AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వినియోగదారులకు బిగ్‌ అలర్ట్.. ఈ నెల కరెంటు బిల్లు పెరిగిందా?.. అసలు కారణం ఇదే..

Electricity Bills: తెలంగాణ ప్రజలకు ఈ నెల కరెంట్ బిల్లులు షాక్ ఇస్తున్నాయి. గత నెలతో పోల్చుకుంటే ఈ నెల వచ్చిన బిల్లులను చూసి వినియోగదారులు ఆశ్చర్యపోతున్నారు. ఇందుకు ప్రధాన కారణం ట్రూ-అప్ ఛార్జీల విధానం అమల్లోకి రావడమే. అంటే.. విద్యుత్ కొనుగోలుకు గతంలో అంచనా వేసిన వ్యయం కంటే వాస్తవంగా అయిన ఖర్చును సర్దుబాటు చేసేందుకు విద్యుత్ శాఖ వినియోగదారుల నుంచి అదనపు ఛార్జీలు వసూలు చేస్తోంది. దీంతో సాధారణంగా వచ్చే బిల్లు కంటే ఈ ఛార్జీలు అమల్లో ఉన్నప్పుడు బిల్లు మొత్తం పెరుగుతుంది.

వినియోగదారులకు బిగ్‌ అలర్ట్.. ఈ నెల కరెంటు బిల్లు పెరిగిందా?.. అసలు కారణం ఇదే..
Telangana Electricity Bills
Anand T
|

Updated on: Nov 04, 2026 | 10:18 AM

Share

తెలంగాణలోని విద్యుత్‌ వినియోగదారులకు కరెంటు బిల్లులు షాక్ కొడుతున్నాయి. రాష్ట్రంలో నవంబర్ నెల నుంచి ట్రూ-అప్ ఛార్జీల విధానం అమల్లోకి రావడంతో హైదరాబాద్‌తో పాటు రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల విద్యుత్ వినియోగదారులపై రెగ్యులర్‌గా వచ్చేంత కాకుండా కరెంటు బిల్లు పెరిగి వస్తుంది. దీంతో గతంతో పోల్చుకుంటే ఈ కొత్త విధానం అమల్లోకి వచ్చిన తర్వాత యూనిట్‌కు 30 పైసలు అదనంగా వసూలు చేస్తున్నారు. ఫలితంగా వినియోగదారులకు వచ్చే విద్యుత్ బిల్లు పెరుగుతుంది.

ఇక్కడ మరో షాకింగ్ విషయం ఏమిటంటే డిసెంబర్ నుంచి ఈ ఛార్జీ యూనిట్‌కు 50 పైసలకు పెరగనుంది. అయితే ఈ ఛార్జీల లెక్కింపు ప్రస్తుత నెల విద్యుత్ వినియోగం ఆధారంగా కాకుండా.. 2022-23, 2023-24 ఆర్థిక సంవత్సరాల్లో వినియోగదారులు ఉపయోగించిన విద్యుత్ ఆధారంగా జరుగుతుంది. దీంతో వినియోగదారుల విద్యుత్ బిల్లుల్లో అదనపు మొత్తం చేరుతోంది.

వ్యవసాయేతర వినియోగదారుల నుంచి రూ. 5,420 కోట్ల వసూలుకు తెలంగాణ విద్యుత్ నియంత్రణ కమిషన్ ఆమోదం తెలిపడంతో ఈ విధానాన్ని రాష్ట్రంలో అమల్లోకి తీసుకొచ్చారు. వ్యవసాయేతర విద్యుత్ వినియోగదారుల నుంచి మొత్తం రూ.5,420.23 కోట్లను వసూలు చేసేందుకు తెలంగాణ విద్యుత్ నియంత్రణ కమిషన్ (TGERC) ఆమోదం తెలిపింది. దీంతో ఈ విధానాన్ని రాష్ట్రంలో అమల్లోకి తీసుకొచ్చారు.

అసలేంటి ఈ ట్రూ-అప్ ఛార్జీలు?

ట్రూ-అప్ ఛార్జీ (True-up Charge) అంటే విద్యుత్ పంపిణీ సంస్థలు గతంలో విద్యుత్ కొనుగోలుకు అంచనా వేసిన ఖర్చు కంటే వాస్తవంగా ఎక్కువ అయినప్పుడు.. ఆ వ్యత్యాసాన్ని సర్దుబాటు చేసేందుకు వినియోగదారుల నుంచి అదనంగా వసూలు చేస్తారు. సులభంగా చెప్పాలంటే.. విద్యుత్ సంస్థలు కరెంట్ కొనుగోలు చేసి, వినియోగదారులకు సరఫరా చేసేందుకు చేసిన వాస్తవ ఖర్చుకు, విద్యుత్ బిల్లుల రూపంలో వచ్చిన ఆదాయానికి మధ్య ఉన్న వ్యత్యాసాన్ని భర్తీ చేసేందుకు ఈ విధానాన్ని ఉపయోగిస్తారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us