Telangana: ఈ జంట కొంచెం డిఫరెంట్.. పెళ్లికొచ్చినవారికి రిటర్న్ గిఫ్ట్‌గా భగవద్గీత
పెళ్లికి వెళ్తే ఆహ్వానాలు ఉంటాయి. విందు భోజనాలు ఉంటాయి. నమస్కారాలతో వీడ్కోలు ఉంటాయి. కానీ ఇక్కడ పెళ్లికి వచ్చిన బంధుమిత్రులను ప్రేమగా స్వాగతించి, విందు భోజనాలను అందించి, ఆశీస్సులు అందుకుని రిటర్న్ గిఫ్ట్‌గా వారికి వధూవరులు, వారి తల్లిదండ్రులు భగవద్గీత.. ఆ వివరాలు ఇలా

పెళ్లికి వెళ్తే ఆహ్వానాలు ఉంటాయి. విందు భోజనాలు ఉంటాయి. నమస్కారాలతో వీడ్కోలు ఉంటాయి. కానీ ఇక్కడ పెళ్లికి వచ్చిన బంధుమిత్రులను ప్రేమగా స్వాగతించి, విందు భోజనాలను అందించి, ఆశీస్సులు అందుకుని రిటర్న్ గిఫ్ట్‌గా వారికి వధూవరులు, వారి తల్లిదండ్రులు భగవద్గీత పుస్తకాలను బహుకరించి తమ ఆధ్యాత్మిక ప్రేమను ప్రకటించుకున్నారు. సిద్దిపేట రెడ్డి ఫంక్షన్ హాల్‌లో గురువారం వల్లబోజు లత, బుచ్చిబాబు కూతురు చందన వివాహం హర్షవర్ధన్‌తో జరిగింది. ఈ సందర్భంగా నూతన వధూవరులకు ఆశీస్సులు అందించిన సుమారు 500 మంది బంధుమిత్రులకు భగవద్గీత పుస్తకాలను బహుకరించారు. శ్రీకృష్ణుని ఆశీస్సులు ఉండాలని అభిలాషించారు. ఈ ఆకస్మిక రిటర్న్ గిఫ్ట్‌లతో పెళ్లికి వచ్చిన అతిథులు ఆశ్చర్యానికి, ఆనందానికి గురయ్యారు. చిరునవ్వులతో ధన్యవాదాలు ప్రకటించారు.
