AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వీళ్లిద్దరూ మామూలు లేడీస్ కాదమ్మ.. టిప్‌టాప్‌గా అద్దె కోసం వచ్చారు.. ఆ తర్వాత లోపలికి వెళ్లి..

హనుమకొండలో అద్దె ఇంటి కోసం వచ్చినట్లు నటించిన ఇద్దరు మహిళలు 70 ఏళ్ల వృద్ధురాలిపై దోపిడీకి పాల్పడ్డారు. వాయుపుత్ర కాలనీలో ఇంట్లో ఒంటరిగా ఉన్న జయప్రదను కాళ్లు, చేతులు కట్టేసి నోట్లో గుడ్డలు కుక్కి మెడలోని బంగారు గొలుసు, చేతి గాజులు అపహరించారు. సీసీ కెమెరా దృశ్యాల ఆధారంగా పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు.

వీళ్లిద్దరూ మామూలు లేడీస్ కాదమ్మ.. టిప్‌టాప్‌గా అద్దె కోసం వచ్చారు.. ఆ తర్వాత లోపలికి వెళ్లి..
Hanamkonda Elderly Woman Robbery
G Peddeesh Kumar
| Edited By: |

Updated on: Nov 04, 2026 | 9:37 AM

Share

వరంగల్ లో మహిళా దొంగలు బరితెగించారు. టూ లెట్ బోర్డు ఉన్న ఇంటికి అద్దెకోసం వెళ్లి ఆ ఇంట్లో ఒంటరిగా ఉన్న వృద్ధురాలిపై అఘాయిత్యానికి పాల్పడ్డారు.. ఆమె నోట్లో గుడ్డలు కుక్కి మెడలోని బంగారు గొలుసుతో పాటు చేతికి ఉన్న బంగారు గాజులు అపహరించుకుపోయారు.. అద్దె ఇంటి కోసం వచ్చిన ఆ మహిళలు ఈ దారుణానికి పాల్పడ్డ ఘటన కలకలం రేపింది. స్పోర్ట్స్ మీట్‌లో నిమగ్నమైన పోలీసులు ఈ ఘటన తెలియగానే ఒక్కసారిగా అలర్ట్ అయ్యారు.. ఆ మహిళా దొంగలకోసం ముమ్మరంగా గాలిస్తున్నారు. హనుమకొండలోని జేఎన్ స్టేడియంలో రాష్ట్రస్థాయి పోలీస్ స్పోర్ట్స్ మీట్ జరుగుతుంది.. వివిధ ప్రాంతాల నుండి వచ్చిన పోలీసులు ఆటల్లో నిమగ్నమయ్యారు వారి టాలెంట్ నిరూపించుకుంటున్నారు.. పోలీసులు అంతా ఆటలో నిమగ్నమైన సందర్భం చూసి మహిళా దొంగలు రెచ్చిపోయారు. అదును చూసి దర్జాగా దోపిడీలకు భరితెగించారు.

హనుమకొండలోని వాయుపుత్ర కాలనీలో ఈ దోపిడి ఘటన జరిగింది. ఇద్దరు మహిళలు టూ లెట్ బోర్డు ఉన్న ఇంట్లో అద్దె కోసంవెళ్లి చోరీకి వెళ్లారు. ఈ సమయంలో జయప్రద అనే 70 ఏళ్ల వృద్ధురాలు ఇంట్లో ఒంటరిగా ఉంది.. వెళ్లినట్లే వెళ్లి.. ఆమెను ట్రాప్ చేశారు. ఆమెను బలవంతంగా కాళ్లు – చేతులు కట్టేసి నోట్లో గుడ్డలు కుక్కిన మహిళలు ఆ వృద్ధురాలి మెడలోని బంగారు గొలుసు, చేతికి ఉన్న బంగారు గాజులు అపహరించుకుపోయారు.

ఆ వృద్ధురాలు గట్టిగా అరవడంతో ఇరుగుపొరుగు వారు అప్రమత్తమయ్యారు.. వారిని పట్టుకునే ప్రయత్నం చేశారు.. కానీ అప్పటికే దోపిడీకి పాల్పడ్డ ఆ ఇద్దరు మహిళలు అక్కడి నుండి పారిపోయారు. ఆ ఇద్దరు మహిళా దొంగలు క్లాస్ గా తయారై వచ్చిన దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డయ్యాయి.. సీసీ కెమెరా ఫుటేజ్ ఆధారంగా పోలీసులు విచారణ జరుపుతున్నారు.

వీడియో చూడండి..

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us