Jogi Ramesh: ‘టీడీపీ అంటే తెలుగు తాలిబన్ పార్టీ’.. సంచలన వ్యాఖ్యలు చేసిన వైసీపీ ఎమ్మెల్యే జోగి రమేష్

Jogi Ramesh: 'టీడీపీ అంటే తెలుగు తాలిబన్ పార్టీ'.. సంచలన వ్యాఖ్యలు చేసిన వైసీపీ ఎమ్మెల్యే జోగి రమేష్
MLA JOGI RAMESH

పెడన ఎమ్మెల్యే జోగి రమేష్ తెలుగుదేశం పార్టీపై, ఆ పార్టీ అధినేత చంద్రబాబుపై సంచలన వ్యాఖ్యలు చేశారు. టీడీపీ అంటే తెలుగు తాలిబన్ పార్టీ అని..

Ram Naramaneni

|

Aug 21, 2021 | 5:11 PM

పెడన ఎమ్మెల్యే జోగి రమేష్ తెలుగుదేశం పార్టీపై, ఆ పార్టీ అధినేత చంద్రబాబుపై సంచలన వ్యాఖ్యలు చేశారు. టీడీపీ అంటే తెలుగు తాలిబన్ పార్టీ అని.. తాలిబన్ పార్టీకి చంద్రబాబు అధ్యక్షుడని పేర్కొన్నారు. ‘దళితుల్లో పుట్టాలని, దళిత వాడల్లో పెరగాలని ఎవరు కోరుకుంటారు’ అని గతంలో చంద్రబాబు అనలేదా అని రమేష్ ప్రశ్నించారు. ‘విశ్వ బ్రాహ్మణుల తోకలు కట్ చేస్తా, అగ్నికుల క్షత్రియులను తరిమికొడతా’ అని చంద్రబాబు మాట్లాడలేదా అని ఫైరయ్యారు. ఇలాంటి మాటలు అన్న చంద్రబాబును ఉరి తియ్యలా? కేసు పెట్టాలా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. తన మాటలను వక్రీకరించి పోలీసులకు కంప్లైంట్ చేస్తున్నారంటూ విమర్శలు గుప్పించారు.

రాష్ట్రంలో ఎస్సీ, బీసీ, మైనార్టీలు కలిసిమెలిసి కుటుంబంలా ఉన్నారని.. కులాల మధ్య చిచ్చు పెట్టాలని చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని జోగి రమేష్ ఆరోపించారు. సీఎం జగన్ మోహన్ రెడ్డి  అన్ రిజర్వ్‌డ్ స్థానాల్లో 75 కార్పొరేషన్లల్లో.. అధికశాతం బలహీన వర్గాలకు అవకాశం ఇచ్చారని పేర్కొన్నారు. తాను అంబేద్కర్ గురించి, సీఎం జగన్ గురించి మాట్లాడిన మాటలను వక్రీకరించారని జోగి రమేష్ తీవ్ర స్థాయిలో ఫైరయ్యారు. టీడీపీ నాయకులు విచ్చిన్న ఆలోచలతో విషపూరిత వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడ్డారు. బలహీన వర్గాలను జగన్ బలమైన వర్గలుగా మారుస్తారని, సర్కార్ సంక్షేమ పథకాలను టీడీపీ జీర్ణించుకోలేక పోతుందని జోగి రమేష్ విమర్శించారు. పేదలకు ఇళ్ళ పట్టాలు ఇస్తున్నా టీడీపీ నాయకులు కోర్టులకు వెళుతున్నారని పేర్కొన్నారు. సీఎం జగన్ బీసీ, ఎస్సీ, ఎస్టీలు, మైనారిటీలకు చేస్తున్న లబ్ది చూసి చంద్రబాబు తట్టుకోలేకపోతున్నారని మండిపడ్డారు. ఎన్నికల్లో ప్రజలు బుద్ది చెప్పినా.. టీడీపీ వారికి జ్ఞానం రావడం లేదని ఫైర్‌ అయ్యారు జోగి రమేష్‌. బలహీన వర్గాలు అంబేద్కర్‌‌ను దేవుడిలా పూజిస్తాయని.. జగన్‌కు జేజేలు పలుకుతాయని జోగి రమేష్ పేర్కొన్నారు.

Also Read: పరిటాల సిద్ధార్థ్ వద్ద బుల్లెట్ కలకలం.. వారం రోజుల్లో సమాధానం చెప్పాలని పోలీసుల డెడ్‌లైన్‌..

ఏపీలో కొత్తగా 1217 కరోనా కేసులు.. యాక్టివ్ కేసులు, మరణాల వివరాలు ఇలా

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu