Optical Illusion: దమ్ముంటే కాస్కో.. ఈ చిత్రంలో ఉన్న 5 జంతువులను గుర్తిస్తే మీరు తోపే!
తరచూ సోషల్ మీడియాలో అనేక చిత్రాలు, వీడియోలు వైరల్ అవుతూ ఉంటాయి. కానీ వాటిలో కొన్ని మాత్రమే జనాల దృష్టిని ఆకర్షిస్తాయి. అలాంటి చిత్రమే ప్రస్తుతం ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అవును.. ఈ కింద కనిపిస్తున్న చిత్రం నెటిజన్ల తెలివితేటలకు సవాల్ విసురుతోంది. దాన్ని మీరు సాల్వ్ చేయగలరేమో ప్రయత్నించండి.

ప్రస్తుత సాంకేతిక యుగంలో చాలా మంది మొబైల్‌లోనే ఎక్కువ సమయం గడుపుతున్నారు. ముఖ్యంగా సోషల్ మీడియాలో గంటలు గంటలు ఉంటూ రకరకాల ఫొటోలు, వీడియోలను వైరల్ చేస్తుంటారు. ఇలా జనాలు ఎక్కువగా వైరల్ చేసే చిత్రాల్లో ఆప్టికల్ ఇల్యూషన్స్ ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే ఇవి వారి తెలివితేటలకు ఎప్పటికప్పుడు సవాల్ విసురుతూ ఉంటాయి. దీంతో జనాలు కూడా వాటిని ఛాలెంజ్‌గా తీసుకొని సాల్వ్ చేస్తూ ఉంటారు.
ఈ ప్రక్రియ కేవలం వారి కళ్లకు, మెదడుకు పని చెప్పడమే కాదు.. నిజ జీవితంలో ఎదురయ్యే అనేక సమస్యలను పరిష్కరించడంలో కూడా సహాయపడుతుంది. కాబట్టి మీరు కూడా ఇలాంటి చిత్రాలను సాల్వ్ చేయడం ద్వారా తెలివితేటలు పెంచుకోవాలనుకుంటే, ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ చిత్రాన్ని సాల్వ్ చేయడానికి ప్రయత్నించండి.
వైరల్ చిత్రంలో ఏముంది?
ప్రస్తుతం వైరల్ అవుతున్న చిత్రంలో చెట్ల కింద కొన్ని జంతువులు ఉన్నాయి. అయితే మొదటి చూపులో చాలా మందికి అక్కడ కేవలం ఒక ఏనుగు, ఒక జిరాఫీ మాత్రమే కనిపిస్తాయి. కానీ అక్కడ మరో మూడు జంతువులు కూడా ఉన్నాయి. అవేంటి.. అవి ఎక్కడున్నాయో కనిపెట్టడమే ఇక్కడ మీకిచ్చే టాస్క్. అది కూడా కేవలం 10 సెకన్లలో. ఈ సవాల్‌కు మీరు సిద్ధమే అయితే మీ టైం ఇప్పుడే స్టార్ట్ అవుతుంది.
సమాధానం దొరికిందా?
మీకు ఇచ్చిన సమయంలో ఆ చిత్రంలో ఉన్న మిగతా మూడు జంతువులను కనిపెట్టి ఉంటే కంగ్రాట్స్! మీరు తెలివైనవారని, మీ కళ్లు చాలా షార్ప్‌గా ఉన్నాయని అర్థం. ఒకవేళ అక్కడ మీకు మిగతా జంతువులు కనిపించకపోయినా ఏం పర్లేదు. సమాధానం కింద ఉన్న చిత్రంలో చూడండి.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
