AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఫోన్లో 17 రకాల ఆర్టీఏ సేవలు.. ఇక నో ఆఫీస్..

ప్రస్తుతం కరోనా వ్యాప్తి కారణంగా తెలంగాణ రవాణా శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకూ వాహనాలకు సంబంధించి ఏ చిన్న పని ఉన్నా ఆర్టీఏ కార్యాలయానికి వెళ్లాల్సి ఉండేది. ఇకపై ఇంటి నుంచే నేరుగా సేవలను పొందవచ్చు. ఇందుకు ఆర్టీఏ ప్రణాళికలను రూపొందించింది. మరో వారం, పది రోజుల్లో ఈ సదుపాయం...

ఫోన్లో 17 రకాల ఆర్టీఏ సేవలు.. ఇక నో ఆఫీస్..
TV9 Telugu Digital Desk
|

Updated on: Jun 04, 2020 | 11:42 AM

Share

ప్రస్తుతం కరోనా వ్యాప్తి కారణంగా తెలంగాణ రవాణా శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకూ వాహనాలకు సంబంధించి ఏ చిన్న పని ఉన్నా ఆర్టీఏ కార్యాలయానికి వెళ్లాల్సి ఉండేది. ఇకపై ఇంటి నుంచే నేరుగా సేవలను పొందవచ్చు. ఇందుకు ఆర్టీఏ ప్రణాళికలను రూపొందించింది. మరో వారం, పది రోజుల్లో ఈ సదుపాయం అందుబాటులోకి రానుందని అధికారులు వెల్లడించారు. లెర్నింగ్ లైసెన్స్‌లు, డ్రైవింగ్ లైసెన్స్‌లు, వెహికల్స్ కొనుగోలు, అమ్మకాలు ఇలా అన్నింటికీ ఆఫీసులకు వెళ్లాల్సి ఉండేంది. అయితే ఇప్పుడు వాహనదారులు మొబైల్ ఫోన్‌ ద్వారా కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. సంబంధిత డాక్యుమెంట్లను ఆన్‌లైన్‌లోనే అప్‌లోడ్ చేయాలి. ఈ డాక్యుమెంట్లతో పాటు వినియోగదారుల సెల్ఫీ, డిజిటల్ సంతకాన్ని కూడా అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. ఫీజులను కూడా ఆన్‌లైన్‌లో చెల్లించాల్సి ఉంటుంది.

ఈ వివరాలను అధికారులు పరిశీలించిన వారం రోజుల్లో స్మార్ట్ కార్డులను స్పీడ్ పోస్ట్ ద్వారా ఇళ్లకు పంపిస్తారు. అయితే స్వయంగా రావాల్సిన సేవలు మినహాయించి.. మిగతా 17 రకాల సేవలను ఆన్‌లైన్ ద్వారా నేరుగా వినియోగదారులు ఉపయోగించుకోవచ్చు. అలాగే దరఖాస్తు చేసుకున్నవారికి ఎస్ఎంఎస్ ద్వారా వినియోగదారులు కోరుకున్న సేవలను ధృవీకరిస్తూ.. ఒక నెంబర్‌ను కేటాయిస్తారు. ఆర్టీఏ ఆన్‌లైన్‌లో లోపం జరిగినా, ఆలస్యమయినా, సాంకేతిక సమస్యలు తలెత్తినా.. ఈ నెంబర్ ద్వారా వివరాలు పొందవచ్చు. కాగా ఒకవేళ ఎవరైనా కార్యాలయానికి వచ్చినా.. వారు తప్పకుండా మాస్క్ ధరించి, సోషల్ డిస్టెన్స్ పాటించాలని అధికారులు తెలిపారు.

ఈ సేవలు మొబైల్‌లో అందుబాటులో ఉన్నాయి..

డ్రైవింగ్ లైసెన్స్ రెన్యువల్, డూప్లికేట్ డ్రైవింగ్ లైసెన్స్, లెర్నింగ్ లైసెన్స్ కాలపరిమితి పెంపు, లెర్నింగ్ లైసెన్స్‌లో ఒకటి కంటే ఎక్కువ వాహనాలకు అనుమతి కోరడం, వెహికల్స్ రిజిస్ట్రేషన్, వివిధ రకాల డాక్యుమెంట్ల చిరునామాలో మార్పులు, రవాణా వాహనాల పర్మిట్లు వంటి వివిధ రకాల 17 రకాల సేవలను తెలంగాణ ఆర్టీఏ మొబైల్ ద్వారా అందుబాటులోకి తీసుకురానున్నారు.

Read More: 

బాలీవుడ్‌ మరో విషాదం.. ఆయన ఇక లేరు

బాలీవుడ్‌లో విషాదం.. యంగ్ కాస్టింగ్ డైరెక్టర్ మృతి

Follow Us
భారత్‌లో బంగారం కొనుగోళ్లకు భారీ బ్రేక్.. కారణాలు ఇవే
భారత్‌లో బంగారం కొనుగోళ్లకు భారీ బ్రేక్.. కారణాలు ఇవే
దీపావళి రోజు ఇంట్లో ఈ ప్రదేశాల్లో దీపాలు వెలిగించండి.. లక్ష్మీ..
దీపావళి రోజు ఇంట్లో ఈ ప్రదేశాల్లో దీపాలు వెలిగించండి.. లక్ష్మీ..
రాప్తాడు ఘటనకు సినిమాలే కారణమా? సందీప్ రెడ్డి వంగా సంచలన ట్వీట్
రాప్తాడు ఘటనకు సినిమాలే కారణమా? సందీప్ రెడ్డి వంగా సంచలన ట్వీట్
దమ్ముంటే కాస్కో..ఈ చిత్రంలో ఉన్న 5 జంతువులను గుర్తిస్తే మీరే తోపు
దమ్ముంటే కాస్కో..ఈ చిత్రంలో ఉన్న 5 జంతువులను గుర్తిస్తే మీరే తోపు
ప్రేయసి కోసమే ఆ చిలిపి సెలబ్రేషన్..: అర్ష్‌దీప్ సింగ్
ప్రేయసి కోసమే ఆ చిలిపి సెలబ్రేషన్..: అర్ష్‌దీప్ సింగ్
బాలు ప్యాంట్ సీక్రెట్ రివీల్ చేసిన రేణు దేశాయ్..
బాలు ప్యాంట్ సీక్రెట్ రివీల్ చేసిన రేణు దేశాయ్..
ఇనుమంత బలం కావాలా? రోజువారీ ఆహారంలో ఈ పప్పును చేర్చుకోండి!
ఇనుమంత బలం కావాలా? రోజువారీ ఆహారంలో ఈ పప్పును చేర్చుకోండి!
బెంగాల్‌లో దీపావళి రోజున లక్ష్మీదేవికి బదులుగా కాళీదేవిని..
బెంగాల్‌లో దీపావళి రోజున లక్ష్మీదేవికి బదులుగా కాళీదేవిని..
కేసీఆర్ వల్లే నాకు ప్రభుత్వ ఉద్యోగం వచ్చింది: జబర్దస్త్ నటుడు
కేసీఆర్ వల్లే నాకు ప్రభుత్వ ఉద్యోగం వచ్చింది: జబర్దస్త్ నటుడు
ఆ సినిమాలో నేను పాడకుండా ఉండాల్సింది.. ఆర్పీ పట్నాయక్..
ఆ సినిమాలో నేను పాడకుండా ఉండాల్సింది.. ఆర్పీ పట్నాయక్..