Sandeep Reddy Vanga: రాప్తాడు ఘటనకు సినిమాలే కారణమా? సందీప్ రెడ్డి వంగా సంచలన ట్వీట్
అనంతపురం జిల్లా రాప్తాడు ఘటనకు సినిమాలే కారణమని కొందరు విమర్శలు గుప్పిస్తున్నారు. సినిమాల్లోని హింసాత్మక సన్నివేశాల కారణంగానే యువత పెడదోవ పడుతున్నాంటూ ట్రోల్స్ చేస్తున్నారు. అనంతపురం జిల్లా రాప్తాడులోని ఈ విమర్శలపై ఘాటుగా స్పందించారు సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా.

ఇటీవల అనంతపురం జిల్లా రాప్తాడులో జరిగిన దారుణ ఘటన రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించింది. పాఠశాల తరగతి గదిలో ఉన్న ఓ విద్యార్థినిపై రంపం తో దాడి చేయడం అందరినీ కలవరానికి గురి చేసింది. ప్రస్తుతం బాధితురాలు బెంగళూరు ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. అలాగే ఈ ఘోరానికి పాల్పడిన నిందితుడు పోలీసుల కాల్పుల్లో గాయపడి ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నాడు. కాగా ఈ హేయమైన చర్యను అందరూ ఖండిస్తున్నారు. సామాన్యులతో పాటు సినీ, రాజకీయ ప్రముఖులు కూడా ఈ ఘటనపై స్పందించారు. అయితే రాప్తాడు ఘటనకు సినిమాలే కారణమంటూ కొందరు అభిప్రాయపడుతున్నారు. సినిమాల్లోని హింసాత్మక దృశ్యాలే యువతను తప్పుదోవ పట్టిస్తున్నాయంటూ విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ విమర్శకులపై ఇప్పటికే వేణు ఊడుగుల స్పందించారు. తాజాగా టాలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి ఈ విమర్శలపై రియాక్ట్ అయ్యాడు. విషాదాన్ని అడ్డం పెట్టుకుని వ్యక్తిగత కక్షలు తీర్చుకుంటున్నారంటూ సోషల్ మీడియాలో ఒక సంచలన పోస్ట్ పెట్టాడు.
‘సమాజంలో ఎప్పుడైనా ఇలాంటి భయానక నేరాలు జరిగినప్పుడు, మన మొదటి స్పందన బాధితుల పట్ల సానుభూతి చూపించడం, అసలు సమస్య ఏమిటో లోతుగా విశ్లేషించడం కావాలి. అంతేతప్ప, ప్రతిసారీ సినిమాలను సులభమైన బలిపశువులా మార్చడం సరికాదు. మీ ఆందోళన అంతా బాధితుల కుటుంబాల గురించి కాదు.. ఒక ఘోరమైన విషాదాన్ని అడ్డుపెట్టుకొని వ్యక్తిగత కక్షలు తీర్చుకోవడానికి దీనిని ఒక మురికి అవకాశంగా మల్చుకుంటున్నారు. కొందరు విఫలమైన నటులు, దర్శకులు, నిర్మాతలు.. ఎప్పుడెప్పుడు ఎవరెవరిపై విమర్శలు చేద్దామా అని ఎదురుచూస్తుంటారు. ఇలాంటి దుర్ఘటనలు జరిగినప్పుడు తామే ఏదో గొప్ప సామాజిక వేత్తలా బిల్డప్ ఇస్తూ ఇతరుల పనులపై పడతారు. ఇది సరికాదు. చివరగా.. ఒక విషాదం అనేది కేవలం సానుభూతిని మాత్రమే కోరుకుంటుంది కానీ, ఇలాంటి అవకాశవాదాన్ని కాదు. దయచేసి రెండింటి మధ్య ఉన్న తేడాను తెలుసుకోండి’ అంటూ విమర్శకులకు కౌంటర్ ఇచ్చారు సందీప్ రెడ్డి.
సందీప్ రెడ్డి వంగా ట్వీట్..
When someone commits a heinous crime, the first response should be empathy & an attempt to understand the larger problem. Not finding a convenient scapegoat in cinema. It is becoming increasingly clear that your concern is not for the victims or their families, but that you’re using a horrific tragedy as a dirty excuse to settle your personal scores. This is especially directed at those failed frustrated jobless male/female actors, few directors, producers & parasites, who suddenly appoint themselves as social reformers whenever an opportunity arises to take a dig at someone else’s work.
A tragedy deserves empathy 🙏, not opportunism. Learn the difference.
— Sandeep Reddy Vanga (@imvangasandeep) November 4, 2026
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి




