AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: సీసీ కెమెరాలను చూస్తూ దర్జాగా వెంటిలేటర్ల చోరీ.. ఆ ప్రభుత్వాస్పత్రిలో ఇది పరిస్థితి

ఆదిలాబాద్ రిమ్స్ ఆస్పత్రి తీరు మరోసారి వివాదాస్పదంగా మారింది. ఆస్పత్రి నిర్వహణలో నిర్లక్ష్యం దొంగలు, దుండగులకు కలిసొస్తోంది. బయటి నుంచి వచ్చి మరీ దర్జాగా RICUలోని వెంటిలేటర్లను ఎత్తుకెళ్తున్నారు అగంతకులు. తాజాగా అక్టోబర్ 30న పట్టపగలే 30లక్షల విలువైన వెంటలేటర్ల మాయం చేశారు కేటుగాళ్లు. ఘటనపై కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Telangana: సీసీ కెమెరాలను చూస్తూ దర్జాగా వెంటిలేటర్ల చోరీ..  ఆ ప్రభుత్వాస్పత్రిలో ఇది పరిస్థితి
Adilabada Rims Ventilator Theft
Anand T
|

Updated on: Nov 04, 2026 | 10:55 AM

Share

ఆదిలాబాద్ రిమ్స్ ఆస్పత్రి తీరు మరోసారి వివాదాస్పదంగా మారింది. అధికారుల నిర్లక్ష్యానికి సంబంధించి కనీసం నెలకు ఒక ఘటనైనా ఉండాల్సిందే అన్నట్లు మారిపోయింది ప్రస్తుత పరిస్థితి. ఎందుకంటే సెప్టెంబర్‌లో ఏసీ షార్ట్ సర్క్యూట్‌ కారణంగా ఐదుగురు పసిబిడ్డలు చనిపోగా.. ఆ తర్వాత ఓ రోగికి వైద్యం చేయకపోగా వేధించిన ఘటన అక్టోబర్‌లో వెలుగులోకి వచ్చింది. అంతకుముందు మేలో ఓ వైద్య విద్యార్థినికి లైంగిక వేధింపుల వ్యవహారం, ఇంతకుముందు అక్రమంగా టెండర్లు కట్టబెట్టిన సీన్, ఇక ఇప్పుడేమో సెక్యూరిటీ లాప్స్‌, సిబ్బంది నిర్లక్ష్యం వెరసి పట్టపగలే దోపిడీ!

వివరాల్లోకి వెళ్తే.. తాజాగా ఆదిలాబాద్ రిమ్స్ హాస్పిటల్‌లో ఓ చోరీ జరిగింది. అక్టోబర్ 30న మధ్యాహ్నం వేళ హాస్పిటల్‌లోకి చొరబడిన కొందరు గుర్తుతెలియని వ్యక్తులు RICUలోకి వచ్చి బెడ్స్ పక్కనే ఉన్న వెంటిలేటర్లను పెకిలించి.. దర్జాగా ఎత్తుకెళ్లారు. అయితే వాళ్ల చోరీ మొత్తం సీసీ కెమెరాలు ఫ్రేమ్ టు ఫ్రేమ్ రికార్డ్ చేస్తున్నాయని తెలిసినప్పటికీ వాళ్లు ఏమాత్రం భయపడలేదు.. వాటివైపే చేస్తూ మరి వెంటిలేటర్లు ఎత్తుకెళ్లారు. అయితే ఈ విషయాన్ని వారం వరకు ఈ విషయాన్ని బయటకుపొక్కకుండా దాచిపెట్టింది రిమ్స్ యాజమాన్యం.

ఆ తర్వాత ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. సీసీ కెమెరా దృశ్యాల ఆధారంగా నిందితులను పట్టుకోవడానికి దర్యాప్తు ముమ్మరం చేశారు. త్వరలోనే నిందితులను అరెస్ట్ చేస్తామని తెలిపారు.

వీడియో చూడండి..

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us